Bigg Boss 5 Telugu: కెమెరాలున్నాయ్‌, జాగ్రత్త అంటూ రవికి వార్నింగ్‌

Bigg Boss Telugu 5: Lahari Shari Sweet Warning To Anchor Ravi - Sakshi

Bigg Boss Telugu 5, Episode 22: బిగ్‌బాస్‌ హౌస్‌లో మూడోవారం కూడా పూర్తైంది. సండేను ఫండే చేసేందుకు నాగ్‌ కంటెస్టెంట్లతో అంత్యాక్షరి ఆడించాడు. దీనికి డ్యాన్స్‌ను జత చేయడంతో హౌస్‌మేట్స్‌ విజృంభించారు. ఇక ముందుగా ఊహించినట్లుగానే లహరి షారి ఎలిమినేట్‌ అయింది. దీంతో యాంకర్‌ రవి షాక్‌లోకి వెళ్లిపోయాడు. గత రెండువారాలుగా ఎలిమినేట్‌ అయిన ప్రతి కంటెస్టెంట్‌ చెప్పిన పాయింట్‌నే లహరి కూడా మరోసారి లేవనెత్తింది. సిరి దారిలోనే నడుస్తున్నావని షణ్ముక్‌ను హెచ్చరించింది. ఆసక్తికరంగా సాగిన నేటి(సెప్టెంబర్‌ 26) ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఇది చదివేయండి..

నాగార్జునకే పంచ్‌ ఇచ్చిన హమీదా
హమీదాను చూసి మైమరిచిపోయిన నాగ్‌ దేవతలా ఉన్నావంటూ మెచ్చుకోగా.. ఏదైనా కొత్తగా చెప్పు అని పంచ్‌ ఇచ్చిందీ బ్యూటీ. దీంతో షాకైన నాగ్‌.. చాలా హాట్‌గా ఉన్నావనడంతో హమీదా గాల్లో తేలిపోయింది. తర్వాత ఇంటిసభ్యులతో అంత్యాక్షరి గేమ్‌ ఆడించారు. ఇందులో ఇంటిసభ్యులను రెండు టీములుగా విడగొట్టారు. ఇరు టీమ్‌ల నుంచి ఒక్కొక్కరు వచ్చినప్పుడు పాట ప్లే చేస్తారు. వారిలో ముందుగా బజర్‌ నొక్కినవాళ్లు పాటలోని మిగతా చరణాలను పాడటంతోపాటు నచ్చినవాళ్లతో కలిసి డ్యాన్స్‌ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఇంటిసభ్యులు జంటలు జంటలుగా డ్యాన్స్‌ చేస్తూ మెప్పించారు. తర్వాత మానస్‌ సేఫ్‌ అయినట్లు నాగ్‌ ప్రకటించాడు.

ఆవాలు కూడా తెలీదు, రేషన్‌ మేనేజర్‌ అట!
అనంతరం ఇంటిసభ్యులతో కళ్లకు గంతలు కట్టి మరో గేమ్‌ ఆడించారు. ఇది కూడా జంటలుగా ఆడాల్సి ఉంటుంది. ఒకరు అక్కడ బల్లపై ఉన్న వస్తువులను టచ్‌ చేసి దాని గురించి వివరిస్తే మిగతా వ్యక్తి అదేంటో చెప్పగలగాలి. ఈ క్రమంలో సిరి, షణ్ను జంటగా వచ్చారు. కానీ సిరి ఎంత క్లూ ఇచ్చిన షణ్ను అక్కడున్నది ఆవాలని చెప్పలేకపోయాడు. ఆవాలు కూడా తెలీదు, కానీ రేషన్‌ మేనేజర్‌ అంటూ అతడి పరువు తీసేశాడు రవి. తర్వాత ప్రియ, లహరి రాగా.. ప్రియ క్లూ ఇవ్వడంతోనే పల్లీలు అని టపీమని చెప్పేసింది లహరి.

ఇట్టే కనిపెట్టేసిన రవి
తర్వాత ప్రియాంక, శ్వేత వర్మ రాగా.. పింకీ సగ్గుబియ్యం గురించి హింట్‌ ఇవ్వగా శ్వేత కరెక్ట్‌గా గెస్‌ చేసింది. యానీ మాస్టర్‌, విశ్వ రాగా.. అక్కడున్న ఇంకును యానీ మాస్టరే గుర్తుకుపట్టలేకపోవడంతో విశ్వ ఏమీ గెస్‌ చేయలేకపోయాడు. గోరుచిక్కుడు కాయ గురించి నటరాజ్‌ మాస్టర్‌ క్లూ ఇచ్చినా మానస్‌ కనిపెట్టలేకపోయాడు. సీతాఫలం గురించి సన్నీ ఎన్ని హింట్లు ఇచ్చినా హమీదా గుర్తు పట్టలేకపోయింది. శ్రీరామచంద్ర టూత్‌పేస్ట్‌ను కనిపెట్టలేకపోయాడు. దాల్చిన చెక్క గురించి కాజల్‌ టచ్‌ చేసి క్లూ ఇవ్వడంతో రవి ఇట్టే కనిపెట్టాడు. 

