Lahari Shari
-
టెక్స్టైల్ మెషినరీ స్టోర్ ప్రారంభించిన తెలుగు 'బిగ్‌బాస్' లహరి షారి (ఫొటోలు)
-
హీరోయిన్‌కు ఏమాత్రం తీసిపోని బిగ్‌బాస్ బ్యూటీ లహరి అందం (ఫొటోలు)
-
బిగ్‌బాస్ బ్యూటీ నందిని బర్త్‌డే సెలబ్రేషన్స్, టాలీవుడ్ తారల సందడి
బిగ్‌బాస్ ఫేం, హీరోయిన్ నందిని రాయ్ బర్త్‌డే సెలెబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. నిన్న(సెప్టెంబర్ 18) ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా టాలీవుడ్ సినీ సెలబ్రెటీలు, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్స్ మధ్య ఆమె బర్త్‌డే వేడుక జరిగింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ బర్త్‌డే సెలబ్రెషన్స్‌లో నటుడు సాయి కుమార్, వరుణ్ సందేశ్, రాజ్ తరుణ్, తనిష్, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ సోహెల్, రాహుల్ సిప్లిగంజ్, లహరి శారి, యాంకర్, నటి భాను శ్రీ, వైవా హర్ష, పూజిత, చాందినీ చౌదరి, దర్శకులు సతీష్, కృష్ణ, రఘులు హాజరయ్యారు. ఇక వారందరి సమక్షంలో కేక్ కట్ చేసి తన కోసం వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేసింది ఆమె. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి కాగా నందిని రాయ్.. అతి చిన్న వయసులోనే మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. ఈ క్రమంలో పలు అందాల పోటీల్లో పాల్గొన్న ఆమె తక్కువ సమయంలోనే మోడల్‌గా మంచి గుర్తింపు పొందింది. 2011లో వచ్చిన 040 అనే చిత్రంలో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె ఆ తర్వాతా మాయ, ఖుషి ఖుషిగా, మోసగాళ్లకు మోసగాడు, సిల్లీ ఫెలోస్, శివరంజని వంటి హిట్ చిత్రాల్లో నటించింది.ఈ క్రమంలో బిగ్‌బాస్ 2 సీజన్లో పాల్గొని ఆడియన్స్‌కు మరింత దగ్గరైంది. బిగ్‌బాస్ అనంతరం వరుస ఆఫర్లు కొట్టేసి బిజీగా మారింది నందిని. ఇటీవల ఆమె సాయికుమార్, సీనియర్ నటి రాధిక శరత్ కుమార్‌లు ప్రధాన పాత్రలో వచ్చిన గాలివాన వెబ్ సిరీస్‌లో నటించి తన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. -
Lahari Shari Latest Photos: బిగ్‌బాస్ బ్యూటీ లహరి బర్త్‌డే స్పెషల్ (ఫొటోలు)
-
ఎగ్జిబిషన్‌ను ప్రాంభించిన బిగ్‌బాస్ బ్యూటీ లహరి
డిజైనర్ స్పెషల్, సమ్మర్ ఫ్యాషన్ స్పెషల్ సూత్ర ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ గురువారం బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణా హోటల్లో ప్రారంభమైంది. బిగ్‌బాస్ కంటెస్టెంట్, నటి లహరి ప్రదర్శనను ప్రారంభించారు. అలాగే బిగ్‌బాస్ నాన్‌స్టాప్ కంటెస్టెంట్ స్రవంతి చొక్కారపు సైతం ఈ ఎగ్జిబిషన్లో మెరిశారు. వెడ్డింగ్ వేర్, ఫ్యాషన్ వేర్, డిజైనరీ వేర్ ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ నెల 30 వరకు ప్రదర్శన కొనసాగుతుందని సూత్ర నిర్వాహకులు మౌనికా మాద్యన్, ఉమేశ్ మాద్యన్ వెల్లడించారు. View this post on Instagram A post shared by SUTRAA EXHIBITIONS (@sutraa_exhibitions) చదవండి: ఈ సంవత్సరం సీక్వెల్స్‌తో తగ్గేదే లే.. Allu Arjun: రేంజ్ పెరిగిందని పుష్ప 2కి రేటు పెంచేశాడా? -
అదిరేటి రెడ్ డ్రెస్‌లో అందాల భామ లహరి శారీ (ఫోటోలు)
-
అప్పుడు BMW బైక్, ఇప్పుడు లగ్జరీ కారు కొన్న బిగ్‌బాస్ బ్యూటీ
అర్జున్ రెడ్డి భామ, బిగ్‌బాస్ ఐదో సీజన్ కంటెస్టెంట్ లహరి షారి కొత్త కారు కొనుగోలు చేసింది. మహాశివరాత్రి పండగ సందర్భంగా లగ్జరీ కారు వోల్వో ఎక్స్‌సీ 60ని తనకు తాను బహుమతిగా ఇచ్చుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న భామ ఈ మేరకు కారు ముందు నిల్చుని దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో బిగ్‌బాస్ కంటెస్టెంట్లు సహా పలువురు నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ కారు ధర ఎంతకాదన్నా 60 లక్షల రూపాయల దాకా ఉంటుందని తెలుస్తోంది. గత నెలలో ఈ బ్యూటీ ఖరీదైన బీఎమ్‌డబ్ల్యూ బైక్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే! కాగా బిగ్‌బాస్ తర్వాత పలు ఆల్బమ్ సాంగ్స్‌లో నటించిన లహరి కొన్ని సినిమాలకు సైతం సంతకం చేసినట్లు సమాచారం! View this post on Instagram A post shared by Lahari Shari (@lahari_shari) View this post on Instagram A post shared by Lahari Shari (@lahari_shari) View this post on Instagram A post shared by Lahari Shari (@lahari_shari) -
అదిరేటి రెడ్ డ్రెస్‌లో అందాల భామ లహరి శారీ (ఫోటోలు)
-
ఖరీదైన బైక్ కొన్న బిగ్‌బాస్ బ్యూటీ.. ధర ఎంతంటే..
Bigg Boss 5 Lahari Shari Buys Expensive BMW Bike, Video Goes Viral: బిగ్‌బాస్ సీజన్-5లో లేడీ అర్జున్‌రెడ్డిగా గుర్తింపు పొందిన బ్యూటీ లహరి షారి. అప్పటివరకు కొన్ని సినిమాల్లో నటించినా ఈ అమ్మడికి అంతగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్‌బాస్ షోతో బోలెడంత ఫాలోయింగ్ పెరిగిపోయింది. బిగ్‌బాస్ అనంతరం వస్తున్న ఆఫర్లను అందిపుచ్చుకుంటూ బిజీగా మారిపోయింది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ తాజాగా ఓ లగ్జరీ బైక్‌ను కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. మొత్తానికి ఈ బైక్ కొన్నాను. చాలా సంతోషంగా ఉంది. నా బైక్ సౌండ్ చాలా నచ్చింది అంటూ ఆనందం వ్యక్తం చేసింది. దీంతో ఆనీ మాస్టర్ సహా పలువురు లహరికి కంగ్రాట్స్ చెబుతూ కామెంట్స చేస్తున్నారు. ఇక ఈ లగ్జరీ BMW G 310 GS మోడల్‌కి చెందిన ఈ బైక్ సుమారు రూ.3-3.5లక్షలు ఉంటుంది. View this post on Instagram A post shared by Lahari Shari (@lahari_shari) -
'బంగార్రాజు'లతో ప్రైవేట్ జెట్‌లో బిగ్‌బాస్ బ్యూటీ
Bigg Boss Fame Lahari Interview With Bangarraju Team: బిగ్‌బాస్ సీజన్-5లో లేడీ అర్జున్‌రెడ్డిగా సుపరిచితం అయిన బ్యూటీ లహరి షారి. అప్పటివరకు పెద్దగా గుర్తింపు లేని ఈ అమ్మడికి బిగ్‌బాస్ షోతో బోలెడంత ఫాలోయింగ్ పెరిగిపోయింది. బిగ్‌బాస్ అనంతరం వస్తున్న ఆఫర్లను అందిపుచ్చుకుంటూ బిజీగా మారిన ఈ బ్యూటీ తాజాగా కింగ్ నాగార్జున, నాగా చైతన్యలతో కలిసి ప్రైవేట్ జెట్‌లో ప్రయాణించింది. బంగార్రాజు సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానున్న నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్స్ జోరు పెంచింది. ఇందులో భాగంగా తమను ప్రైవేట్ జెట్‌లో ఇంటర్వ్యూ చేసే అద్భుత అవకాశం లహరి చేతికందింది. దీంతో యమ హుషారుతో బంగార్రాజులతో సరదాగా ముచ్చటించింది. ఈ సందర్భంగా చై, నాగార్జునలతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. 'కలలు నిజమవుతాయి. నా కల నెరవేరింది. మీలాంటి గొప్ప వ్యక్తులతో ఒక రోజంతా గడిపేందుకు అవకాశం ఇచ్చిన నాగార్జున సర్, చై సార్లకు ధన్యవాదాలు. లవ్ అక్కినేనిస్' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Lahari Shari (@lahari_shari) -
Bigg Boss Telugu 5: అలా అనుకోవడం వల్లే యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యాడా?
Bigg Boss 5 Telugu Ravi Elimination Reason: బిగ్‌బాస్ తెలుగు సీజన్-5లో 12వ వారం ఎలిమినేషన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. నామినేషన్లలో ఉన్న మిగతా కంటెస్టంట్లతో పోలిస్తే రవికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయినప్పటికీ వారికంటే రవి బయటకు రావడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇది అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ రవి ఫ్యాన్స్ సహా నెటిజన్లు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ రవి ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు ఏంటి? నిజంగానే మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే తక్కువ ఓట్లు వచ్చాయా? లేక మరేదైనా కారణాలు ఉన్నాయా అని ఓసారి పరిశీలిస్తే.. ఈ సీజన్లో మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే యాంకర్ రవికే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పొచ్చు. ఎన్నో ఏళ్లుగా బుల్లితెరపై మాస్ మహారాజాగా ఎదిగిన రవి గ్రాఫ్ బిగ్‌బాస్ హౌస్‌లో మొదట్లో బాగానే ఉండేది. అయితే లహరి-ప్రియ ఎపిసోడ్లో అమ్మ మీద ఒట్టు అంటూ అబద్దాలు చెప్పడం రవికి అతిపెద్ద మైనస్ అని చెప్పొచ్చు. అప్పటివరకు గుంటనక్క, ఇన్ఫులెన్స్ స్టార్ అని ట్యాగ్ లైన్స్ వచ్చినా ఈ ఒక్క ఎపిసోడ్‌తో రవి గ్రాఫ్ అమాంతం పడిపోయింది. ఇక శ్వేత ఎలిమినేషన్‌కి కూడా పరోక్షంగా రవి కారణం అవ్వడంతో మరింత నెగిటివ్ అయ్యాడు. అయినప్పటికీ అతనికి ఉన్న ఫ్యాన్ బేస్‌తో నామినేట్ అయిన ప్రతీసారి సేవ్ అవుతూ వచ్చాడు. ఈసారి కూడా నామినేషన్స్ నుంచి ఈజీగా గట్టెక్కేస్తాడని అంతా భావించారు. టాప్-5కి రవి చాలా సులువుగా చేరుకుంటాడని అనుకున్నారంతా. దీంతో రవికి ఎలాగైనా భారీ ఓట్లు పడతాయని భావించి ఫ్యాన్ బేస్ తక్కువ ఉన్నవారిని సేవ్ చేయడం కోసం వారికి ఓట్లు వేశారు. ఇది రవికి చాలా పెద్ద మైనస్‌గా మారింది. ఎలాగో ఓట్లు పడతాయి అన్న ఉద్దేశంతో మిగతా వారికి ఓట్లు వేయడం కూడా రవి ఎలిమినేషన్‌కు ప్రధాన కారణం అయి ఉండొచ్చని టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైనా టాప్-5లో ఉండాల్సిన కంటెస్టెంట్ ఇలా అనూహ్యంగా బయటకు రావడం రవి బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు. View this post on Instagram A post shared by Big Boss Telugu Season 5 (@bigbosstelugu5.adda) -
నో ఫిల్టర్ అంటున్న హారిక.. మోటివేషన్ అంటున్న శిల్పా
►మండే మోటివేషన్ అంటున్న శిల్పాశెట్టి ► వెడ్డింగ్ యానివర్సిరీని జరుపుకుంటున్న నేహా కక్కర్ ► నాలుగోసారి జాతీయ అవార్డును అందుకున్న కంగనా రనౌత్ ► వెకేషన్లో దేత్తడి హారిక View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Mahhi ❤️tara❤️khushi❤️rajveer (@mahhivij) View this post on Instagram A post shared by Neha Kakkar (Mrs. Singh) (@nehakakkar) View this post on Instagram A post shared by Kangana Thalaivii (@kanganaranaut) View this post on Instagram A post shared by Sanaya Irani (@sanayairani) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Kangana Thalaivii (@kanganaranaut) View this post on Instagram A post shared by Manish Malhotra (@manishmalhotra05) View this post on Instagram A post shared by Lahari Shari (@lahari_shari) -
అడగ్గానే ఫ్యాన్‌కు హగ్ ఇచ్చిన బిగ్‌బాస్ లహరి
Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ సీజన్-5లో లేడీ అర్జున్‌రెడ్డిగా గుర్తింపు పొందిన కంటెస్టెంట్ లహరి షారి. మొదటి నుంచి దూకుడుగా వ్యవహరించిన ఈ అమ్మడు దురదృష్టం కొద్దీ మూడో వారమే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. అయిన షో నుంచి బయటకు వచ్చిన అనంతరం అటు వరుస ఆఫర్లతో బిజీగా మారింది. బిగ్‌బాస్ షోతో ఎంతోమంది అభిమానులను సైతం సొంతం చేసుకుంది. తాజాగా తన ఫాలోవర్స్‌తో ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో ముచ్చటించిన ఈ భామ పలు ఇంట్రెస్టింగ్ విశేషాలను వెల్లడించింది. తన లైఫ్‌లో బిగ్‌బాస్ షోకు వెళ్లడమే అడ్వెంచర్ అని, మూడు వారాలకే బయటకు రావడం కాస్త బాధేసిందని తెలిపింది. హౌస్‌లో తనకు, రవికి ఉన్న బ్రదర్-సిస్టర్ రిలేషన్ గురించి చూపించలేదని చెప్పుకొచ్చింది. కాగా ఓ నెటిజన్ హగ్ ఇవ్వాల్సిందిగా కొంటెగా అడగ్గా ఒకే అంటూ హగ్ ఎమోజీని పంపి అతడికి షాకిచ్చింది. ఇక రీఎంట్రీ గురించి ప్రశ్నించగా..షో నిర్వాహకులు ఇంత వరకు తనను సంప్రదించలేదని, ఒకవేళ అవకాశం వస్తే ఆలోచిస్తానని బదులిచ్చింది. షో నుంచి బయటకు వచ్చాక మూడు సినిమాలకు సైన్ చేశానని, త్వరలోనే అప్డేట్స్ ఇస్తానని పేర్కొంది. -
బిగ్‌బాస్: లేడీ అర్జున్‌రెడ్డికి వరుస ఆఫర్లు
Bigg Boss 5 Telugu: బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్‌కున్న క్రేజ్ గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఒక్క షోతో రాత్రికి రాత్రే స్టార్స్‌గా మారిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. బిఫోర్ బిగ్‌బాస్, ఆఫ్టర్ బిగ్‌బాస్ ఎఫెక్ట్ అనేంతలా కొందరి జీవితాలనే మార్చేసింది ఈ షో. ఇక బిగ్‌బాస్ అనంతరం కంటెస్టెంట్లకు ఉన్న క్రేజ్‌ను బట్టి ఆఫర్స్ వెల్లువెత్తుతాయి. తాజాగా బిగ్‌బాస్ సీజన్-5 లేడీ అర్జున్ రెడ్డి పేరు సంపాదించిన లహరికి హౌస్ నుంచి బయటకు వచ్చాక బాగానే ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఓ ఫోక్ సాంగ్ కోసం డీ గ్లామరస్ లుక్‌లో కనిపించి ఆశ్చర్యపరిచింది. ఇప్పటికే ఈ సాంగ్‌కు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. దీంతో పాటు సినిమాల్లో సైతం లహరికి మంచి ఆఫర్లు వస్తున్నట్లు టాక్. కాగా సారీ నాకు పెళ్లైంది, అర్జున్‌రెడ్డి, జాంబిరెడ్డి చిత్రాల్లో నటించిన ఈ భామకు ఇండస్ట్రీలో అనుకున్నంత గుర్తింపు రాలేదు. అయితే బిగ్‌బాస్ షోతో కాస్త గుర్తింపు వచ్చిందనుకున్న సమయంలో దురదృష్టం కొద్దీ ఆమె మూడో వారమే ఎలిమినేట్ అయ్యింది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. View this post on Instagram A post shared by Lahari Shari (@lahari_shari) -
బాధగా ఉంది, నువ్వు రీ ఎంట్రీ ఇవ్వాల్సిందే: కౌశల్
బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ 19 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైంది. వీరిలో ఇప్పటికే ముగ్గురు కంటెస్టెంట్లు సరయు, ఉమాదేవి, లహరి షారి మూటాముల్లె సర్దుకుని హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. అయితే వీరిలో లహరి ఎలిమినేషన్ సరి కాదంటున్నాడు బిగ్‌బాస్ రెండో సీజన్ విన్నర్ కౌశల్ మండా. ఆమెను అన్యాయంగా ఎలిమినేట్ చేశారని చెప్తున్నాడు. షోలోకి ఆమె రీఎంట్రీ ఇవ్వాల్సిందేనని అభిప్రాయపడుతున్నాడు. ఈమేరకు లహరితో కలిసి దిగిన ఫొటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశాడు కౌశల్. 'బిగ్‌బాస్ హౌస్‌లో నీ వైఖరి నాకు చాలా బాగా నచ్చింది. ఈ సీజన్లో బోల్డ్ అండ్ బ్యూటీకి నువ్వో ట్రంప్ కార్డ్ లాంటిదానివి. నువ్వు ఇంత త్వరగా బయటకు వచ్చేయడం బాధగా ఉంది, నిన్ను మళ్లీ షోలో చూస్తానని ఆశిస్తున్నాను' అని పేర్కొంటూ 'లహరి కమ్ బ్యాక్' అనే హ్యాష్‌ట్యాగ్‌ను యాడ్ చేశాడు. దీంతో పలువురు నెటిజన్లు లహరి రీఎంట్రీ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. -
కంటెంట్ కోసం నువ్వు కాజల్ దగ్గరకు వెళ్లావు: అరియానా పంచ్
19 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో ప్రస్తుతం 16 మంది ఉన్నారు. తొలివారం సరయు, రెండోవారం ఉమాదేవి, థర్డ్ వీక్‌లో లహరి షారి(అమ్ము) హౌస్ నుంచి బయటకొచ్చేశాడు. తాజాగా ఎలిమినేట్ అయిన లహరి బిగ్‌బాస్ బజ్‌లో అరియానా గ్లోరీకి ఇంటర్వ్యూ ఇచ్చింది. నిజానికి ఇది ఇంటర్వ్యూలా కాకుండా వీళ్లిద్దరికీ మధ్య చిన్నపాటి ఫైట్ జరిగినట్లే కనిపించింది. అరియానా ఏకధాటి ప్రశ్నలతో లహరికి ముచ్చెమటలు పట్టించింది. జెస్సీ ఏం చేయకుండానే కెప్టెన్ అయ్యారంటారా? అని సూటిగా ప్రశ్నించడంతో లహరి నీళ్లు నమిలింది. కాజల్ అస్తమానం ఏదో ఒక కంటెంట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తుందని అమ్ము ఆరోపించగా.. కంటెంట్ కోసం మీరు కాజల్ దగ్గరకు వెళ్లినట్లు అనిపించిందని కౌంటరిచ్చింది అరియానా. అలా అనిపించిందీ అంటే మీరు సరిగా షో చూడలేదని రివర్స్ పంచ్ ఇచ్చింది లేడీ అర్జున్‌రెడ్డి. అలాగే బిగ్‌బాస్ షోలో ఫ్యాన్‌బేస్ అన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం అని లహరి అభిప్రాయపడగా.. 'ఆడియన్స్ ఓటేయాలంటే ముందు మనం గేమ్ ఆడాలి' అని ఆమె పెద్దగా పర్ఫామ్ చేయలేదని చెప్పకనే చెప్పింది బోల్డ్ బ్యూటీ. ప్రస్తుతం ఈ బిగ్‌బాస్ బజ్ ప్రోమో యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అవుతోంది. 'వాళ్లు ఓటేయాలంటే ముందు మనం గేమ్ ఆడాలి' అని అరియానా ఇచ్చిన లాస్ట్ పంచ్ మాత్రం అదిరిపోయిందంటున్నారు అభిమానులు. మూడో ఇంటర్వ్యూకే ఆమె హోస్టింగ్ చాలా మెరుగుపడిందంటున్నారు. అయితే కొద్దిమంది మాత్రం ఆమె ఇంటర్వ్యూ చెత్తగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఎలిమినేట్ అయ్యానన్న బాధలో ఉన్న లహరిని టార్గెట్ చేస్తూ, తన ప్రశ్నలతో మానసికంగా మరింత బాధపెట్టిందని అంటున్నారు. బిగ్‌బాస్ షో నుంచి వెళ్లిపోయి ఏడాది దాటుతున్నా బిగ్‌బాస్ బజ్కు హోస్ట్‌గా మారి మరోసారి కంటెంట్ ఇవ్వాలని ట్రై చేస్తోందని విమర్శిస్తున్నారు. -
కెమెరాలున్నాయ్, జాగ్రత్త: యాంకర్ రవికి లహరి వార్నింగ్
Bigg Boss Telugu 5, Episode 22: బిగ్‌బాస్ హౌస్‌లో మూడోవారం కూడా పూర్తైంది. సండేను ఫండే చేసేందుకు నాగ్ కంటెస్టెంట్లతో అంత్యాక్షరి ఆడించాడు. దీనికి డ్యాన్స్‌ను జత చేయడంతో హౌస్మేట్స్ విజృంభించారు. ఇక ముందుగా ఊహించినట్లుగానే లహరి షారి ఎలిమినేట్ అయింది. దీంతో యాంకర్ రవి షాక్‌లోకి వెళ్లిపోయాడు. గత రెండువారాలుగా ఎలిమినేట్ అయిన ప్రతి కంటెస్టెంట్ చెప్పిన పాయింట్‌నే లహరి కూడా మరోసారి లేవనెత్తింది. సిరి దారిలోనే నడుస్తున్నావని షణ్ముక్‌ను హెచ్చరించింది. ఆసక్తికరంగా సాగిన నేటి(సెప్టెంబర్ 26) ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఇది చదివేయండి.. నాగార్జునకే పంచ్ ఇచ్చిన హమీదా హమీదాను చూసి మైమరిచిపోయిన నాగ్ దేవతలా ఉన్నావంటూ మెచ్చుకోగా.. ఏదైనా కొత్తగా చెప్పు అని పంచ్ ఇచ్చిందీ బ్యూటీ. దీంతో షాకైన నాగ్.. చాలా హాట్‌గా ఉన్నావనడంతో హమీదా గాల్లో తేలిపోయింది. తర్వాత ఇంటిసభ్యులతో అంత్యాక్షరి గేమ్ ఆడించారు. ఇందులో ఇంటిసభ్యులను రెండు టీములుగా విడగొట్టారు. ఇరు టీమ్‌ల నుంచి ఒక్కొక్కరు వచ్చినప్పుడు పాట ప్లే చేస్తారు. వారిలో ముందుగా బజర్ నొక్కినవాళ్లు పాటలోని మిగతా చరణాలను పాడటంతోపాటు నచ్చినవాళ్లతో కలిసి డ్యాన్స్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఇంటిసభ్యులు జంటలు జంటలుగా డ్యాన్స్ చేస్తూ మెప్పించారు. తర్వాత మానస్ సేఫ్ అయినట్లు నాగ్ ప్రకటించాడు. ఆవాలు కూడా తెలీదు, రేషన్ మేనేజర్ అట! అనంతరం ఇంటిసభ్యులతో కళ్లకు గంతలు కట్టి మరో గేమ్ ఆడించారు. ఇది కూడా జంటలుగా ఆడాల్సి ఉంటుంది. ఒకరు అక్కడ బల్లపై ఉన్న వస్తువులను టచ్ చేసి దాని గురించి వివరిస్తే మిగతా వ్యక్తి అదేంటో చెప్పగలగాలి. ఈ క్రమంలో సిరి, షణ్ను జంటగా వచ్చారు. కానీ సిరి ఎంత క్లూ ఇచ్చిన షణ్ను అక్కడున్నది ఆవాలని చెప్పలేకపోయాడు. ఆవాలు కూడా తెలీదు, కానీ రేషన్ మేనేజర్ అంటూ అతడి పరువు తీసేశాడు రవి. తర్వాత ప్రియ, లహరి రాగా.. ప్రియ క్లూ ఇవ్వడంతోనే పల్లీలు అని టపీమని చెప్పేసింది లహరి. ఇట్టే కనిపెట్టేసిన రవి తర్వాత ప్రియాంక, శ్వేత వర్మ రాగా.. పింకీ సగ్గుబియ్యం గురించి హింట్ ఇవ్వగా శ్వేత కరెక్ట్‌గా గెస్ చేసింది. యానీ మాస్టర్, విశ్వ రాగా.. అక్కడున్న ఇంకును యానీ మాస్టరే గుర్తుకుపట్టలేకపోవడంతో విశ్వ ఏమీ గెస్ చేయలేకపోయాడు. గోరుచిక్కుడు కాయ గురించి నటరాజ్ మాస్టర్ క్లూ ఇచ్చినా మానస్ కనిపెట్టలేకపోయాడు. సీతాఫలం గురించి సన్నీ ఎన్ని హింట్లు ఇచ్చినా హమీదా గుర్తు పట్టలేకపోయింది. శ్రీరామచంద్ర టూత్‌పేస్ట్‌ను కనిపెట్టలేకపోయాడు. దాల్చిన చెక్క గురించి కాజల్ టచ్ చేసి క్లూ ఇవ్వడంతో రవి ఇట్టే కనిపెట్టాడు. కెమెరాలున్నాయి, జాగ్రత్త: రవికి వార్నింగ్ అనంతరం నాగ్.. నామినేషన్లో ఉన్న ప్రియ సేఫ్ అవగా, లహరి ఎలిమినేట్ అయిందని ప్రకటించాడు. దీంతో రవి షాక్‌లోకి వెళ్లిపోయాడు. శ్వేత అయితే ఆమెను పట్టుకుని వెక్కివెక్కి ఏడ్చేసింది. అటు సిరి మాత్రం లహరి తన గురించి స్టేజీ మీద చెప్పను అనేసిందని ఫైర్ అయింది. దీంతో రవి.. ఒకరి కోసం మీరు మారొద్దు. మీ స్నేహాన్ని మార్చుకోవద్దు అని సలహా ఇచ్చాడు. ఇక స్టేజీ మీదకు వచ్చిన లహరి.. శ్రీరామ్ తనకోసం ఓ పాట పాడాలంది. తను నోరు తెరిచి అడిగాక శ్రీరామ్ కాదంటాడా? ఎటో వెళ్లిపోయింది మనసు పాట అందుకున్నాడు. తర్వాత లహరితో ఫేల్డ్ హౌస్మేట్స్ గేమ్ ఆడించాడు. సిరి.. వేరే అమ్మాయిలంటే ఇన్‌సెక్యురిటీస్ అని, యానీ మాస్టర్.. వెరీ స్వీట్ అని చెప్పింది. యాంకర్ రవికి.. కెమెరాలున్నాయి, బీకేర్‌ఫుల్ అని హెచ్చరించింది. ఏంట్రా ఇది? సిరి చేసిందని నన్ను నామినేట్ చేశావ్ మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించమని ప్రియకు సూచించింది లహరి. శ్రీరామ్‌కు తన కోసం తనకు టైం కేటాయించుకోమని చెప్పింది. విశ్వ.. స్ట్రాంగ్‌గా ఉండమని, లోబోతో నీ ఈక్వేషన్స్ మారిపోయానని, నటరాజ్ మాస్టర్.. భోళా శంకరుడని, శ్వేత.. స్ట్రాంగ్‌గా ఉండాలని, కాజల్.. కెమెరాలున్నాయి, కాబట్టి ఏం మాట్లాడుతున్నావో జాగ్రత్తగా చూసుకోమని సలహా ఇచ్చింది. సిరి నామినేట్ చేసిందని నామినేట్ చేశావ్, ఏంట్రా ఇది? అని షణ్నును క్వశ్చన్ చేసింది. మళ్లీ సిరితో ముడిపెట్టడంతో మండిపోయిన షణ్ను.. అందుకే నువ్వు అక్కడున్నావ్ అని కౌంటరిచ్చాడు. సిరి మాట్లాడినదానికే తలాడించకని సూచించింది. నువ్వు ఆలోచిస్తుంది రాంగ్ అని లహరిపై మండిపడ్డాడు షణ్ను. ఆమెను స్ఫూర్తిగా తీసుకుంటే లైఫంటా స్ట్రాంగ్‌గా ఉంటాను జెస్సీ.. చిన్నపిల్లోడని, ఎవరినో ఒకరిని ఫాలో అవ్వాలని చూస్తున్నాడంది. అయితే అతడు మాత్రం తనకు గేమ్ పరంగా ఫుల్ క్లారిటీ ఉందన్నాడు. సన్నీ.. ఇంట్లో ప్రతిఒక్కటీ తనే పట్టించుకుంటాడు. కానీ అతడు తను అనుకునేంత షార్ప్ కాదన్నాడు. మానస్.. పెద్దగా తెలుసుకునేలోపే బయటున్నాననేసింది. ప్రియాంక.. ఆమెను స్ఫూర్తిగా తీసుకుంటే నా జీవితమంతా స్ట్రాంగ్‌గా ఉండగలను అని పాజిటివ్ కామెంట్ ఇచ్చింది. హమీదా సూపర్ స్ట్రాంగ్ లేడీ అని మెచ్చుకుంది. -
బిగ్‌బాస్ ఎలిమినేషన్: అందువల్లే లహరి ఎలిమినేట్ అయింది!
Bigg Boss Telugu 5, Lahari Shari Eliminated: లహరి షారి.. తన గురించి ఎవరేం అనుకుంటున్నా పట్టించుకోదు. కానీ తన ఎదురుగా నిలబడి మాట్లాడితే మాత్రం దానికి గట్టి సమాధానమే ఇస్తుంది. కాన్ఫిడెన్స్‌కు నిలువుటద్దంలా కనిపించే లహరికి కాస్త ఆవేశం ఎక్కువే. అందుకే బిగ్‌బాస్ ఇంట్లో చీటికీమాటికీ గొడవలు పెట్టుకుంటూ బ్యాడ్ నేమ్ తెచ్చుకుంది. తన కళ్లముందు ఏదైనా తేడాగా అనిపిస్తే చాలు ఆ అంశాన్ని లేవనెత్తి చీల్చి చెండాడేది. ముఖ్యంగా ఈ అర్జున్‌రెడ్డి భామకు, కాజల్‌కు పెద్దగా పడేది కాదు. మొదట్లో ఫైర్ బ్రాండ్‌గా కనిపించిన లహరి ఈ మధ్య కాస్త డల్ అయిపోయినట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్ హౌస్‌లో మూడో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన లహరి మూడో వారానికే తట్టాబుట్టా సర్దుకుని బయటకు వచ్చేసింది. మరి ఆమె ఎలిమినేషన్‌కు గల కారణాలేంటో చూసేద్దాం.. ► బిగ్‌బాస్ షో ప్రారంభమైన ఫస్ట్ వీక్‌లోనే గొడవలతోనే బాగా హైలైట్ అయింది లహరి. ముఖ్యంగా కాజల్ అత్యుత్సాహం ప్రదర్శించిన ప్రతిసారి ఆమె దూకుడుకు బ్రేక్ వేసింది. ఇలా హౌస్‌లో ఎవరికీ అదరకుండా బెదరకుండా వ్యవహరిస్తూ ముక్కుసూటిగా, కుండ బద్ధలు కొట్టి మాట్లాడే లహరిని మొదట్లో అంతా మెచ్చుకున్నారు. కానీ ప్రతి చిన్న విషయానికి కూడా ఆమె కయ్యానికి కాలు దువ్వడంతో ఆమెను మెచ్చుకున్నవాళ్లే విమర్శించక తప్పలేదు. ► ఇంట్లోని కంటెస్టెంట్లలో లహరికి దగ్గరైనవాళ్లలో మానస్ ఒకరు. అయితే ఇది గిట్టని ప్రియ, ప్రియాంక సింగ్, సిరి.. మానస్ దగ్గరకు వచ్చి ఆమె కన్నింగ్ అని, లహరితో జాగ్రత్త అని చెప్పారు. అంతేకాకుండా ఆమె డ్రెస్సింగ్ గురించి కూడా తప్పుగా మాట్లాడారు. ఈ విషయాన్ని మానస్ లహరితో కూడా చెప్పాడు. అంటే హౌస్‌లో లహరిని కొంత టార్గెట్ చేశారని అర్థమవుతోంది. ► హౌస్‌లో ఉన్నవాళ్లతో పాటు బయటకు వచ్చిన ఉమాదేవి కూడా లహరి షోలో కొనసాగడం వేస్ట్ అని అభిప్రాయపడ్డారు. దీంతో నిజంగానే హౌస్‌లో లహరి ఏం చేస్తుందన్న ప్రశ్న తలెత్తింది. ఇప్పటివరకు ఏదైనా టాస్కు గెలిచిందా? అంటే లేదు. ఏమైనా ఎంటర్టైన్ చేసిందా? అంటే అదీ లేదు. దీనికి తోడు నామినేషన్స్‌లో ఉన్న ఐదుగురిలో తక్కువ పాపులారిటీ, తక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది లహరికి మాత్రమే. దీంతో ఆమెకు మొదటి నుంచే తక్కువ ఓట్లు నమోదైనట్లు తెలుస్తోంది. ► లహరి ఎలిమినేషన్‌కు ముఖ్య కారణం ప్రియ, రవి. వీళ్లిద్దరూ తెలిసో, తెలియకో ప్రేక్షకుల ముందు లహరిని బ్యాడ్ చేశారు. యాంకరింగ్ కోసం తన వెనకాల పడుతుందని రవి, ఇంట్లో మగాళ్లతో బిజీ అని ప్రియ కామెంట్లు చేయడంతో ఆమె మీద కొంత వ్యతిరేకత ఏర్పడింది. అదే సమయంలో ఆమె అన్యాయంగా బలవుతుందంటూ కొంత సానుభూతి ఏర్పడ్డప్పటికీ అది ఆమెను ఎలిమినేషన్ నుంచి గట్టెక్కించలేకపోయాయి. ► ఇవి కాకుండా బిగ్‌బాస్ త్వరలో ఓ వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ప్లాన్ చేస్తున్నాడని, అందుకే లహరిని ఎలిమినేట్ చేసి ఆ స్థానాన్ని వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌తో భర్తీ చేసే ప్లాన్‌లో ఉన్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇదెంతవరకు నిజమన్నది రానున్న రోజుల్లో తెలియనుంది. ఏదేమైనా లహరి ఎలిమినేట్ కావడాన్ని ఆమె అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. తనేంటో నిరూపించుకునేందుకు ఇంకొన్ని రోజులు హౌస్‌లో ఉండనివ్వాల్సిందని అభిప్రాయపడుతున్నారు. -
బిగ్‌బాస్: లహరి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Bigg Boss Lahari Shari: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో లేడీ అర్జున్‌రెడ్డి ఎవరు? అంటే చాలామంది లహరి షారి వైపు వేలు చూపిస్తారు. తనతో పెట్టుకున్నవాళ్లకు చుక్కలు చూపిస్తుందీ భామ. తన తప్పు లేనిది ఏమైనా అంటే అస్సలు ఊరుకోదు. ఏదున్నా ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రమ్మని సవాలు విసురుతుంది. లహరి యాటిట్యూడ్ చూసి ఈమె అమ్మాయి కాదు ఆటంబాంబు అంటూ నెట్టింట కామెంట్లు కూడా వినిపించాయి. కాగా.. సారీ నాకు పెళ్లైంది, అర్జున్‌రెడ్డి, జాంబిరెడ్డి చిత్రాల్లో నటించిన ఈ భామకు ఇండస్ట్రీలో అనుకున్నంత గుర్తింపు రాలేదు. దీంతో బిగ్‌బాస్ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలనుకుంది. కానీ అదృష్టం అడ్డం తిరగడంతో ఆమె ఈ వారమే షో నుంచి ఎలిమినేట్ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆమెకు బిగ్‌బాస్ షో నుంచి ఎంత ముట్టిందనేది చర్చనీయాంశంగా మారింది. అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. ఆమెకు వారానికి లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు పారితోషికంగా ఇస్తున్నారట! ఈ లెక్కన ఇప్పటివరకు ఆమె బిగ్‌బాస్ ద్వారా ఐదారు లక్షల రూపాయలు వెనకేసినట్లు తెలుస్తోంది. అయితే ఆమె ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన విధానాన్ని బట్టి ఈ రెమ్యునరేషన్ అంతకన్నా ఎక్కువ లేదా తక్కువ కూడా ఉండొచ్చు! -
లహరి ఎలిమినేట్, షాకైన యాంకర్ రవి!
చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదంటారు! కానీ ఇది అన్నిచోట్లా వర్తించదు. మరీ ముఖ్యంగా బిగ్‌బాస్ హౌస్‌లో! ఇక్కడ తప్పు చేసి తప్పించుకు తిరిగేవారుంటారు, తాము చేసిన తప్పులకు వేరొకరిని బలి చేసేవాళ్లూ ఉంటారు.. ఆ రకంగా చూస్తే ఈవారం యాంకర్ రవి, ప్రియ చేసిన తప్పిదాలకు లహరి శిక్ష అనుభవించేట్లు కనిపిస్తోంది. నేటి ఎపిసోడ్లో ఆమె ఎలిమినేట్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు లీకువీరులు సోషల్ మీడియాలో టముకేసి మరీ ప్రచారం చేస్తున్నారు. ఇదిలా వుంటే ఎలిమినేట్ అయ్యేది ఎవరంటూ తాజాగా ప్రోమో రిలీజైంది. ప్రియ, లహరి పేర్లు రాసి ఉన్న బల్బ్స్ పట్టుకున్న నాగ్ ఎవరికి గ్రీన్ లైట్ వస్తే వారు సేఫ్ అని పేర్కొన్నాడు. ఇలా చెప్పిన మరికాసేపటికే ప్రియ నమస్కరించడానికి అన్నట్లుగా చేతులు పైకెత్తినట్లు కనిపించడంతో ఆమె సేఫ్ అని తెలుస్తోంది. దీంతో లహరి ఎలిమినేట్ అయినట్లు స్పష్టమవుతోంది. ఇక లహరి ఎలిమినేషన్‌తో యాంకర్ రవి ఒక్కసారిగా షాక్ అయినట్లు చూపించారు. మరి హౌస్‌ను వీడేది లహరియేనా? కాదా? ఆమె ఎలిమినేషన్ హౌస్‌మేట్స్‌పై ఎలాంటి ప్రభావం చూపనున్నది అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే! -
అమ్మపై ఒట్టేసి అబద్ధమాడిన రవి, ఇజ్జత్ తీసిన నాగ్
Bigg Boss 5 Telugu, Episode 21: రవి-ప్రియ-లహరిల మధ్య జరిగిన వాదోపవాదాలకు తెర దించాడు నాగార్జున. ఒక్క వీడియోతో లహరి కళ్లు తెరిపించాడు. రవి చేతిలో నమ్మకద్రోహానికి గురైన లహరి తనకు నిజానిజాలేంటో తెలియచేసినందుకు నాగ్‌కు కృతజ్ఞతలు తెలిపింది. అలాగే ఇంటిసభ్యులు ఎవరు హౌస్‌లో ఉండకూడదనుకుంటున్నారో వారిచేతే చెప్పించాడు. ఇక ఈ వారం నామినేషన్లో ఉన్న ఐదుగురిలో ఇద్దరిని సేవ్ చేశాడు. మరి నేటి(సెప్టెంబర్ 25) ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఇది చదివేయండి.. బిగ్‌బాస్‌కు నేను కరెక్ట్ కాదు: షణ్ముఖ్ ఈవారం సిరితో ఎక్కువగా ఉండలేదని, అయినప్పటికీ వీకెండ్లో నాగార్జున సిరిని తనను కలిపి ఏమైనా అన్నారంటే టీవీలోంచి దూకేస్తా అన్నాడు షణ్ముఖ్. ఇక్కడ ఫ్రెండ్షిప్ చేయాలంటేనే భయమేస్తుందన్నాడు. అసలు బిగ్‌బాస్‌కు తాను కరెక్ట్ కాదని బాధపడ్డాడు. యాంకర్ రవి ఇచ్చే సలహాలు కూడా నచ్చడం లేదని జెస్సీ దగ్గర విసుక్కున్నాడు. మరోపక్క సిరి మాత్రం.. ఇప్పటికీ షణ్ను తనను ఎందుకు దూరం పెడుతున్నాడో అర్థం కావడం లేదని బాధపడింది. జెస్సీ మాటలకు షణ్ను ఇన్ఫ్లూయెన్స్ అవుతున్నాడని అభిప్రాయపడింది. పింకీ అందాన్ని చూసి మైమరచిపోయిన శ్రీరామ్ పాట పాడటంతో ఆమె ఆ పాటకు తగ్గట్టు స్టెప్పులేసింది. నిజం తెలుసుకున్న లహరి తర్వాత నాగార్జున ఇంటిసభ్యులను పలకరిస్తూనే రవి, ప్రియ పేర్లు రాసి ఉన్న టైల్స్‌ను సుత్తెతో పగలగొట్టాడు. దీంతో రవి, ప్రియ నామినేషన్స్‌లో జరిగిన రచ్చను మరోసారి ప్రస్తావించారు. అయితే వీరి గొడవలో బాధితురాలైన లహరికి అసలు నిజమేంటో తెలియాలని ఆమెను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి రవి మాట్లాడిన వీడియో చూపించారు. ఆ వీడియోలో లహరి యాంకరింగ్ కోసం ట్రై చేస్తుందని, ఇంట్లో పెళ్లికాని వాళ్లు (సింగిల్ మెన్) ఉన్నప్పటికీ ఆమె తన వెంటే పడుతుందని తప్పుగా మాట్లాడిన మాటల్ని చూసి షాకైంది లహరి. దీంతో నాగ్.. తప్పు చేసినవాళ్లను నిలదీసి, తప్పు చేయనివాళ్లకు హగ్గివ్వమని సూచించాడు. కవర్ చేయబోయిన రవి, ఫైర్ అయిన నాగ్ హాల్లోకి వచ్చిన లహరి.. 'యాంకర్ అవ్వాలనుకున్నా, ఇక్కడ సింగిల్ మెన్‌ను వదిలేసి నీ వెనకాలే పడుతున్నా అన్నారు. ఇది చాలా తప్పు. నేను వీడియో చూశాను' అని రవిపై ఫైర్ అవుతూ ప్రియకు హగ్గిచ్చింది. దీంతో ఇష్యూ క్లియర్ అయిందా అని నాగ్ రవిని అడగ్గా అతడు ఏదో కవర్ చేద్దామని ప్రయత్నించాడు. ఇంతలో నాగ్ మధ్యలో అడ్డుకుంటూ.. ఇదంతా కాదు, అమ్మ మీద ఒట్టు, నేను సింగిల్ మెన్ అనే పదమే అనలేదు అక్కా అని అన్నావా? లేదా? అని గట్టిగా నిలదీయడంతో రవి నిజం ఒప్పేసుకున్నాడు. కానీ ప్రియ, లహరి దగ్గర అప్పటిదాకా ఆ విషయం ఒప్పుకోలేదని వాళ్లు చెప్పుకొచ్చారు. ఈ ఇష్యూతో రవి పరువు మొత్తం పోయినట్లైంది. వాడికోసం నువ్వు బాధపడొద్దు: నాగ్ అనంతరం నాగ్.. మానస్ తనకు తానే వరస్ట్ పర్ఫామర్ అని చెప్పుకోవడాన్ని తప్పుపట్టాడు. జైలు జీవితం బాగుందనడాన్ని కూడా విమర్శించాడు. కాజల్.. విశ్వను వరస్ట్ కెప్టెన్ అందన్న నాగ్.. ఇంట్లోవాళ్ల అభిప్రాయం అడిగాడు. అయితే కాజల్‌కు దిమ్మతిరిగేలా మెజారిటీ జనాలు అతడిని బెస్ట్ కెప్టెన్ అని పేర్కొన్నారు. ఇక ఈ వారం కెప్టెన్ అయిన జెస్సీకి కెప్టెన్ బాండ్ ఒక్కటే ఉందని, నిర్ణయాలు మాత్రం షణ్ముఖ్ తీసుకుంటున్నాడని సెటైర్ వేశాడు నాగ్. అలాగే సిరితో ఫ్రెండ్షిప్ కట్ చేయడాన్ని వ్యతిరేకించాడు. ఎలిమినేట్ అయి ఇక్కడినుంచి వెళ్లిపోయినవాళ్లు ఏదో అన్నారని, అనుకుంటున్నారని సిరికి దూరమవద్దని సలహా ఇవ్వడంతో వాళ్లిద్దరూ మళ్లీ కలిసిపోయారు. ప్రియాంక లవ్‌స్టోరీ గుర్తు చేసిన నాగ్.. నిన్ను బాధపెట్టినవాడి కోసం చింతించొద్దని ధైర్యాన్ని నూరిపోశాడు. ఏంట్రా? ఈ నోటి దూలేంట్రా.. తర్వాత హౌస్‌లో ఉండేందుకు అర్హత లేనివాళ్లను డోర్ దగ్గర నిలబెట్టి ముఖం మీద తలుపేయమని కంటెస్టెంట్లతో గేమ్ ఆడించాడు. మొదటగా వచ్చిన ప్రియ.. లోబో ఇంట్లో ఉండటానికి వీల్లేదని చెప్పింది. తర్వాత లోబో.. అందంతో అందరినీ పరేషాన్ చేస్తోందంటూ లహరిని; లహరి.. రవి; రవి.. ప్రియ; జెస్సీ, ప్రియాంక సింగ్, విశ్వ, కాజల్.. లోబో; శ్వేత, యానీ మాస్టర్.. మానస్; మానస్.. యానీ మాస్టర్; నటరాజ్ మాస్టర్, హమీదా.. కాజల్; షణ్ముఖ్, సిరి.. సన్నీ; సన్నీ.. సిరి; శ్రీరామ్.. జెస్సీ పేర్లను ఇంటి నుంచి వెళ్లిపోయేందుకు సూచించారు. ఇక టాస్క్‌లో శ్వేతను, ఫ్రెండ్షిప్ కట్ చేసి సిరిని ఏడిపించిన షణ్ముఖ్‌ను బాగానే ఆడుకున్నాడు నాగ్. ఏంట్రా? ఈ నోటి దూలేంట్రా? అటు శ్వేతను, ఇటు సిరిని ఏడిపిస్తున్నావు? అని కౌంటరేశాడు. ఇక గుంటనక్క ఎవరని నాగ్ నటరాజ్ మాస్టర్‌ను నిలదీయగా నెక్స్ట్ టైమ్ చెప్తానని దాటవేశాడు. తర్వాత శ్రీరామ్ సేఫ్ అయినట్లు ప్రకటించాడు. -
బిగ్‌బాస్: ప్రియ సేఫ్, లహరి ఎలిమినేట్!
బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో మరో కంటెస్టెంట్‌ను ఇంటికి పంపించే సమయం ఆసన్నమైంది. ఈ వారం శ్రీరామచంద్ర, మానస్, ప్రియ, ప్రియాంక, లహరి నామినేషన్లో ఉన్నారు. వీరిలో శ్రీరామ్, మానస్ భారీ ఓట్లతో ఓటింగ్‌లో ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం. వీరి తర్వాత ప్రియాంక కూడా మంచి ఓట్లే సంపాదించుకుని సేఫ్ జోన్లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి కావాల్సినంత స్క్రీన్ స్పేస్ దొరకడంతో పాటు ఎలాంటి నెగెటివిటీ కూడా లేకపోవడంతో ఈ ముగ్గురూ ఈవారం సేఫ్ అయినట్లే! మిగిలిందల్లా లహరి, ప్రియ. నిజానికి ప్రియ నామినేషన్స్‌లోకి వచ్చిన రోజే ఆమె ఎలిమినేట్ అవడం ఖాయం అనుకున్నారంతా! ఒక అమ్మాయి గురించి అందరి ముందు బ్యాడ్‌గా మాట్లాడటంతో ప్రియపై నెగెటివిటీ విపరీతంగా పెరిగిపోయింది. ఆమె కూడా ఒక మహిళే కదా, అలాంటిది ఇంకో అమ్మాయిని పట్టుకుని మగాళ్లతో బిజీ అని ఎలా మాట్లాడగలిగింది? రాత్రిపూట హగ్గులంటూ బూతుగా ఎలా చిత్రీకరించగలిగింది? అని ఆక్రోశించారు నెటిజన్లు. కానీ ఎప్పుడైతే రవి.. ఇంట్లో సింగిల్‌మెన్ (పెళ్లికానివాళ్లు) ఉన్నప్పటికీ ఆమె నా వెంట పడుతుంది అంటూ ప్రియతో లహరి గురించి బ్యాడ్‌గా మాట్లాడిన వీడియో బయటకు వచ్చిందో ఆ నెగెటివిటీ మొత్తం రవి మీదకు మళ్లింది. రవి వల్లే ప్రియ అలా మాట్లాడాల్సి వచ్చిందని పలువురూ అభిప్రాయపడ్డారు. ఏదేమైనా ఈ ఇద్దరు చేసిన తప్పులకు లహరి బలి కావాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ వారం లహరి ఎలిమినేట్ అయినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఈ లేడీ అర్జున్‌రెడ్డికి నేడు బిగ్‌బాస్ హౌస్‌లో ఆఖరి రోజు కానుంది. -
యాంకర్ రవి నిజ స్వరూపం బయటపెట్టిన నాగ్
బిగ్‌బాస్ హౌస్‌లో మూడోవారం జరిగిన నామినేషన్స్ వల్ల ఈసారి ఎలిమినేషనే తలకిందులయ్యేలా ఉంది. ప్రియ, యాంకర్ రవి వల్ల లహరి బ్యాడ్ అయింది. యాంకర్ రవి ఆడిన డబుల్ గేమ్ వల్ల అటు ప్రియ, ఇటు లహరి ఇద్దరూ సఫర్ అయ్యారు. ఎలాగంటే.. యాంకర్ రవి.. ప్రియతో నామినేషన్స్ కంటే ముందు లహరి గురించి మాట్లాడాడు. 'ఆమె యాంకరింగ్ కోసం ట్రై చేస్తుంది. కానీ 'సింగిల్ మెన్'(పెళ్లి కాని వాళ్లు)ను వదిలేసి నా వెంటే పడుతోంది. ఆమెకు ఎలా చెప్పాలో తెలియడం లేదు' అని వాపోయాడు. దీన్ని మనసులో పెట్టుకున్న ప్రియ లహరి మీద ఓ కన్నేసి ఉంచింది. ఈ క్రమంలో రవి, లహరి రాత్రిపూట వాష్‌రూమ్ దగ్గర హగ్ చేసుకోవడాన్ని చూసింది. నామినేషన్స్‌లో ఈ హగ్గు విషయాన్ని ప్రస్తావిస్తూ 'నువ్వు మగాళ్లతోనే బిజీ' అని లహరిని నానా మాటలు అంది. ఈ గొడవ పెద్దది కాగా అందులో యాంకర్ రవి కూడా ఇరుక్కున్నాడు. అయితే తాను సింగిల్ మెన్ అనే మాటే అనలేదని ప్లేటు ఫిరాయించాడు. నువ్వు అన్నావు కదా అని ప్రియ నిలదీసినప్పటికీ తను మాత్రం అనలేదని బుకాయించాడు. ప్రియ తనను బ్యాడ్ చేయడానికి అలా చేస్తుందని, తనకు ఫ్యామిలీ ఉంది, కూతురు ఉంది అని సెంటిమెంట్ డైలాగులు వల్లించడంతో లహరి రవి తప్పు లేదని నమ్మేసింది. ఇక వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున.. రవిని.. ప్రియతో లహరి గురించి సింగిల్ మెన్ అన్నావా లేదా? అని నిలదీయగా.. వెంటనే 'అన్నాను సర్' అని మరోసారి మాట మార్చాడు. దీంతో షాకైన ప్రియ.. ఇప్పటివరకూ ఆ మాట అన్నానని రవి ఒప్పుకోలేదు సర్ అని చెప్పింది. తర్వాత ఈ విషయం గురించి మరింత క్లారిటీ ఇవ్వడానికి నాగ్.. లహరికి ఆమె గురించి రవి బ్యాడ్‌గా మాట్లాడిన వీడియో చూపించడంతో అతడి నిజస్వరూపం బయటపడింది. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు రవికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని అంటున్నారు. -
బిగ్‌బాస్: ఆ ఇద్దరు చేసిన తప్పుకు లహరి బలి కానుందా?!
Bigg Boss 5 Telugu, 3rd Week Elimination: బిగ్‌బాస్ హౌస్‌లో మూడోవారం జరిగిన నామినేషన్స్ యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. నామినేషన్స్‌లో ప్రియ చేసిన కామెంట్ల మీద ఇప్పటికీ సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. కేవలం లహరి తనతో ఉండట్లేదన్న బాధతో.. ఆమె అబ్బాయిలతో బిజీగా ఉందని, అలాంటప్పుడు అమ్మాయిలతో ఉండటానికి టైం ఎక్కడుంటుందని నోటికొచ్చినట్లు మాట్లాడింది. అదీకాకుండా రాత్రిపూట వాష్‌రూమ్ దగ్గర యాంకర్ రవికి హగ్గివ్వడం కళ్లారా చూశానంటూ దాన్నో పెద్ద బూతుగా చిత్రీకరించింది. అనాల్సిందంతా అన్నాక తాను చెప్పిన విధానం కరెక్ట్ కాదంటూ లహరికి సారీ చెప్పి చేతులు దులిపేసుకుంది. అయితే ఇక్కడ ప్రియ ఒక్కరిదే తప్పు కాదు, యాంకర్ రవిది కూడా ఉంది. నామినేషన్స్ కన్నా ముందు అతడు ప్రియ దగ్గర లహరి గురించి కొంత బ్యాడ్‌గా చెప్పాడు. లహరి యాంకర్ అవడానికి ప్రయత్నిస్తోందని, అందుకే తన పనులన్నీ చేసి పెడుతోందని, ఇంట్లో సింగిల్ మెన్ (పెళ్లికాని అబ్బాయిలు) ఉన్నా కూడా తన వెంటే తిరుగుతోందని, ఆమెకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదని ప్రియ దగ్గర వాపోయాడు. కానీ తర్వాత మాత్రం సింగిల్ మెన్ అనే మాటే తన నోటి నుంచి రాలేదంటూ ప్లేటు ఫిరాయించాడు. అటు ప్రియ కూడా.. వీరిద్దరి వ్యవహారాన్ని పెద్ద ఇష్యూ చేసి మిడ్నైట్ హగ్గు అంటూ ఓ అమ్మాయి గురించి దారుణంగా మాట్లాడి పెద్ద తప్పే చేసింది. అయితే రవి, ప్రియ చేసిన తప్పులకు లహరికి శిక్ష పడేలా కనిపిస్తోంది. ఈ వారం నామినేషన్స్‌లో మానస్, ప్రియాంక సింగ్, శ్రీరామచంద్రతో పాటు ప్రియ, లహరి నామినేషన్స్‌లో ఉన్నారు. ప్రతి సమస్యను ఎంతో కూల్‌గా డీల్ చేస్తున్న మానస్‌కు బాగానే ఓట్లు పడుతున్నాయి. అటు శ్రీరామ్‌కు సపోర్ట్ చేసే ఫ్యాన్స్ కూడా చాలామందే ఉన్నారు. తనంతట తానుగా ఏ గొడవలోనూ దూరకుండా ఉంటున్న ప్రియాంక సింగ్‌కు కూడా బాగానే ఓట్లు గుద్దుతున్నారు. మిగిలిందల్లా ప్రియ, లహరి. నామినేషన్స్ జరిగినరోజు ప్రియ మీద తీవ్రమైన ట్రోలింగ్ జరిగింది. కానీ రవి.. లహరి గురించి బ్యాడ్‌గా మాట్లాడిన వీడియో బయటకు రావడంతో ప్రియపై కాస్త నెగెటివిటీ తగ్గింది. ఎటొచ్చీ లహరికి అంతగా ఫ్యాన్ బేస్ లేకపోవడంతో ఆమె డేంజర్ జోన్లో ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ లహరికి సానుభూతి ఓట్లు పడితే మాత్రం ఆమె కచ్చితంగా సేఫ్ అయ్యే అవకాశం ఉంది. మరి ఓటర్లు ప్రియకు సపోర్ట్ చేస్తారా? లేదా లహరిని హౌస్‌లో కొనసాగనిస్తారా? అన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది. -
బిగ్‌బాస్ హౌస్‌లో పెళ్లి, అంతలోనే బ్యాడ్ న్యూస్ అంటూ బాంబ్!
Bigg Boss Telugu 5 Promo: నామినేషన్స్‌తో ఫైర్ మీదున్న కంటెస్టెంట్లను కూల్ చేసేందుకు బిగ్‌బాస్ ఫన్నీ టాస్క్ ఇచ్చాడు. బిగ్‌బాస్ ఇచ్చిన హైదరాబాద్ అమ్మాయి - అమెరికా అబ్బాయి టాస్క్‌ను అటు హౌస్మేట్స్ కూడా బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. అమెరికా అబ్బాయి పాత్రలో జీవిస్తున్న శ్రీరామ్ అటు హమీదాతో, ఇటు సిరితో లవ్ ట్రాక్ నడుపుతూనే లహరితో పెళ్లికి రెడీ అయ్యాడు. అటు లహరి కూడా మానస్‌ను ప్రేమిస్తూనే ఇటు శ్రీరామ్‌తో పెళ్లికి సై అంది. దీంతో మ్యారేజ్ బ్రోకర్ షణ్ముఖ్ సహాయంతో ఎంతగానో కష్టపడి శ్రీరామ్, లహరికి పెళ్లి జరిపించినట్లు ప్రోమోలో చూపించారు. ఇద్దరూ ఉంగరాలతోపాటు దండలు కూడా మార్చుకున్నారు. ఈ పెళ్లికి కంటెస్టెంట్లే పెద్దలు, అతిథులు అన్నీనూ! మొత్తానికి ఈ టాస్క్ అంతా సవ్యంగా సాగుతోంది అనుకున్న సమయంలో బిగ్‌బాస్ హౌస్‌లో ఫోన్ రింగైంది. వెంటనే హడావుడిగా ఫోన్ లిఫ్ట్ చేసిన ప్రియకు.. మీకో బ్యాడ్ న్యూస్ చెప్పబోతున్నానంటూ అవతలి వ్యక్తి టెన్షన్ పెట్టేశాడు. మరి ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి? అది హౌస్ మొత్తానికా? లేదా ప్రియకు మాత్రమే బ్యాడ్ న్యూసా? అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే! -
లోబో అసభ్యంగా తాకాడు, వెంటనే డ్రెస్ మార్చుకున్నా: ప్రియాంక సింగ్
Bigg Boss 5 Telugu, Episode 17: నామినేషన్స్‌తో హౌస్‌లో కార్చిచ్చు రగిల్చాడు బిగ్‌బాస్. ఈ నామినేషన్ ప్రక్రియతో కంటెస్టెంట్ల మధ్య పెరిగిన దూరాన్ని చెరిపేసేందుకు వినోదాత్మకమైన టాస్క్ ఇచ్చాడు. అయినప్పటికీ హౌస్‌లో నెలకొన్న అశాంతి ఛాయలు పూర్తిగా కనుమరుగైనట్లు కనిపించలేదు. మరి నేటి(సెప్టెంబర్ 21) నాటి ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చదివేద్దాం.. నామినేషన్లో ఐదుగురు జెస్సీ.. మానస్, నటరాజ్ మాస్టర్‌ను నామినేట్ చేశాడు. ఈ క్రమంలో మాస్టర్, జెస్సీకి మధ్య పెద్ద ఫైటే జరిగింది. ఒకరు చెప్తేనే నన్ను నామినేట్ చేశావని తెలుసు, నువ్వో చిన్నపిల్లోడివి, జుజ్జూ అంటూ ఫైర్ అయ్యాడు. తర్వాత షణ్ముఖ్.. ప్రియ, లహరిని; శ్వేత.. శ్రీరామచంద్ర, లోబోను; హమీదా.. ప్రియ, ప్రియాంక సింగ్‌ను; కాజల్.. ప్రియాంక, ప్రియను; విశ్వ.. నటరాజ్ మాస్టర్, ప్రియను నామినేట్ చేశారు. ఇక ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం లహరి, ప్రియాంక, ప్రియ, మానస్, శ్రీరామ్ నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. ప్లేటు ఫిరాయించిన రవి, ఏడ్చేసిన ప్రియ 'యాంకరింగ్ కోసం లహరి ట్రై చేస్తుంది, అందుకని నాతో ఉంటుంది. కానీ ఆమె పెళ్లికాని అమ్మాయి కదా! నేను ఆమెతో చెప్పలేకపోతున్నానని రవి ప్రియతో అన్నారట' అని పింకీ లహరితో చెప్పుకొచ్చింది. ఇందులో నిజమెంతుందో తెలుసుకుందామని రవితో భేటీ అయింది లహరి. 'నేను యాంకరింగ్ కోసం ట్రై చేస్తున్నాను అని, అందుకే నీ పనులు చేసి పెడుతున్నాను అని అన్నావట, ఇక్కడ పెళ్లి కాని వాళ్లు చాలామంది ఉన్నారు. తనకెలా చెప్పాలో తెలియడం లేదు అని అన్నావా?' అని నిలదీసింది. దీనికి రవి అడ్డంగా తలూపుతూ అబ్బే ఆ మాటే అనలేదని ప్లేటు ఫిరాయించాడు. కానీ ప్రియ మాత్రం.. 'లహరి సింగిల్‌గా ఉన్న అబ్బాయిలను వదిలేసి నాతోనే ఉంటుంది, నేను ఏమీ అనలేకపోతున్నాను అని రవి అన్నాడు' అని బల్లగుద్ది చెప్తూనే ప్రియ ఏడ్చేసింది. అయితే రవి మాత్రం తను ఆ మాటే అనలేదని కరాఖండిగా చెప్పాడు. నిజంగానే నువ్వు ఆ మాట అన్నావు బ్రో, అది నేను విన్నానంటూ ప్రియ వెక్కివెక్కి ఏడ్చేసింది. సడన్‌గా వచ్చి చేయి పెట్టాడు: పింకీ మరోవైపు ప్రియాంక సింగ్.. లోబో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని కాజల్, సిరి దగ్గర వాపోయింది. 'నిన్న హాఫ్ ఫిట్ డ్రెస్ వేసుకున్నాను. అది కొంచెం అన్ కంఫర్టబుల్‌గా అనిపించింది. కానీ వీలైనంతవరకు కవర్ చేసుకుంటూనే ఉన్నాను. అక్కడ నేను ఏదో మాట్లాడుతూ ఉంటే లోబో నన్ను చూసి సైగలు చేశాడు. నాకర్థమైంది. నా కవరింగ్ నేను చేసుకుంటున్నాను. అంతలో సడన్‌గా వచ్చి చేయి పెట్టాడు. ఫన్నీగానే తీసుకున్నాను, కానీ వెంటనే డ్రెస్ మార్చేసుకున్నాను' అని చెప్తూ బాధపడింది. ఇది విని షాకైన కాజల్.. ఇంకోసారి ఇలా చేయకు అని లోబోకు సీరియస్ వార్నింగ్ ఇవ్వాల్సిందని ఆగ్రహించింది. పక్కనే ఉన్న సిరి.. ఈ విషయాన్ని రవికి చెప్తా అనడంతో పింకీ వదిలేయండి అని చెప్పింది. అప్పుడే అక్కడికి వచ్చిన లోబో ప్రియాంకక్ హగ్ ఇచ్చి వెళ్లాడు. కుమిలి కుమిలి ఏడ్చిన ప్రియ హౌస్‌లో అందరూ తనను టార్గెట్ చేయడంతో ఒంటరిగా కూర్చొని కుమిలి కుమిలి ఏడ్చింది ప్రియ. 