నర్తకి పాత్రలో పూజిత.. విలేజ్ హారర్ మూవీ | Pujita Ponnada Movie Latest News | Sakshi
Sakshi News home page

నర్తకి పాత్రలో పూజిత.. విలేజ్ హారర్ మూవీ

Oct 6 2026 8:22 AM | Updated on Oct 6 2026 8:22 AM

Pujita Ponnada Movie Latest News

"ఎస్ఆర్ కళ్యాణమండపం" సినిమాతో దర్శకుడిగా ఆకట్టుకున్న డైరెక్టర్ శ్రీధర్ గాదె.. కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ప్రొడ్యూసర్ వెంకట్ తలారి తమ ప్రొడక్షన్ నెం.3గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. "కమిటీ కుర్రోళ్లు" ఫేమ్ ఈశ్వర్ రుచిరాజు హీరోగా నటిస్తుండగా, నందు, లిఖిత హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. పూజిత పొన్నాడ, సింధు కాసారం ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా రెగ్యులర్ షూటింగ్ సాగుతోంది.

ఈ చిత్రంలో నర్తకి క్యారెక్టర్ లో టాలెంటెడ్ యాక్ట్రెస్ పూజిత పొన్నాడ నటిస్తున్నారు. పూజిత పుట్టినరోజు సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నర్తకి క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే హారర్ చిత్రమిది. ఈ సినిమాను సరికొత్త కథా కథనాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా దర్శకుడు శ్రీధర్ గాదె  తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement