breaking news
krishnashatmi
-
కృష్ణాష్టమి సెలబ్రేషన్స్: గోపికలుగా మారిపోయిన తారలు
కృష్ణాష్టమి (Krishna Janmashtami) వచ్చిందంటే చాలామంది సెలబ్రిటీల ఇంట పండగ వాతావరణం ఉంటుంది. తమ పిల్లల్ని అల్లరి కన్నయ్యగా రెడీ చూసి ముచ్చటపడుతుంటారు. పిల్లల్ని వెన్నదొంగలా మార్చేయడంతో పాటు తల్లులు గోపికలుగా ముస్తాబవుతారు. చిలిపి కృష్ణుడితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటారు.మా కృష్ణుడిని ఫోటో తీద్దామంటే అస్సలు కూర్చోవడం లేదని హీరోయిన్ ప్రణీత.. మావాడికి కృష్ణుడిగా రెడీ చేసేందుకు ఒప్పించడానికే మూడు గంటలు పట్టిందని నటి నవీన.. ఇలా తారలందరూ ఓ పక్క తంటాలు పడుతూనే మరోపక్క సంతోషంగా కృష్ణాష్టమి వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు. మరి ఎవరెలా ముస్తాబయ్యారో మీరూ చూసేయండి.. View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Lahari Arundhati Vishnuvazhala (@lahari_actress) View this post on Instagram A post shared by Naveena Yata (@naveenayataofficial) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Gali Maheshwari (@mahishivan9_official) View this post on Instagram A post shared by K Sreevani (@kambhammettu_sreevani) -
కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మనందరిపైన, రాష్ట్రంపైన శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులు ఉండాలని వైఎస్ జగన్ కోరుకున్నారు.కాగా, వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘రాష్ట్ర ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఆథ్యాత్మికంగా శక్తినిచ్చే ఈ పండుగ ప్రజలందరినీ ఏకం చేస్తుంది. చెడును నిర్మూలించి ధర్మాన్ని కాపాడడంలో శ్రీకృష్ణుడి బోధనలు మానవాళికి ఆచరణీయం. మనందరిపైన, రాష్ట్రంపైన శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఆథ్యాత్మికంగా శక్తినిచ్చే ఈ పండుగ ప్రజలందరినీ ఏకం చేస్తుంది. చెడును నిర్మూలించి ధర్మాన్ని కాపాడడంలో శ్రీకృష్ణుడి బోధనలు మానవాళికి ఆచరణీయం. మనందరిపైన, రాష్ట్రంపైన శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.— YS Jagan Mohan Reddy (@ysjagan) August 26, 2024 -
శుభప్రద శ్రావణం
కొత్తగా పెళ్లైన ఆడపిల్లలకు శ్రావణ పట్టీలు పెట్టే వేడుకలతోనో.. కుటుంబ సుఖసౌఖ్యాల కోసం చేసే నోములు వ్రతాలతో నెలంతా సందడి చేసే శుభప్రద శ్రావణం రానే వచ్చేసింది. తొలిరోజే అమ్మవారికి ప్రీతికరమైన శుక్రవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. దీంతో అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక సన్నాహాలు చేపట్టారు. నాగుల చవితి..