'నువ్వేదైతే నేర్పించావో అలాగే ఉన్నానమ్మా.. ఏదీ కల్పించి చెప్పలేదు. ఒక్క ముక్క కూడా అబద్ధం చెప్పలేదు, నువ్వు నన్ను నమ్మితే చాలు' అంటూ తల్లిని గుర్తు చేసుకుని బాధపడింది. ఆ తర్వాతి రోజు ప్రియ.. తన గుండెలోని భారాన్ని దింపేసుకుంటూ లహరికి సారీ చెప్పింది. మీ అందరి రియాక్షన్ చూశాక నేను తప్పు విధానంలో చెప్పానని అర్థమైందని ప్రాయశ్చిత్తపడింది. ఫన్ టాస్క్ ఇచ్చిన బిగ్‌బాస్ తర్వాత బిగ్‌బాస్.. హౌస్‌మేట్స్‌కు 'హైదరాబాద్ అమ్మాయి - అమెరికా అబ్బాయి' టాస్క్ ఇచ్చాడు. హైదరాబాద్ అమ్మాయి కుటుంబలో లహరి అమ్మాయి, జెస్సీ ఆమె సోదరుడిగా, యానీ మాస్టర్, నటరాజ్ మాస్టర్ వీరి తల్లిదండ్రులుగా, రవి అమ్మాయి మామయ్యగా, ప్రియాంక చిన్ననాటి స్నేహితురాలిగా నటించాల్సి ఉంటుంది. అమెరికా అబ్బాయి కుటుంబంలో శ్రీరామ్ అమెరికా నుంచి వచ్చిన అబ్బాయిగా, కాజల్ అతడి అక్కగా, ప్రియ వీరి తల్లిగా, విశ్వ అబ్బాయి పర్సనల్ అసిస్టెంట్‌గా, సిరి చిన్ననాటి స్నేహితురాలుగా, సన్నీ అబ్బాయి స్నేహితుడిగా, షణ్ముఖ్ మ్యారేజ్ బ్రోకర్‌గా, లోబో ఈవెంట్ మేనేజర్, శ్వేత లోబో అసిస్టెంట్, హమీదా.. అబ్బాయి ఎక్స్‌గర్ల్‌ఫ్రెండ్, మానస్ అమ్మాయి పొరుగింటివారిగా నటించాల్సి ఉంటుంది. టాస్క్ మొదలవగానే కంటెస్టెంట్లు అందరూ పోటీపడుతూ నటించారు. ఈ టాస్క్ రేపటి ఎపిసోడ్లో కంటిన్యూ కానుంది. -
లహరి మీద ప్రియ అభాండం! మగాళ్లతో బిజీ కదా అంటూ నీచంగా..!
Bigg Boss Telugu 5, Nominations: బిగ్‌బాస్ మూడోవారం 'వాల్ ఆఫ్ షేమ్' అనే నామినేషన్స్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా ఎవరైతే ఈ షోలో కొనసాగడం అనవసరం అనుకుంటారో వారి పేరును బద్ధలు కొడుతూ నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అందరూ పోటాపోటీగా నామినేట్ చేయాలనుకున్న కంటెస్టెంట్ల పేర్లను ముక్కలు ముక్కలు చేస్తున్నారు. ఈ క్రమంలో లహరి.. ప్రియను నామినేట్ చేసింది. మీరు నాతో ఎందుకు దూరంగా ఉంటున్నారో అర్థం కావడం లేదని తెలిపింది. దీనికి ప్రియ బదులిస్తూ.. ఎందుకంటే నువ్వు ఇంట్లో ఉన్న అందరు అబ్బాయిలతో బిజీగా ఉన్నావు, కాబట్టి! అని స్టేట్మెంట్ ఇచ్చింది. ప్రియకు వార్నింగ్ ఇచ్చిన రవి ఆమె సమాధానం విని షాకైన లహరి.. ఎవరితో ఉన్నానో చెప్తారా? అని అడిగింది. ఇందుకామె రవి, మానస్‌తో బిజీగా ఉన్నావని చెప్పింది. ప్రియ మాటలు విని షాకైన రవి.. సిరిన ఉదాహరణగా చెప్తూ.. ఆమెను ఒక ఫ్రెండ్‌లాగా, సోదరిలాగా భావిస్తాను అని చెప్పుకొచ్చాడు. ఇంతలో మధ్యలోనే అడ్డుకున్న ప్రియ.. ఇప్పుడు మీరు అందరి దగ్గరా సపోర్ట్ ఆశించకండి అని కౌంటరిచ్చింది. ఆమె మాటలతో తల పట్టుకున్న రవి.. అలాంటి రాంగ్ స్టేట్మెంట్స్ ఇవ్వొద్దంటూ ప్రియకు వార్నింగ్ ఇచ్చాడు. అటు లహరి కూడా మరోసారి తనలోని అర్జున్‌రెడ్డి యాంగిల్‌ను బయటపెడుతూ.. నా గురించి మాట్లాడే అర్హత మీకు లేదు అని హెచ్చరించింది. ప్రియ కంటే ఉమాదేవి నయం! ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు ప్రియలో సెకండ్ యాంగిల్ బయటపడింది, అప్పుడు సన్నీ, ఇప్పుడు లహరి మీద తన అక్కసు వెళ్లగక్కింది, ఈవిడ కంటే ఉమాదేవి 100 రెట్లు నయం అంటూ విమర్శిస్తున్నారు. బహుశా ఆమె చెప్పింది నిజమే కావచ్చేమో కానీ చెప్పిన విధానం బాగోలేదంటున్నారు మరికొందరు. ప్రియ ఇలాగే ఇతర కంటెస్టెంట్లను చులకన చేస్తే మాట్లాడితే ఈ వారం వెళ్లిపోవడం ఖాయమని చెప్తున్నారు. మరి ఈ గొడవ తర్వాత ఒకరికొకరు సారీ చెప్పుకుని కలిసిపోతారా? లేదా ప్రియ, లహరి మధ్య వైరం కొనసాగనుందా? అనేది చూడాల్సిందే! -
బిగ్‌బాస్: మూడో వారం నామినేషన్స్‌లో ఐదుగురు!
Bigg Boss Telugu 5, 3rd Week Nominations: బిగ్‌బాస్ హౌస్‌లో అన్నింటికంటే పెద్ద టాస్క్ నామినేషన్స్. బాగా ఆడినా, ఆడకపోయినా, నవ్వించినా, నవ్వులపాలైనా, ఏడ్చినా, ఒకరిని ఏడిపించినా, సేఫ్ గేమ్ ఆడినా, ఆడకపోయినా, ఎన్ని కుయుక్తులు, కుట్రలు పన్నినా.. బిగ్‌బాస్ ఇంట్లో అడుగు పెట్టాక ఎప్పుడో ఒకసారైనా ఈ గండం బారిన పడక తప్పదు. ఈ నామినేషన్స్ కంటెస్టెంట్ల బలాబలాలను నిరూపించడమే కాకుండా ప్రేక్షకులు ఎవరి వైపు నిలబడుతున్నారన్న విషయాన్ని కూడా సుస్పష్టం చేస్తాయి. 19 మంది సెలబ్రిటీలతో ప్రారంభమైన బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ రెండు వారాలు పూర్తి చేసుకుంది. సరయు, ఉమాదేవి హౌస్‌ను వీడివెళ్లడంతో ఇంటిసభ్యుల సంఖ్య 17కు చేరింది. వీరిలో నుంచి ఒకరిని బయటకు పంపించేందుకు హౌస్‌లో నామినేషన్స్ జరిగాయి. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం మేరకు శ్రీరామచంద్ర, మానస్, ప్రియ, ప్రియాంక సింగ్, లహరి నామినేషన్స్‌లో ఉన్నారట! వీరిలో మానస్ మొదటి వారం, ప్రియ, ప్రియాంక సింగ్ రెండో వారం నామినేషన్లను ఎదుర్కొన్నారు. శ్రీరామచంద్ర, లహరి మాత్రం తొలిసారి నామినేషన్ జోన్లో అడుగు పెట్టారు. మరి వీరిలో ఎవరు బాగా ఆడి ఈ గండం నుంచి గట్టెక్కుతారు? ఎవరు హౌస్‌కు వీడ్కోలు పలుకుతారు? అన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది. -
బిగ్‌బాస్: మద్యం సేవిస్తా, నాన్‌వెజ్ తింటా, ఐలవ్ వైన్ : లహరి
బిగ్‌బాస్-5 హౌస్‌లో అందరు ఒకెత్తు అయితే.. యాంకర్ లహరి మరో ఎత్తు. ఏ విషయాన్ని అయినా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడుతుంది. అయితే గేమ్‌లో భాగంగానే ఆమె ఇలా ఉందనుకుంటే పొరపాటే. బయట కూడా తాను ఇలానే ఉంటుందట. అంతేకాదు ఈ ‘అర్జున్ రెడ్డి’భామకు మద్యం సేవించే అలావాటు కూడా ఉందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పింది. బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే ముందు ఈ భామ ఓ టీవీ చానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తన గురించి చాలా ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. తల్లిదండ్రులు తనకు బాగా ఫ్రీడమ్ ఇచ్చారని, కానీ తానెప్పుడూ ఆ ఫ్రీడమ్ ను దుర్వినియోగపరచుకోలేదని చెప్పుకొచ్చింది. నా మీద నాకు బాగా కాన్ఫిడెన్స్ ఎక్కువ.. గట్టిగా చెప్పాలంటే నాకు బలుపు బాగా ఎక్కువ. పక్కవాళ్లు నా గురించి ఏం మాట్లాడినా నేను పట్టించుకోను. నన్ను హర్ట్ చేస్తూ మాట్లాడినా నా ముందు మాట్లాడినదాన్నే నేను పట్టించుకుంటా. నా బలుపు ఏంటి అంటే నా ఫ్యామిలీ.‘ఏదైనా డ్రెస్ వేసుకుంటే నువ్ ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నావ్ అనే మాట మా ఇంట్లో వినిపించదు. నువ్ ఏదైనా వేసుకో.. ఏదైనా చేసుకో అంటారు. కాకపోతే నాకు ఇచ్చిన ఫ్రీడమ్‌ని నేను దుర్వినియోగం చేయలేదు. నేను ఏ దుస్తులు ధరించాలన్నా అది నా ఇష్టం. పొట్టి దుస్తులు ధరిస్తే కూడా మా ఫ్యామిలీ ఎలాంటి అభ్యంతరం చెప్పరు. అప్పట్లో నైట్ డ్రైవి విత్ లహరి ప్రోగ్రామ్‌తో బాగా పాపులర్ అయ్యింది. యాంకర్ అడిగిన ప్రశ్నకు గెస్ట్ ఆన్సర్ చెప్పలేకపోతే ఎదురుగా ఉన్న ఓడ్కా తాగాలి.. ఒకవేళ ఆన్సర్ చెప్తేస్తే యాంకర్ ఓడ్కా తాగాలి. దీనిపై విమర్శలు వచ్చాయి. దీన్ని డిజైన్ చేసింది నేనే.. కాన్సెప్ట్ నాదే. ఆ షోలో ఓడ్కా అని చెప్పేవాళ్లం కానీ అది ఓడ్కా కాదు.. అయితే నేను తాగుతా.. వైన్ తాగే అలవాటు ఉంది.. బట్ తాగుబోతుని కాదు. పార్టీలలో మాత్రమే తాగుతాను’అని తన గురించి చెప్పుకొచ్చింది లహరి. -
ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది, నీలాగే.. :ఇచ్చిపడేసిన సరయూ