కెమెరాలున్నాయి, జాగ్రత్త: రవికి వార్నింగ్‌
అనంతరం నాగ్‌.. నామినేషన్‌లో ఉన్న ప్రియ సేఫ్‌ అవగా, లహరి ఎలిమినేట్‌ అయిందని ప్రకటించాడు. దీంతో రవి షాక్‌లోకి వెళ్లిపోయాడు. శ్వేత అయితే ఆమెను పట్టుకుని వెక్కివెక్కి ఏడ్చేసింది. అటు సిరి మాత్రం లహరి తన గురించి స్టేజీ మీద చెప్పను అనేసిందని ఫైర్‌ అయింది. దీంతో రవి.. ఒకరి కోసం మీరు మారొద్దు. మీ స్నేహాన్ని మార్చుకోవద్దు అని సలహా ఇచ్చాడు. ఇక స్టేజీ మీదకు వచ్చిన లహరి.. శ్రీరామ్‌ తనకోసం ఓ పాట పాడాలంది. తను నోరు తెరిచి అడిగాక శ్రీరామ్‌ కాదంటాడా? ఎటో వెళ్లిపోయింది మనసు పాట అందుకున్నాడు. తర్వాత లహరితో ఫేల్‌డ్‌ హౌస్‌మేట్స్‌ గేమ్‌ ఆడించాడు. సిరి.. వేరే అమ్మాయిలంటే ఇన్‌సెక్యురిటీస్‌ అని, యానీ మాస్టర్‌.. వెరీ స్వీట్‌ అని చెప్పింది. యాంకర్‌ రవికి.. కెమెరాలున్నాయి, బీకేర్‌ఫుల్‌ అని హెచ్చరించింది.

ఏంట్రా ఇది? సిరి చేసిందని నన్ను నామినేట్‌ చేశావ్‌
మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించమని ప్రియకు సూచించింది లహరి. శ్రీరామ్‌కు తన కోసం తనకు టైం కేటాయించుకోమని చెప్పింది. విశ్వ.. స్ట్రాంగ్‌గా ఉండమని, లోబోతో నీ ఈక్వేషన్స్‌ మారిపోయానని, నటరాజ్‌ మాస్టర్‌.. భోళా శంకరుడని, శ్వేత.. స్ట్రాంగ్‌గా ఉండాలని, కాజల్‌.. కెమెరాలున్నాయి, కాబట్టి ఏం మాట్లాడుతున్నావో జాగ్రత్తగా చూసుకోమని సలహా ఇచ్చింది. సిరి నామినేట్‌ చేసిందని నామినేట్‌ చేశావ్‌, ఏంట్రా ఇది? అని షణ్నును క్వశ్చన్‌ చేసింది. మళ్లీ సిరితో ముడిపెట్టడంతో మండిపోయిన షణ్ను.. అందుకే నువ్వు అక్కడున్నావ్‌ అని కౌంటరిచ్చాడు. సిరి మాట్లాడినదానికే తలాడించకని సూచించింది. నువ్వు ఆలోచిస్తుంది రాంగ్‌ అని లహరిపై మండిపడ్డాడు షణ్ను.

ఆమెను స్ఫూర్తిగా తీసుకుంటే లైఫంటా స్ట్రాంగ్‌గా ఉంటాను
జెస్సీ.. చిన్నపిల్లోడని, ఎవరినో ఒకరిని ఫాలో అవ్వాలని చూస్తున్నాడంది. అయితే అతడు మాత్రం తనకు గేమ్‌ పరంగా ఫుల్‌ క్లారిటీ ఉందన్నాడు. సన్నీ.. ఇంట్లో ప్రతిఒక్కటీ తనే పట్టించుకుంటాడు. కానీ అతడు తను అనుకునేంత షార్ప్‌ కాదన్నాడు. మానస్‌.. పెద్దగా తెలుసుకునేలోపే బయటున్నాననేసింది. ప్రియాంక.. ఆమెను స్ఫూర్తిగా తీసుకుంటే నా జీవితమంతా స్ట్రాంగ్‌గా ఉండగలను అని పాజిటివ్‌ కామెంట్‌ ఇచ్చింది. హమీదా సూపర్‌ స్ట్రాంగ్‌ లేడీ అని మెచ్చుకుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top