దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం వారణాసి. ఈ మూవీలో ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న తొలి చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్, సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌కు విరామం లభించడంతో మహేశ్ బాబు ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్‌కు వెళ్లారు.
ఇదిలా ఉండగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యంగా సలార్ హీరో ప్రభాస్, మహేశ్ బాబు గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఆయన ప్రభాస్ గురించి ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. "ఒక సన్నివేశం కోసం మహేష్ బాబు దాదాపు 90-95 టేక్స్ తీసుకున్నారు. ఆ సమయంలో రాజమౌళి చాలా అసహనానికి గురై ఆ రోజు షూటింగ్‌ను నిలిపివేసి ప్యాక్ అప్ ప్రకటించారు" అని తెలిపారు. అయితే దీనిని విమర్శగా కాకుండా మహేశ్ తన పాత్రకు న్యాయం చేయాలనే పట్టుదలతో ఎంత కష్టపడతారో చెప్పే సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
అదే సమయంలో ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. "రాజమౌళి ఎప్పుడూ చెబుతుంటారు.. ప్రభాస్‌కు పెద్దగా ఏమీ చేయాల్సిన అవసరం ఉండదు. ఆయన కేవలం కెమెరా ముందు నిలబడితే చాలు.. మిగతా వాళ్లంతా తమ ప్రదర్శనతో ఆకట్టుకోవడానికి శ్రమిస్తుంటారు" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి. ఒకవైపు మహేష్ బాబు పాత్ర కోసం ఎంత కష్టపడతారో చెబుతూనే.. మరోవైపు ప్రభాస్‌కు ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్ ఎంత ప్రత్యేకమో అని ప్రశంసించారని అభిమానులు భావిస్తున్నారు. ఏదేమైనా మన టాలీవుడ్ స్టార్ హీరోలపై సలార్ స్టార్ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.
Prithviraj about MB: It took MB 90-95 takes for a single shot. SSR got angry and packed up for the day
Prithviraj about Prabhas: As SSR always says, Prabhas just has to stand there while everyone else is dying to perform. pic.twitter.com/6QpxI5h6eZ— Legend Prabhas Fan 🇮🇳 (@CanadaPrabhasFN) June 25, 2026