గౌరీ పంచమి.. మంగళగౌరి వ్రతం.. వరలక్ష్మీ వ్రతం.. కృష్ణాష్టమి.. రాఖీపౌర్ణిమ తదితర ప్రధాన పండుగలు ఈ మాసం సకల దేవతలకు అత్యంత ప్రీతికరమైనదిగా పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ మాసం వచ్చిదంటే అందరిలో.. ముఖ్యంగా మహిళలలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి సాక్షి, అనంతపురం : గురువారం నాటి అమావాస్య రాకతో ఆషాఢానికి వీడ్కోలు పలుకుతూ శుభ శ్రావణ మాసం శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. వాస్తవానికి బుధవారం మధ్యాహ్నం నుంచే అమావాస్య వచ్చేసింది. గురువారం మధ్యాహ్నానికి వెళ్లిపోతుంది. అయితే సూర్యోదయంతో తిథి వార నక్షత్రాల లెక్కింపు ఉన్నందున శుక్రవారం వారం నుంచే శ్రావణ మాసం ఆరంభమవుతుందని పండితులంటున్నారు. శ్రావణమొస్తోందంటే అంతటా ఒకటే సందడి..హడావుడి నెలకొంటుంది. ఈ మాసంలో ఆధ్యాత్మిక చింతన, శుభకార్యాలు నిర్వహిస్తే పుణ్యలోకప్రాప్తి కలుగుతుందని వేదపండితులు అంటున్నారు. ఈ మాసంలో వచ్చే బలరామకృష్ణ్లు జయంతి, హయగ్రీవ జయంతి, రాధాష్టమి వంటివి భక్తిభావాలను మరింత పెంచనున్నాయి. గీతాచార్యుడైన శ్రీకృష్ణభగవానుని జన్మాష్టమి పర్వదిన వేడుకలు జిల్లా కేంద్రంలోని ఇస్కాన్ మందిరంలో కన్నుల పండువగా జరుగుతాయి. శ్రావణ బహుళ విధియనాడు మంత్రాలయ రాఘవేంద్రుల ఆరా«ధనా ఉత్సవాలు మొదటిరోడ్డులోని మఠంలో శోభాయమానంగా జరుగుతాయి. సామాన్య భక్తులే గాక రైతులు కూడా పంటలు సమృద్ధిగా పండాలని, ప«శు సంపద వర్దిల్లాలని ప్రత్యేకంగా పూజలు చేసే పొలాల అమావాస్య కూడా ఇదే మాసం చివరి రోజు రానుంది. హరిహరబేధం లేని మాసం అన్నిటికి మించి పరమశివునికి కార్తీకం తర్వాత ఇష్టమైనది శ్రావణమాసమేనని శివపురాణం చెబుతోంది. ఈ మాసంలో శనిత్రయోదశి పూజలు, తైలాభిషేకాలు, మహారుద్రాభిషేకాలు చేస్తే పరమపద మోక్ష ప్రాప్తి కలుగుతుందని పురాణపండితులు చెబుతున్నారు. అదే విధంగా ఉపవాస దీక్షలకు ఇందులో అధిక ప్రాధాన్యముంటుంది. ముఖ్యంగా మగువలు సుమంగళిగా జీవించాలని కోరుకుంటూ చేసే వివిధ నోములు, వ్రతాలతో ఆలయాలే కాదు ఇంటి పరిసరాలూ పచ్చటి తోరణాలతో పసుపు కుంకుమలతో కళకళలాడుతాయి. శ్రావణంలో వచ్చే పర్వదినాలివే: ఈసారి శ్రావణ మాసం ఆగస్టు 02 నుండి 29వ తేదీ వరకూ ఉంటుంది. ఇందులో ఆగస్టు 4న నాగుల చవితితో పండుగలు ప్రారంభమవుతాయి. అదే క్రమంలో 6న మంగళగౌరీ వ్రతం, 9న వరలక్ష్మీవ్రతం, 15న స్వాతంత్య్ర దినోత్సవంతో పాటు రాఖీ పౌర్ణిమ, ఇదే రోజు నుంచి ఐదు రోజుల పాటు రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు, 19న సంకష్టహర చతుర్థి, 23న శ్రీ కృష్ణాష్టమి, 24న వైష్ణవ కృష్ణాష్టమి వేడుకలు రానున్నాయి. 30న పొలాల అమావాస్యతో భాద్రపద మాసం ప్రారంభమవుతుంది. ప్రధానంగా శ్రావణ శుక్రవారాలు అమ్మవారి ఆలయాలలో, శ్రావణ శనివారాలు జిల్లా వ్యాప్తంగా శ్రీవైష్ణవ క్షేత్రాలు ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటాయి. శ్రావణ నోములకు చాలా ప్రాధాన్యత శ్రావణ మాసం అంటే ఎంతో పవిత్రమైనదిగా, మరెంతో ప్రధానమైనదిగా భావిస్తారు. జ్ఞానసిద్ధిని ఒసిగే మాసంగా దీనిని పురాణాల్లో పేర్కొన్నారు. శ్రావణమంటే ఎంతో శుభమని భావించడం పరిపాటి. అయితే ఈసారి నెలంతా శుభముహూర్తాలు లేకపోవడం ప్రత్యేకంగా గుర్తించాలి. గత నెల 9న వచ్చిన శుక్రమూఢమి సెప్టెంబరు 19 వరకూ ఉంటుంది. తర్వాత కూడా పదిరోజులు పితృపక్షాలు రానున్నాయి. అదే నెల 29న ఆశ్వీజం పుట్టే వరకూ శుభ కార్యాలు చేయడానికి వీలులేదు. ముఖ్యంగా వివాహాలు, ఉపనయనాలు, గృహప్రవేశాలకు ముహూర్తాలు లేవు. -
రెండువేల మందితో రాధాకృష్ణుల సమ్మేళనం
ఒంగోలు నగరం ఒక అరుదైన ఘనతను సాధించేందుకు, ఏకంగా ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు సంసిద్ధమవుతోంది. అందుకోసం హిందూ ధర్మ సంరక్షణ సమితి, స్వామి వివేకానంద 150వ ఉత్సవ జయంతి సమితి సంయుక్తంగా కృషి చేస్తున్నాయి. ఈ అరుదైన ప్రదర్శనకు స్థానిక పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల మైదానం వేదిక కానుంది. నగరంలోని త్యాగరాజ మందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కార్యక్రమ నిర్వాహకులు తడికమళ్ల హరిప్రసాదరావు, పాంచాలవరపు రాంబాబు ఆ వివరాలు వెల్లడించారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్ట్స్లో స్థానం సాధించేందుకు ఈ నెల 25వ తేదీ కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో రెండువేల మంది చిన్నారులతో శ్రీకృష్ణ బాలబృందావనం పేరిట రాధాకృష్ణుల సమ్మేళనాన్ని నిర్వహించనున్నట్లు వారు వివరించారు. రాధాకృష్ణుల సమ్మేళనంలో 12 సంవత్సరాల్లోపు బాలబాలికలు పాల్గొనవచ్చని తెలిపారు. పాల్గొనదలచిన వారు తమపేర్లను ఈ నెల 20వ తేదీలోగా నమోదు చేసుకోవాలని సూచించారు. దేశంలోని ఏ ప్రాంతం వారైనా సమ్మేళనంలో పాల్గొనవచ్చన్నారు. వారంతా దరఖాస్తు ఫారాలు పూర్తిచేసి 50 రూపాయల నిర్వహణ విరాళాన్ని అందజేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పలురంగాల ప్రముఖులు రాధాకృష్ణుల సమ్మేళనాన్ని ప్రత్యక్షంగా పరిశీలిస్తారని తెలిపా రు. సమ్మేళనంలో పాల్గొనదలచిన చిన్నారులకు తల్లిదండ్రులు ఇంటివద్దనే మేకప్ వేసి నిర్ణీత సమయానికి తీసుకురావాలన్నారు. ఎక్కువమంది విద్యార్థులు, చిన్నారులు సమ్మేళనంలో పాల్గొనేలా ప్రోత్సహించిన పాఠశాలలకు బహుమతులు కూడా అందజేయనున్నట్లు చెప్పారు. సమ్మేళనంలో పాల్గొన్న వారికి ప్రశంసపత్రాలు అందజేస్తామన్నారు. సమ్మేళనం ముగిసిన నెలరోజుల తర్వాత అవసరమైతే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నిర్వాహకులకు నిర్ణీత రుసుం చెల్లించి వారి నుంచి అధికార పూర్వకంగా కూడా సర్టిఫికెట్ పొందవచ్చని నిర్వాహకులు వివరించారు. ఒంగోలులో తొలిసారి భారీస్థాయిలో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతిఒక్కరూ తోడ్పాటునందించాలని వారు కోరారు. కార్యక్రమ వివరాలకు తడికమళ్ల హరిప్రసాదరావు (98487 97339), పాంచాలవరపు రాంబాబు (96403 00507)ను సంప్రదించాలని సూచించారు. విలేకర్ల సమావేశంలో మైనంపాటి సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.