Bigg Boss 5 Telugu: రవి పరువు పాయే, షణ్ను, సిరి కలిసిపాయే!

Bigg Boss Telugu 5: Nag Explores Anchor Ravi Double Game - Sakshi

Bigg Boss 5 Telugu, Episode 21: రవి-ప్రియ-లహరిల మధ్య జరిగిన వాదోపవాదాలకు తెర దించాడు నాగార్జున. ఒక్క వీడియోతో లహరి కళ్లు తెరిపించాడు. రవి చేతిలో నమ్మకద్రోహానికి గురైన లహరి తనకు నిజానిజాలేంటో తెలియచేసినందుకు నాగ్‌కు కృతజ్ఞతలు తెలిపింది. అలాగే ఇంటిసభ్యులు  ఎవరు హౌస్‌లో ఉండకూడదనుకుంటున్నారో వారిచేతే చెప్పించాడు. ఇక ఈ వారం నామినేషన్‌లో ఉన్న ఐదుగురిలో ఇద్దరిని సేవ్‌ చేశాడు. మరి నేటి(సెప్టెంబర్‌ 25) ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఇది చదివేయండి..

బిగ్‌బాస్‌కు నేను కరెక్ట్‌ కాదు: షణ్ముఖ్‌
ఈవారం సిరితో ఎక్కువగా ఉండలేదని, అయినప్పటికీ వీకెండ్‌లో నాగార్జున సిరిని తనను కలిపి ఏమైనా అన్నారంటే టీవీలోంచి దూకేస్తా అన్నాడు షణ్ముఖ్‌. ఇక్కడ ఫ్రెండ్‌షిప్‌ చేయాలంటేనే భయమేస్తుందన్నాడు. అసలు బిగ్‌బాస్‌కు తాను కరెక్ట్‌ కాదని బాధపడ్డాడు. యాంకర్‌ రవి ఇచ్చే సలహాలు కూడా నచ్చడం లేదని జెస్సీ దగ్గర విసుక్కున్నాడు. మరోపక్క సిరి మాత్రం.. ఇప్పటికీ షణ్ను తనను ఎందుకు దూరం పెడుతున్నాడో అర్థం కావడం లేదని బాధపడింది. జెస్సీ మాటలకు షణ్ను ఇన్‌ఫ్లూయెన్స్‌ అవుతున్నాడని అభిప్రాయపడింది. పింకీ అందాన్ని చూసి మైమరచిపోయిన శ్రీరామ్‌ పాట పాడటంతో ఆమె ఆ పాటకు తగ్గట్టు స్టెప్పులేసింది.

నిజం తెలుసుకున్న లహరి
తర్వాత నాగార్జున ఇంటిసభ్యులను పలకరిస్తూనే రవి, ప్రియ పేర్లు రాసి ఉన్న టైల్స్‌ను సుత్తెతో పగలగొట్టాడు. దీంతో రవి, ప్రియ నామినేషన్స్‌లో జరిగిన రచ్చను మరోసారి ప్రస్తావించారు. అయితే వీరి గొడవలో బాధితురాలైన లహరికి అసలు నిజమేంటో తెలియాలని ఆమెను కన్ఫెషన్‌ రూమ్‌లోకి పిలిచి రవి మాట్లాడిన వీడియో చూపించారు. ఆ వీడియోలో లహరి యాంకరింగ్‌ కోసం ట్రై చేస్తుందని, ఇంట్లో పెళ్లికాని వాళ్లు (సింగిల్‌ మెన్‌) ఉన్నప్పటికీ ఆమె తన వెంటే పడుతుందని తప్పుగా మాట్లాడిన మాటల్ని చూసి షాకైంది లహరి. దీంతో నాగ్‌.. తప్పు చేసినవాళ్లను నిలదీసి, తప్పు చేయనివాళ్లకు హగ్గివ్వమని సూచించాడు.

కవర్‌ చేయబోయిన రవి, ఫైర్‌ అయిన నాగ్‌
హాల్‌లోకి వచ్చిన లహరి.. 'యాంకర్‌ అవ్వాలనుకున్నా, ఇక్కడ సింగిల్‌ మెన్‌ను వదిలేసి నీ వెనకాలే పడుతున్నా అన్నారు. ఇది చాలా తప్పు. నేను వీడియో చూశాను' అని రవిపై ఫైర్‌ అవుతూ ప్రియకు హగ్గిచ్చింది. దీంతో ఇష్యూ క్లియర్‌ అయిందా అని నాగ్‌ రవిని అడగ్గా అతడు ఏదో కవర్‌ చేద్దామని ప్రయత్నించాడు. ఇంతలో నాగ్‌ మధ్యలో అడ్డుకుంటూ.. ఇదంతా కాదు, అమ్మ మీద ఒట్టు, నేను సింగిల్‌ మెన్‌ అనే పదమే అనలేదు అక్కా అని అన్నావా? లేదా? అని గట్టిగా నిలదీయడంతో రవి నిజం ఒప్పేసుకున్నాడు. కానీ ప్రియ, లహరి దగ్గర అప్పటిదాకా ఆ విషయం ఒప్పుకోలేదని వాళ్లు చెప్పుకొచ్చారు. ఈ ఇష్యూతో రవి పరువు మొత్తం పోయినట్లైంది.