వంద రోజులు ఉంటానని ఆశతో వెళ్లిన సరయూ వారం రోజులకే వెనుదిరిగింది. బయట అందరినీ గడగడలాడించే ఆమె హౌస్‌లో ఎక్కువరోజులు ఉండలేకపోయింది. మొదటివారంలోనే నామినేషన్లో నిలిచి తక్కువ ఓట్లతో హౌస్ నుంచి నిష్క్రమించింది. కన్నీళ్లతో హౌస్‌కు వీడ్కోలు పలికిన సరయూ స్టేజీ మీదకు వచ్చాక మాత్రం పూనకంతో ఊగిపోతూ ఒక్కొక్కరికి ఇచ్చి పడేసింది. తను నా బెస్ట్‌ఫ్రెండ్, కానీ నిర్లక్ష్యం చేశా.. హౌస్‌లో 5 బెస్ట్, 5 వరస్ట్ హౌస్మేట్స్ ఎవరో చెప్పమంటూ సరయూతో గేమ్ ఆడించాడు నాగ్. ముందుగా ఐదురుగు బెస్ట్ కంటెస్టెంట్ట గురించి చెప్తూ సరయూ ఎమోషనల్ అయింది. శ్వేత స్వచ్ఛమైనదని, మానస్ మంచి కమ్‌బ్యాక్ ఇచ్చాడని, ప్రియాంకను ఎక్కువగా మిస్ అవుతాను అని చెప్పింది. విశ్వ ఇంట్లో అన్ని పనులు చేస్తాడని, పొద్దున్నుంచి రాత్రి వరకు అన్ని పనులు చేస్తాడు, కానీ అస్సలు అలిసిపోడు అంది. హమీద తన బెస్ట్ ఫ్రెండ్ అని, కానీ ఆమెనే ఎక్కువగా నిర్లక్ష్యం చేశానని బాధపడింది. అక్కడ ఆయన ఇగో హర్ట్ అయింది.. వరస్ట్ కంటెస్టెంట్లుగా సిరి, షణ్ముఖ్, లహరి, సన్నీ, కాజల్‌ను ఎంచుకున్న సరయూ వాళ్ల గురించి చెప్తూ శివాలెత్తింది. చాలామంది హౌస్మేట్స్ ముందు ఒకలా, వెనక మరోలా ఉంటున్నారని ఆరోపించింది. సిరి, షణ్ముఖ్ ఒక స్ట్రాటజీతో వచ్చారని, బయటే అంతా ఫిక్స్ చేసుకుని వచ్చారని అభిప్రాయపడింది. ఆ తర్వాత సన్నీ గురించి చెప్తూ.. గతంలో ఆయనతో ఓ సినిమా చేశాను, అక్కడ జరిగిన చిన్న సంఘటనతో ఆయన ఇగో హర్ట్ అయింది. అప్పటి నుంచి తను నామీద పగ పెంచుకున్నాడని నొక్కి చెప్పింది. అంత ఈగో ఏంటి? టోన్ మార్చుకో! అయితే అలాంటిదేమీ లేదని సన్నీ చెప్తుండగా మధ్యలో అడ్డుపడిన సరయూ.. పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్‌గా నువ్వు నా మీద కోపం పెంచుకున్నావని తెలుసు అంటూ ఊగిపోయింది. అనంతరం లహరిని ఓ రేంజ్లో ఆడుకుంది. 'ఏమీ లేని అరిటాకు ఎగిరెగిరి పడుతుందట, అంత ఈగో ఏంటి? ఆ టోన్ మార్చుకో, ఎదగడానికి మనుషులను తొక్కాల్సిన అవసరం లేదు' అని గట్టిగానే ఇచ్చిపడేసింది. తర్వాత షణ్ముఖ్ గురించి చెప్తూ.. అరేయ్ ఏంట్రా ఇది? బయటే అనుకుని ఇలా రావొద్దురా! అయినా సిరిని లేపాక నువ్వు లేద్దామని అనుకుంటున్నావా? అని వ్యంగ్యాస్త్రాలు విసిరింది. ఇక కాజల్‌ను కూడా వరస్ట్ కంటెస్టెంట్స్ లిస్టులో చేర్చిన సరయూ ఆమెను బుర్ర పెట్టి ఆడమని సలహా ఇచ్చింది. -
సరయూ ఎలిమినేట్, చిన్నపిల్లాడిలా ఏడ్చేసిన విశ్వ
Bigg Boss Telugu 5, Episode 07: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో పాల్గొన్న 19 మంది కంటెస్టెంట్లలో ఒకరిని బయటకు పంపే సమయం రానే వచ్చింది. సోషల్ మీడియాలో ముందుగా లీకైనట్లుగానే 7 ఆర్ట్స్ సరయూ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు నాగ్. దీంతో హౌస్ అంతా కాసేపు ఉద్విగ్న వాతావారణం నెలకొంది. అయితే స్టేజీ మీదకు వచ్చిన సరయూ ఒక్కో కంటెస్టెంట్‌కు ఇచ్చిపడేసింది. మరి నేటి(సెప్టెంబర్ 12) ఎపిసోడ్ ఎలా సాగిందో చదివేద్దాం.. ర్యాంప్ వాక్‌ను ఖూనీ చేసిన లోబో, ఉమాదేవి సండే ఎపిసోడ్ కోసం అందంగా ముస్తాబైన ఇంటిసభ్యులు జంటలుగా విడిపోయి ర్యాంప్ వాక్ చేశారు. వీరికి జెస్సీ, నాగ్ మార్కులేశారు. అయితే ర్యాంప్ వాక్‌ను లోబో, ఉమాదేవి ఖూనీ చేసి నవ్వించారు. రవి, హమీదా.. జెస్సీ, యానీ మాస్టర్ల కుర్చీ గొడవను గుర్తు చేస్తూ కామెడీ చేశారు. శ్రీరామచంద్ర దొరికించే ఛాన్స్ అనుకుని సిరిని ఎత్తుకుని తిప్పాడు. మిగతావాళ్లందరూ కూడా తమతమ స్టైల్లో ర్యాంప్ వాక్ చేసి అలరించారు. అనంతరం నాగ్.. మానస్ సేఫ్ అయినట్లు ప్రకటించాడు. సిరి అసలు పేరు తెలుసా? తర్వాత ఇంటిసభ్యులను 9 జంటలుగా విడగొట్టి 'నేను నీకు తెలుసా?' అనే టాస్క్ ఆడించాడు. ఇందులో మొదట సిరి.. జెస్సీని నువ్వెందుకంత ఓవర్ చేస్తావని అడిగితే.. అతడు మాత్రం ఎందుకింత త్వరగా ఎంగేజ్ అయ్యావని తిరిగి ప్రశ్నించాడు. దీంతో షాకైన సిరి నువ్వు వస్తావని తెలీక అని చిలిపిగా సమాధానమిచ్చింది. సిరి అసలు పేరేంటని నాగ్ ప్రశ్నించగా శిరీష హన్మంత్ అని సరైన సమాధానం చెప్పాడు జెస్సీ. తర్వాత ఉమాకు రౌడీ రంగమ్మ పాత్ర సూటవుతుందని సరయూ,. సరయూకు అర్జున్‌రెడ్డి క్యారెక్టర్ సూటవుతుందని ఉమాదేవి చెప్పింది. ఎప్పుడూ ఆవిడ గురించే షణ్ముఖ్ జపం! షణ్ముఖ్, విశ్వ జోడీ వంతు రాగా నాగ్... షణ్ముఖ్ ఎవరి గురించి ఎక్కువగా మాట్లాడతాడని ప్రశ్నించాడు. దీనికి విశ్వ దీప్తి సునయన పేరు చెప్పాడు. హౌస్‌మేట్స్‌లో ఎవరి గురించి? అని నొక్కి ప్రశ్నించడంతో వెంటనే సిరి అని టపీమని బదులిచ్చాడు. విశ్వ లోబోను ఎత్తుకోగలడా? అన్నదానికి అతడు ఏకంగా ఎత్తుకునే చూపించాడు. షణ్ముఖ్ చేయి మీద ఏమని టాటూ ఉంటుందని అడగ్గా విశ్వ.. D అనే అక్షరం ఉంటుందని కరెక్ట్ ఆన్సరిచ్చాడు. కాజల్ ఎలుక, సరయూ తొండ ప్రియాంక క్రష్ ఎవరని మానస్‌ను అడగ్గా అతడు శ్రీరామచంద్ర పేరు చెప్పాడు. ప్రియాంకను చేసుకునేవాడికి ఎక్కుగా ఏం ఉండాలి? అన్నదానికి కేరింగ్ అని చెప్పాడు మానస్. ఇలా అన్ని జంటల మధ్య ఫిట్టింగ్ పెట్టే ప్రశ్నలడిగాడు. ఆ తర్వాత లోబో.. ఇంట్లో వాళ్లకు ముద్దుపేర్లు పెట్టాడు. రవికి.. మిల్క్‌బాయ్, శ్వేత.. టామ్ బాయ్, సన్నీ.. చాక్లెట్, మానస్.. హ్యాండసమ్గాయ్, ప్రియాంక సింగ్.. బ్యూటిఫుల్, యానీ మాస్టర్.. అమ్మ, కాజల్.. ఎలుక, సరయూ.. తొండ, నటరాజ్.. బావ, ప్రియ.. క్వీన్, విశ్వ.. చపాతీ, షణ్ముఖ్.. డార్లింగ్, హమీదా.. ఎరోప్లేన్, శ్రీరామచంద్ర.. మూడీగయ్, సిరి.. సీతాకోక చిలుక, జెస్సీ.. పిల్లి అని చెప్పాడు. లహరి, ఉమాదేవికి మాత్రం తాను నిక్‌నేమ్స్ పెట్టలేనని చేతులెత్తేశాడు. అనంతరం కాజల్ సేఫ్ అయినట్లు నాగ్ ప్రకటించాడు. సరయూ అవుట్, ఏడ్చేసిన విశ్వ, హమీదా తర్వాత నామినేషన్లో ఉన్న జెస్సీ, సరయూలకు చెరో సైకిల్ ఇచ్చాడు బిగ్‌బాస్. వీరిలో ఎవరి సైకిల్‌కు లైట్ వెలుగుతుందో వారు సేఫ్ అయినట్లని చెప్తూ వారిని టెన్షన్ పెట్టించాడు. కొద్ది క్షణాల అనంతరం జెస్సీ సైకిల్ బల్బ్ వెలగడంతో అతడు సేఫ్ అని నాగ్ ప్రకటించాడు. సరయూ ఎలిమినేట్ అయిందని వెల్లడించాడు. ఇది తట్టుకోలేకపోయిన విశ్వ హౌస్ లోపలకు వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చాడు. అటు హమీదాను ఆపడం కూడా ఎవరి తరమూ కాలేదు. ఇక సరయూ చివరిసారిగా విశ్వను పట్టుకుని గట్టిగా ఏడ్చేసి అందరి దగ్గరా వీడ్కోలు తీసుకుంది. -
లుక్స్‌తో కుర్రకారు మైండ్ బ్లాక్ చేస్తున్న లహరి షారి
-
బిగ్‌బాస్: 'ఆ నలుగురి ఓవరాక్షన్ తట్టుకోలేకపోతున్నాం'
బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చాక అన్ని రకాల ఎమోషన్లు పండించాలి. నవ్వడం, నటించడం, పోట్లాటకు దిగడం, టాస్క్‌లు ఆడటం.. అన్నీ చేయాల్సిందే! కానీ బిగ్‌బాస్ ఇంకా ఏ టాస్క్ ఇవ్వకముందే వీళ్లకు వీళ్లే దొంగతనాలు చేస్తూ, ప్రాంక్‌లు చేస్తూ, గొడవలు పెట్టుకుంటూ నానా రచ్చ చేస్తున్నారు. కలిసుంటే కలదు సుఖం అన్న మాటకు పూర్తి వ్యతిరేకంగా కడుపు నింపేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు అతి చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు. అంతేకాదు షోలోకి వచ్చినప్పటి నుంచి కొందరు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని, అదంత మంచిది కాదని హితవు పలుకుతున్నారు. దొంగతనం చేసి దొరికిపోయారు! సెప్టెంబర్ ఐదున బిగ్‌బాస్ షో అంగరంగ వైభవంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ షోలో సెకండ్ కంటెస్టెంట్‌గా వచ్చిన సన్నీకి తన స్వప్న సుందరిని హౌస్‌లో వెతుక్కోమని సలహా ఇచ్చాడు నాగ్. ఈ మాత్రం చాన్స్ ఇస్తే చాలని రెచ్చిపోయిన సన్నీ గేట్ ద్వారా కంటెస్టెంట్లు హౌస్‌లో అడుగు పెట్టిన ప్రతిసారి కొంత అతి చేశాడని అభిప్రాయపడ్డారు నెటిజన్లు. ఇక బిగ్‌బాస్ కన్నా ముందే తమకు తామే దొంగతనం టాస్క్ ఇచ్చుకున్నారు సిరి హన్మంత్, జెస్సీ. చిన్నాచితకా వస్తువులు దొంగతనం చేసినా యాంకర్ రవి వీరిని పసిగట్టేయడంతో చోరీ టాస్క్ అట్టర్ ఫ్లాప్ అయింది. మొదటికే మోసం తెచ్చిన ప్రాంక్ ఇది చాలదన్నట్లు సిరి.. లోబోతో గొడవ పడుతున్నట్లు ప్రాంక్ చేసి అందరినీ నమ్మించాలనుకుంది. అనుకోవడమే కాదు నిజంగానే లోబోతో ఓ రేంజ్లో గొడవ పెట్టుకుంది. ఈ క్రమంలో ఇద్దరూ నానామాటలు అనుకున్నారు. ఇది చూసి కంటెస్టెంట్లు నోరెళ్లబెట్టేసరికి ఇది ప్రాంక్ అంటూ వారిని వెర్రోళ్లను చేశారు. అయితే ఇది కరెక్ట్ కాదని, కంటెంట్ కోసం చేసినట్లుందని సరయూ నిర్మొహమాటంగానే చెప్పేసింది. మరోపక్క కాజల్ అత్యుత్సాహం అసలుకే ఎసరు తెస్తోంది. అతి చేయకుండా నార్మల్‌గా ఉండమని లహరి అందరి ముందే కౌంటరిచ్చింది. అయితే లహరి కూడా కావాలని అందరి దగ్గరా గొడవ పెట్టుకుంటోందని అంటున్నారు. అతి చేస్తుంది ఈ నలుగురేనా? మొత్తంగా వీజే సన్నీ, సిరి హన్మంత్, కాజల్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే అతి చేయడం మొదలు పెట్టేశారని చెప్తున్నారు. ఇక కాజల్ అందరి దగ్గరకు వెళ్లి పర్సనల్ విషయాలను ఎందుకు అడుగుతుందో అర్థం కావడం లేదంటున్నారు. లేడీ అర్జున్‌రెడ్డి లహరి కూడా కావాలని అందరితో గొడవలు కొని తెచ్చుకుంటున్నట్లు అనిపిస్తోందని అభిప్రాయపడుతున్నారు. మెజారిటీ నెటిజన్లు వీజే సన్నీ, సిరి హన్మంత్, లహరి, కాజల్ ఓవరాక్షన్ చేస్తున్నారని, వీళ్లు 'అతి' తగ్గించుకుంటే షోలో ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉందని సూచిస్తున్నారు. -
బిగ్‌బాస్: తమ్ముడి మరణం, రవిని పట్టుకుని ఏడ్చేసిన విశ్వ
Bigg Boss Telugu 5, September 7th Episode: బుల్లితెరపై బిగ్‌బాస్ సందడి మొదలైంది. అక్కడ హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య కొట్లాట కూడా షురూ అయింది. ఇలా పరిచయాలు అయ్యాయో లేదో అప్పుడే ఒకరి మీద ఒకరు తిట్ల వర్షం కురిపించుకుంటున్నారు. షో ఆరంభంలోనే ఈ రేంజ్లో గొడవలు ఉంటే రానురానూ ఇది ఏ స్థాయిలో ఉండబోతుందో అంటున్నారు బిగ్‌బాస్ ఫ్యాన్స్. మరి నేటి(మంగళవారం) ఎపిసోడ్లో ఏమేం జరిగాయో తెలియాలంటే ఇది చదివేయండి.. మానస్‌ను అన్నయ్య అని పిలవలేను మగవాళ్లు జిమ్ములో కూర్చుంటున్నారు తప్ప ఏ పనీ చేయట్లేదని ఉమాదేవి చిరాకుపడింది. ఇంట్లో ఉన్న అందరూ పని చేయాల్సిందేని అభిప్రాయపడింది. మరోపక్క లహరితో దూరాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసింది కాజల్. కానీ అది ఫ్లోలో జరగాలి తప్ప ఇలా మాట్లాడుకుంటే కుదరదు అని లహరి అనడంతో ఊరకుండిపోయింది. ఇక రవి, విశ్వను అన్నయ్య అని పిలుస్తానన్న ప్రియాంక సింగ్.. మానస్‌ను మాత్రం అలా పిలవలేనని చెప్తూ తెగ సిగ్గుపడింది. దీంతో అందరూ మానస్‌ను లవర్ బాయ్ అంటూ ఆటపట్టించారు. ఈ సీజన్లో కొత్తగా పవర్ రూమ్‌ను పరిచయం చేశాడు బిగ్‌బాస్. ఈ రూమ్‌లోకి వెళ్లేందుకు అర్హత సాధించిన సభ్యులకు పవర్ యాక్సెస్ దొరుకుతుందని, తద్వారా వారికి ఆటను మార్చగలిగే శక్తి దొరుకుతుందని చెప్పాడు. అందులో భాగంగా కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ 'శక్తి చూపరా డింభకా!'ను ప్రవేశపెట్టాడు. ఒంటి మీదున్న దుస్తులను పంపించేసిన రవి, ప్రియ ఈ టాస్క్‌లో ఉరుముల శబ్ధం వినిపించగానే పవర్ స్కాన్‌పై ఎవరు మొదట చేయి పెడతారో వారికి ఆ రూమ్‌లోకి వెళ్లేందుకు అర్హత సాధించినట్లు లెక్క. ఈ టాస్క్‌లో మొదట గెలిచిన విశ్వ పవర్ రూమ్‌లో అడుగు పెట్టాడు. ఇద్దరు ఇంటిసభ్యులు వారి ఒంటి మీదున్న దుస్తులతో సహా అన్ని బట్టలు, వస్తువులను స్టోర్‌రూమ్‌కు పంపించాలని, అయితే ఆ ఇద్దరూ వారి స్వంత బట్టలు కాకుండా ఒకరి దుస్తులను మరొకరు ధరించవచ్చని మెలిక పెట్టాడు బిగ్‌బాస్. ఈ టాస్క్ కోసం విశ్వ.. ప్రియ, రవి పేర్లను సూచించాడు. దీంతో ఆ ఇద్దరూ తమ సామానంతా పంపించేసి.. ప్రియ బట్టలను రవి, రవి బట్టలను ప్రియ వేసుకున్నారు. నాలో తమ్ముడిని చూసుకో.. లేడీ గెటప్‌లో ఉన్న రవిని కాసేపు ఎత్తుకుని తిప్పిన విశ్వ తన తమ్ముడిని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. గతేడాది తమ్ముడిని కోల్పోయానని కన్నీటి పర్యంతమయ్యాడు. రవి తనను అన్న అని పిలుస్తాడని, నా కోసం ఈ టాస్క్‌కు ఒప్పుకున్నాడంటూ ఎమోషనల్ అయ్యాడు. దీంతో రవి.. నాలో తమ్ముడిని చూసుకో అంటూ అతడిని హత్తుకుని ఓదార్చాడు. కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌లో తర్వాత మానస్ గెలుపొంది పవర్‌ను సాధించాడు. అతడు ఎంచుకునే కంటెస్టెంట్ హౌస్‌లోని ఇంటి సభ్యులందరూ పడుకున్నాకే నిద్రించాల్సి ఉంటుందని బిగ్‌బాస్ ఆదేశించాడు. లేదంటే పెద్ద సౌండ్‌తో అలారమ్ మోగుతుందని చెప్పాడు. ఈ టాస్క్‌కు మానస్.. ఆర్జే కాజల్ పేరును ఎంచుకున్నాడు. గొడవపడ్డట్లు డ్రామా.. చివర్లో అంతా ఉట్టిదే ఇంతలో లోబో.. ఏదైనా ఉంటే డైరెక్ట్‌గా అను, మోతెబరిలా మాట్లాడకు అని సిరిని నిందించాడు. ముఖం అద్దంలో చూసుకో, హైట్ చూసుకో, నా ముందు చెటాకంత ఉన్నవ్ అంటూ నానామాటలు అన్నాడు. ఇవన్నీ చెవిన పడటంతో ఆవేశంతో అట్టుడికిపోయిన సిరి ఫేస్ గురించి మాట్లాడితే ముఖం పగిలిపోద్ది అని వార్నింగ్ ఇచ్చింది. వీళ్లిద్దరికీ సడన్‌గా ఏమైంది? ఇంత గొడవపడుతున్నారు? అని కంటెస్టెంట్లంతా టెన్షన్ పడుతుండగా ఇదంతా వుట్టి డ్రామా అని ఇద్దరూ పెద్దగా నవ్వేసి అందరినీ పిచ్చోళ్లను చేశారు. హైడ్రామా చేస్తున్నావంటూ కాజల్‌కు చురకలు కిచెన్‌లో పనులను షేర్ చేసుకుందామని కాజల్ అందరినీ పిలిచి హడావుడి చేస్తుండగా.. ఎందుకంత హైపర్ అవుతున్నారని లహరి ప్రశ్నించింది. నార్మల్‌గా మాట్లాడండి, అంతే తప్ప కంటెంట్ క్రియేట్ చేయాలని చూడొద్దని కాజల్‌కు సూచించింది. చాలా హైడ్రామా చేస్తున్నారని చురకలంటించింది. దీంతో కాజల్ ఆమెకు క్షమాపణలు చెప్పి అక్కడ నుంచి బయటకు వచ్చి ఏడ్చేసింది. జెస్సీ మీద యానీ మాస్టర్ ఫైర్ ఇక రాత్రి అందరూ ముచ్చట్లు పెట్టుకుంటుండగా సిరి ప్లేస్‌లో హమీదా కూర్చుంటే ఆమెను అక్కడి నుంచి లేవమన్నాడు జెస్సీ. ఆమె కుదరదనడంతో సిరిని తన స్థానంలో కూర్చోమన్నాడు. ఆ తర్వాత మరో ఖాళీ కుర్చీ దొరికితే దాని మీద కాలేసి కూర్చున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన యానీ మాస్టర్ తనకు చెయిర్ ఇవ్వమని రిక్వెస్ట్ చేసింది. ప్లీజ్ అంటున్నా అతడు నిరాకరించడంతో యానీకి బుర్ర వేడెక్కిపోయింది. నాటకాలు చేయకు, నీ గొంతే కాదు నా వాయిస్ కూడా లేస్తుంది, అక్కడ కాళ్లెందుకు పెట్టినవ్ అని జెస్సీ మీద పూనకంతో ఊగిపోయింది. ఇంతలా ఆవేశపడ్డ యానీ మాస్టర్ తన బెడ్ దగ్గరకు వెళ్లి ఏడ్చేయడం గమనార్హం. ఈరోజు ఎపిసోడ్లో ఇంత రభస ఉంటే మరి రేపటి ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి! -
బిగ్‌బాస్ 5: నాగ్‌పై పూలబాణం వదిలిన నటి లహరి
Lahari Shari In Bigg Boss 5: యాంకర్, న్యూస్ రీడర్, జర్నలిస్టు, మోడల్, నటిగా పాపులర్ అయింది లహరి షారి. సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసే ఈమె 'అర్జున్ రెడ్డి' సినిమాలో డాక్టర్‌గా నటించింది. 'మళ్లీ రావా' సినిమాలో హీరో సుమంత్ స్నేహితురాలిగా ఆకట్టుకుంటుంది. 'సారీ నాకు పెళ్లైంది', 'జాంబిరెడ్డి' తదితర చిత్రాల్లో నటించింది. బిగ్‌బాస్ ఐదో సీజన్లో మూడో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ నటి అనుకున్నది సాధించడానికి, తప్పును ప్రశ్నించడానికి ధైర్యాన్ని ఎప్పుడూ వదులుకోలేదని చెప్తోంది. ఈ క్రమంలో కదిలించే కష్టాలు వచ్చినా చెక్కిళ్ల చాటు చిరునవ్వును ఎప్పుడూ చెదిరిపోనివ్వలేదని చెప్పింది. ఇక స్టేజీపైకి వచ్చీరావడంతోనే అరుదైన గులాబీ పువ్వును నాగార్జునకు అందించి ఆయన్ను ఫిదా చేసేందుకు ప్రయత్నించింది లహరి. వచ్చే ఏడాది ఈ సమయానికి కూడా ఈ పువ్వు వాడిపోదని చెప్పింది. మరి తన ఎంట్రీతోనే నాగ్‌ను బుట్టలో వేసుకున్న ఈ భామ బిగ్‌బాస్ వీక్షకులను ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి!