Priya: నువ్వు హౌస్‌లో అందరు అబ్బాయిలతో బిజీ కదా!: నోరు పారేసుకున్న ప్రియ

Bigg Boss 5 Telugu: Priya Shocking Comments On Lahari Shari - Sakshi

Bigg Boss Telugu 5, Nominations: బిగ్‌బాస్‌ మూడోవారం 'వాల్‌ ఆఫ్‌ షేమ్‌' అనే నామినేషన్స్‌ టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో భాగంగా ఎవరైతే ఈ షోలో కొనసాగడం అనవసరం అనుకుంటారో వారి పేరును బద్ధలు కొడుతూ నామినేట్‌ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అందరూ పోటాపోటీగా నామినేట్‌ చేయాలనుకున్న కంటెస్టెంట్ల పేర్లను ముక్కలు ముక్కలు చేస్తున్నారు. ఈ క్రమంలో లహరి.. ప్రియను నామినేట్‌ చేసింది. మీరు నాతో ఎందుకు దూరంగా ఉంటున్నారో అర్థం కావడం లేదని తెలిపింది. దీనికి ప్రియ బదులిస్తూ.. ఎందుకంటే నువ్వు ఇంట్లో ఉన్న అందరు అబ్బాయిలతో బిజీగా ఉన్నావు, కాబట్టి! అని స్టేట్‌మెంట్‌ ఇచ్చింది.

ప్రియకు వార్నింగ్‌ ఇచ్చిన రవి
ఆమె సమాధానం విని షాకైన లహరి.. ఎవరితో ఉన్నానో చెప్తారా? అని అడిగింది. ఇందుకామె రవి, మానస్‌తో బిజీగా ఉన్నావని చెప్పింది. ప్రియ మాటలు విని షాకైన రవి.. సిరిన ఉదాహరణగా చెప్తూ.. ఆమెను ఒక ఫ్రెండ్‌లాగా, సోదరిలాగా భావిస్తాను అని చెప్పుకొచ్చాడు. ఇంతలో మధ్యలోనే అడ్డుకున్న ప్రియ.. ఇప్పుడు మీరు అందరి దగ్గరా సపోర్ట్‌ ఆశించకండి అని కౌంటరిచ్చింది. ఆమె మాటలతో తల పట్టుకున్న రవి.. అలాంటి రాంగ్‌ స్టేట్‌మెంట్స్‌ ఇవ్వొద్దంటూ ప్రియకు వార్నింగ్‌ ఇచ్చాడు. అటు లహరి కూడా మరోసారి తనలోని అర్జున్‌రెడ్డి యాంగిల్‌ను బయటపెడుతూ.. నా గురించి మాట్లాడే అర్హత మీకు లేదు అని హెచ్చరించింది.

ప్రియ కంటే ఉమాదేవి నయం!
ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు ప్రియలో సెకండ్‌ యాంగిల్‌ బయటపడింది, అప్పుడు సన్నీ, ఇప్పుడు లహరి మీద తన అక్కసు వెళ్లగక్కింది, ఈవిడ కంటే ఉమాదేవి 100 రెట్లు నయం అంటూ విమర్శిస్తున్నారు. బహుశా ఆమె చెప్పింది నిజమే కావచ్చేమో కానీ చెప్పిన విధానం బాగోలేదంటున్నారు మరికొందరు. ప్రియ ఇలాగే ఇతర కంటెస్టెంట్లను చులకన చేస్తే మాట్లాడితే ఈ వారం వెళ్లిపోవడం ఖాయమని చెప్తున్నారు. మరి ఈ గొడవ తర్వాత ఒకరికొకరు సారీ చెప్పుకుని కలిసిపోతారా? లేదా ప్రియ, లహరి మధ్య వైరం కొనసాగనుందా? అనేది చూడాల్సిందే!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

20-09-2021
Sep 20, 2021, 20:51 IST
సాధారణంగా సెలబ్రిటీ కపుల్‌ హౌస్‌లోకి అడుగు పెట్టడం చూశాం, కానీ బిగ్‌బాస్‌ చరిత్రలోనే తొలిసారిగా ఇదివరకే విడాకులు తీసుకున్న జంటను...
20-09-2021
Sep 20, 2021, 18:53 IST
మంచాలు కూడా పక్కపక్కనే వేసుకుంటారా ఎవరైనా? దాని పక్కనే వాడు మంచం వేసుకోవాలా? బయటకొచ్చాక కూడా వాళ్లిద్దరి మధ్య ఇదే...
20-09-2021
Sep 20, 2021, 17:44 IST
బాగా ఆడినా, ఆడకపోయినా, నవ్వించినా, నవ్వులపాలైనా, ఏడ్చినా, ఒకరిని ఏడిపించినా, సేఫ్‌ గేమ్‌ ఆడినా, ఆడకపోయినా, ఎన్ని కుయుక్తులు, కుట్రలు...
20-09-2021
Sep 20, 2021, 16:56 IST
ఎన్ని రోజులు చిన్న చెడ్డీలు వేసుకుని ఆ దెబ్బ చూపించి సింపథీ పొందడానికి ట్రై చేస్తూ ఇంత మంచి ప్లాట్‌ఫామ్‌ను...
20-09-2021
Sep 20, 2021, 16:45 IST
Karthika Deepam Fame Uma Devi Remuneration బిగ్‌బాస్ కంటెస్టెంట్‌ కార్తిక దీపం ఫేమ్‌ ఉమాదేవి రెండు వారాలకు గాను...
20-09-2021
Sep 20, 2021, 00:45 IST
లోబోను హౌస్‌లో ఎంతోమంది కించపరుస్తున్నారంటూ ఎమోషనల్‌ అయింది ఉమాదేవి. ఆయనను స్వీట్‌ హార్ట్‌ అని పిలుస్తారు, కానీ లోపలి నుంచి అనరు...
19-09-2021
Sep 19, 2021, 22:59 IST
సన్నీ విషయంలో తప్పు చేశానంటూ షణ్ముఖ్‌ తనను తానే దెయ్యమని చెప్పుకున్నాడు. అది కుదరదని నాగ్‌ తెగేసి చెప్పడంతో..
19-09-2021
Sep 19, 2021, 22:19 IST
మొదటి వారంలో అందరినీ బెదరగొట్టిన ఉమా, రెండో వారంలో మాత్రం లోబోతో కామెడీ చేస్తూ అదరగొట్టింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం...
19-09-2021
Sep 19, 2021, 21:36 IST
దాదాపు 14 వారాలపాటు కొనసాగే ఈ కార్యక్రమం కోసం షో నిర్వాహకులు ఆయనకు సుమారు రూ.350 కోట్ల రెమ్యునరేషన్‌ ఇవ్వనున్నారనే ప్రచారం...
19-09-2021
Sep 19, 2021, 20:04 IST
పటాసులు పేలుస్తూ రవికి వినబడేలా గట్టిగా అరుస్తూ బర్త్‌డే విషెస్‌ చెప్పారు. ఈ క్రమంలో రవి కూతురు వియా తండ్రిని...
19-09-2021
Sep 19, 2021, 17:59 IST
మానస్‌ ఓటమిని తీసుకోలేకపోతున్నాడేమోనని శ్రీరామ్‌ అభిప్రాయపడ్డాడు. షణ్ముఖ్‌ మాత్రం ఇంట్లోవాళ్లను ఎవరినీ సెలక్ట్‌ చేసుకోకుండా తనకు తానే దెయ్యాన్ని అని ప్రకటించుకున్నాడు.. ...
19-09-2021
Sep 19, 2021, 13:54 IST
Natraj Master Wife Neetu Pregnancy Photoshoot: భార్య ఏడు నెలల గర్భంతో ఉన్న సయమంలో ఆమెను వదిలేసి బిగ్‌బాస్‌ షోలోకి...
19-09-2021
Sep 19, 2021, 00:01 IST
ఈ వారం మాత్రం తనలోని కామెడీ యాంగిల్‌ను పరిచయం చేసి జనాలను కడుపుబ్బా నవ్వించిందీ ఉమా. అలాగే తనను ఎన్ని...
18-09-2021
Sep 18, 2021, 23:14 IST
ఆ తర్వాత హాట్‌స్టార్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికైన రామ్‌చరణ్‌ స్టేజీ మీదకు వచ్చాడు. ఇంత అందంగా, ఎంతో ఫిట్‌గా ఉన్న నాగ్‌ను...
18-09-2021
Sep 18, 2021, 20:17 IST
సిరి డ్రెస్‌ లోపలున్న క్లాత్‌ ఎవరు తీశారు? అని సూటిగా ప్రశ్నించాడు. షణ్ముఖ్‌ నిస్సంకోచంగా సన్నీ పేరు చెప్పాడు. దీనిపై ఓ క్లారిటీ ఇచ్చేందుకు...
18-09-2021
Sep 18, 2021, 19:07 IST
షణ్ముఖ్‌.. దొరికిందే చాన్స్‌ అని చెర్రీకి ఐ లవ్‌ యూ చెప్పాడు. ఇంతలో నాగ్‌ మధ్యలో అడ్డుకుంటూ ఈ రోజు...
18-09-2021
Sep 18, 2021, 17:06 IST
ఈ సీజన్‌ ముగియగానే మినీ బిగ్‌బాస్‌ షోను ప్రవేశపెడతారట! ఇది ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో మాత్రమే ప్రసారం...
17-09-2021
Sep 17, 2021, 23:42 IST
ఫస్ట్‌ వీక్‌లో సిరి, హమీదా మీద, తర్వాత అమ్ము(లహరి) మీద లవ్‌ స్టార్ట్‌ అయిందని చెప్పుకొచ్చాడు శ్రీరామ్‌..
17-09-2021
Sep 17, 2021, 15:32 IST
కెప్టెన్సీ కంటెండర్స్‌ టాస్క్‌ ద్వారా ఇంట్లో మంట పెట్టిన బిగ్‌బాస్‌ ఇప్పుడు మరోసారి అగ్గి రాజేసినట్లు తెలుస్తోంది. ఇంటిసభ్యులంతా ఏకాభిప్రాయంతో.. ...
17-09-2021
Sep 17, 2021, 15:01 IST
బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ బుల్లితెర ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. ఇక్కడ టన్నుల కొద్దీ ఎంటర్‌టైన్‌మెంట్‌ లభించును అన్న నాగార్జున...

మరిన్ని ఫొటోలు 

Read also in:
Back to Top