
Lahari Shari In Bigg Boss 5: యాంకర్, న్యూస్ రీడర్, జర్నలిస్టు, మోడల్, నటిగా పాపులర్ అయింది లహరి షారి. సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసే ఈమె 'అర్జున్ రెడ్డి' సినిమాలో డాక్టర్‌గా నటించింది. 'మళ్లీ రావా' సినిమాలో హీరో సుమంత్ స్నేహితురాలిగా ఆకట్టుకుంటుంది. 'సారీ నాకు పెళ్లైంది', 'జాంబిరెడ్డి' తదితర చిత్రాల్లో నటించింది. బిగ్‌బాస్ ఐదో సీజన్‌లో మూడో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ నటి అనుకున్నది సాధించడానికి, తప్పును ప్రశ్నించడానికి ధైర్యాన్ని ఎప్పుడూ వదులుకోలేదని చెప్తోంది.
ఈ క్రమంలో కదిలించే కష్టాలు వచ్చినా చెక్కిళ్ల చాటు చిరునవ్వును ఎప్పుడూ చెదిరిపోనివ్వలేదని చెప్పింది. ఇక స్టేజీపైకి వచ్చీరావడంతోనే అరుదైన గులాబీ పువ్వును నాగార్జునకు అందించి ఆయన్ను ఫిదా చేసేందుకు ప్రయత్నించింది లహరి. వచ్చే ఏడాది ఈ సమయానికి కూడా ఈ పువ్వు వాడిపోదని చెప్పింది. మరి తన ఎంట్రీతోనే నాగ్‌ను బుట్టలో వేసుకున్న ఈ భామ బిగ్‌బాస్ వీక్షకులను ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి!