బిగ్‌బాస్‌: మద్యం సేవిస్తా, నాన్‌వెజ్‌ తింటా, ఐలవ్‌ వైన్‌ : లహరి | Bigg Boss 5 Telugu Lahari Shari Shocking Comments On Her Drinking Habits | Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: నాకు బలుపు ఎక్కువ, మద్యం సేవిస్తా, నాన్‌వెజ్‌ తింటా: లహరి

Sep 14 2021 6:24 PM | Updated on Sep 15 2021 12:15 PM

Bigg Boss 5 Telugu Lahari Shari Shocking Comments On Her Drinking Habits - Sakshi

బిగ్‌బాస్‌-5 హౌస్‌లో అందరు ఒకెత్తు అయితే.. యాంకర్‌ లహరి మరో ఎత్తు. ఏ విషయాన్ని అయినా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడుతుంది. అయితే గేమ్‌లో భాగంగానే ఆమె ఇలా ఉందనుకుంటే పొరపాటే. బయట కూడా తాను ఇలానే ఉంటుందట. అంతేకాదు ఈ ‘అర్జున్‌ రెడ్డి’భామకు మద్యం సేవించే అలావాటు కూడా ఉందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పింది. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లే ముందు ఈ భామ ఓ టీవీ చానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తన గురించి చాలా ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. తల్లిదండ్రులు తనకు  బాగా ఫ్రీడమ్ ఇచ్చారని, కానీ తానెప్పుడూ ఆ ఫ్రీడమ్ ను దుర్వినియోగపరచుకోలేదని చెప్పుకొచ్చింది. 

నా మీద నాకు బాగా కాన్ఫిడెన్స్ ఎక్కువ.. గట్టిగా చెప్పాలంటే నాకు బలుపు బాగా ఎక్కువ. పక్కవాళ్లు నా గురించి ఏం మాట్లాడినా నేను పట్టించుకోను. నన్ను హర్ట్ చేస్తూ మాట్లాడినా నా ముందు మాట్లాడినదాన్నే నేను పట్టించుకుంటా. నా బలుపు ఏంటి అంటే నా ఫ్యామిలీ.‘ఏదైనా డ్రెస్ వేసుకుంటే నువ్ ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నావ్ అనే మాట మా ఇంట్లో వినిపించదు. నువ్ ఏదైనా వేసుకో.. ఏదైనా చేసుకో అంటారు. కాకపోతే నాకు ఇచ్చిన ఫ్రీడమ్‌ని నేను దుర్వినియోగం చేయలేదు.

నేను ఏ దుస్తులు ధరించాలన్నా అది నా ఇష్టం. పొట్టి దుస్తులు ధరిస్తే కూడా మా ఫ్యామిలీ ఎలాంటి అభ్యంతరం చెప్పరు. అప్పట్లో నైట్ డ్రైవి విత్ లహరి ప్రోగ్రామ్‌తో బాగా పాపులర్ అయ్యింది. యాంకర్ అడిగిన ప్రశ్నకు గెస్ట్ ఆన్సర్ చెప్పలేకపోతే ఎదురుగా ఉన్న ఓడ్కా తాగాలి.. ఒకవేళ ఆన్సర్ చెప్తేస్తే యాంకర్ ఓడ్కా తాగాలి. దీనిపై విమర్శలు వచ్చాయి. దీన్ని డిజైన్ చేసింది నేనే.. కాన్సెప్ట్ నాదే. ఆ షోలో ఓడ్కా అని చెప్పేవాళ్లం కానీ అది ఓడ్కా కాదు.. అయితే నేను తాగుతా.. వైన్ తాగే అలవాటు ఉంది.. బట్ తాగుబోతుని కాదు. పార్టీలలో మాత్రమే తాగుతాను’అని తన గురించి చెప్పుకొచ్చింది లహరి. 


Advertisement
 
Advertisement
Advertisement