వాడికోసం నువ్వు బాధపడొద్దు: నాగ్‌
అనంతరం నాగ్‌.. మానస్‌ తనకు తానే వరస్ట్‌ పర్ఫామర్‌ అని చెప్పుకోవడాన్ని తప్పుపట్టాడు. జైలు జీవితం బాగుందనడాన్ని కూడా విమర్శించాడు. కాజల్‌.. విశ్వను వరస్ట్‌ కెప్టెన్‌ అందన్న నాగ్‌.. ఇంట్లోవాళ్ల అభిప్రాయం అడిగాడు. అయితే కాజల్‌కు దిమ్మతిరిగేలా మెజారిటీ జనాలు అతడిని బెస్ట్‌ కెప్టెన్‌ అని పేర్కొన్నారు. ఇక ఈ వారం కెప్టెన్‌ అయిన జెస్సీకి కెప్టెన్‌ బాండ్‌ ఒక్కటే ఉందని, నిర్ణయాలు మాత్రం షణ్ముఖ్‌ తీసుకుంటున్నాడని సెటైర్‌ వేశాడు నాగ్‌. అలాగే సిరితో ఫ్రెండ్‌షిప్‌ కట్‌ చేయడాన్ని వ్యతిరేకించాడు. ఎలిమినేట్‌ అయి ఇక్కడినుంచి వెళ్లిపోయినవాళ్లు ఏదో అన్నారని, అనుకుంటున్నారని సిరికి దూరమవద్దని సలహా ఇవ్వడంతో వాళ్లిద్దరూ మళ్లీ కలిసిపోయారు. ప్రియాంక లవ్‌స్టోరీ గుర్తు చేసిన నాగ్‌.. నిన్ను బాధపెట్టినవాడి కోసం చింతించొద్దని ధైర్యాన్ని నూరిపోశాడు.

ఏంట్రా? ఈ నోటి దూలేంట్రా..
తర్వాత హౌస్‌లో ఉండేందుకు అర్హత లేనివాళ్లను డోర్‌ దగ్గర నిలబెట్టి ముఖం మీద తలుపేయమని కంటెస్టెంట్లతో గేమ్‌ ఆడించాడు. మొదటగా వచ్చిన ప్రియ.. లోబో ఇంట్లో ఉండటానికి వీల్లేదని చెప్పింది. తర్వాత లోబో.. అందంతో అందరినీ పరేషాన్‌ చేస్తోందంటూ లహరిని; లహరి.. రవి; రవి.. ప్రియ; జెస్సీ, ప్రియాంక సింగ్‌, విశ్వ, కాజల్‌.. లోబో; శ్వేత, యానీ మాస్టర్‌.. మానస్‌; మానస్‌.. యానీ మాస్టర్‌; నటరాజ్‌ మాస్టర్‌, హమీదా.. కాజల్‌; షణ్ముఖ్‌, సిరి.. సన్నీ; సన్నీ.. సిరి; శ్రీరామ్‌.. జెస్సీ పేర్లను ఇంటి నుంచి వెళ్లిపోయేందుకు సూచించారు. ఇక టాస్క్‌లో శ్వేతను, ఫ్రెండ్‌షిప్‌ కట్‌ చేసి సిరిని ఏడిపించిన షణ్ముఖ్‌ను బాగానే ఆడుకున్నాడు నాగ్‌. ఏంట్రా? ఈ నోటి దూలేంట్రా? అటు శ్వేతను, ఇటు సిరిని ఏడిపిస్తున్నావు? అని కౌంటరేశాడు. ఇక గుంటనక్క ఎవరని నాగ్‌ నటరాజ్‌ మాస్టర్‌ను నిలదీయగా నెక్స్ట్‌ టైమ్‌ చెప్తానని దాటవేశాడు. తర్వాత శ్రీరామ్‌ సేఫ్‌ అయినట్లు ప్రకటించాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top