Big Boss 5 Telugu Latest Updates: Netizens Feel These 5 Contestants are Overacting - Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: హౌస్‌లో ఓవరాక్టింగ్‌ చేస్తుంది వీళ్లేనా?

Sep 8 2021 8:14 PM | Updated on Sep 9 2021 4:03 PM

Bigg Boss Telugu 5: Netizens Felt These Contestants Are Overacting - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వచ్చాక అన్ని రకాల ఎమోషన్లు పండించాలి. నవ్వడం, నటించడం, పోట్లాటకు దిగడం, టాస్క్‌లు ఆడటం.. అన్నీ చేయాల్సిందే! కానీ బిగ్‌బాస్‌ ఇంకా ఏ టాస్క్‌ ఇవ్వకముందే వీళ్లకు వీళ్లే దొంగతనాలు చేస్తూ, ప్రాంక్‌లు చేస్తూ, గొడవలు పెట్టుకుంటూ నానా రచ్చ చేస్తున్నారు. కలిసుంటే కలదు సుఖం అన్న మాటకు పూర్తి వ్యతిరేకంగా కడుపు నింపేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు అతి చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు. అంతేకాదు షోలోకి వచ్చినప్పటి నుంచి కొందరు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని, అదంత మంచిది కాదని హితవు పలుకుతున్నారు. 

దొంగతనం చేసి దొరికిపోయారు!
సెప్టెంబర్‌ ఐదున బిగ్‌బాస్‌ షో అంగరంగ వైభవంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ షోలో సెకండ్‌ కంటెస్టెంట్‌గా వచ్చిన సన్నీకి తన స్వప్న సుందరిని హౌస్‌లో వెతుక్కోమని సలహా ఇచ్చాడు నాగ్‌. ఈ మాత్రం చాన్స్‌ ఇస్తే చాలని రెచ్చిపోయిన సన్నీ గేట్‌ ద్వారా కంటెస్టెంట్లు హౌస్‌లో అడుగు పెట్టిన ప్రతిసారి కొంత అతి చేశాడని అభిప్రాయపడ్డారు నెటిజన్లు. ఇక బిగ్‌బాస్‌ కన్నా ముందే తమకు తామే దొంగతనం టాస్క్‌ ఇచ్చుకున్నారు సిరి హన్మంత్‌, జెస్సీ. చిన్నాచితకా వస్తువులు దొంగతనం చేసినా యాంకర్‌ రవి వీరిని పసిగట్టేయడంతో చోరీ టాస్క్‌ అట్టర్‌ ఫ్లాప్‌ అయింది.

మొదటికే మోసం తెచ్చిన ప్రాంక్‌
ఇది చాలదన్నట్లు సిరి.. లోబోతో గొడవ పడుతున్నట్లు ప్రాంక్‌ చేసి అందరినీ నమ్మించాలనుకుంది. అనుకోవడమే కాదు నిజంగానే లోబోతో ఓ రేంజ్‌లో గొడవ పెట్టుకుంది. ఈ క్రమంలో ఇద్దరూ నానామాటలు అనుకున్నారు. ఇది చూసి కంటెస్టెంట్లు నోరెళ్లబెట్టేసరికి ఇది ప్రాంక్‌ అంటూ వారిని వెర్రోళ్లను చేశారు. అయితే ఇది కరెక్ట్‌ కాదని, కంటెంట్‌ కోసం చేసినట్లుందని సరయూ నిర్మొహమాటంగానే చెప్పేసింది. మరోపక్క కాజల్‌ అత్యుత్సాహం అసలుకే ఎసరు తెస్తోంది. అతి చేయకుండా నార్మల్‌గా ఉండమని లహరి అందరి ముందే కౌంటరిచ్చింది. అయితే లహరి కూడా కావాలని అందరి దగ్గరా గొడవ పెట్టుకుంటోందని అంటున్నారు.

అతి చేస్తుంది ఈ నలుగురేనా?
మొత్తంగా వీజే సన్నీ, సిరి హన్మంత్‌, కాజల్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే అతి చేయడం మొదలు పెట్టేశారని చెప్తున్నారు. ఇక కాజల్‌ అందరి దగ్గరకు వెళ్లి పర్సనల్‌ విషయాలను ఎందుకు అడుగుతుందో అర్థం కావడం లేదంటున్నారు. లేడీ అర్జున్‌రెడ్డి లహరి కూడా కావాలని అందరితో గొడవలు కొని తెచ్చుకుంటున్నట్లు అనిపిస్తోందని అభిప్రాయపడుతున్నారు. మెజారిటీ నెటిజన్లు వీజే సన్నీ, సిరి హన్మంత్‌, లహరి, కాజల్‌ ఓవరాక్షన్‌ చేస్తున్నారని, వీళ్లు 'అతి' తగ్గించుకుంటే షోలో ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉందని సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement