
కృష్ణాష్టమి (Krishna Janmashtami) వచ్చిందంటే చాలామంది సెలబ్రిటీల ఇంట పండగ వాతావరణం ఉంటుంది. తమ పిల్లల్ని అల్లరి కన్నయ్యగా రెడీ చూసి ముచ్చటపడుతుంటారు. పిల్లల్ని వెన్నదొంగలా మార్చేయడంతో పాటు తల్లులు గోపికలుగా ముస్తాబవుతారు. చిలిపి కృష్ణుడితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటారు.
మా కృష్ణుడిని ఫోటో తీద్దామంటే అస్సలు కూర్చోవడం లేదని హీరోయిన్ ప్రణీత.. మావాడికి కృష్ణుడిగా రెడీ చేసేందుకు ఒప్పించడానికే మూడు గంటలు పట్టిందని నటి నవీన.. ఇలా తారలందరూ ఓ పక్క తంటాలు పడుతూనే మరోపక్క సంతోషంగా కృష్ణాష్టమి వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు. మరి ఎవరెలా ముస్తాబయ్యారో మీరూ చూసేయండి..