కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌ | YS Jagan Congratulated Krishnashtami For AP People | Sakshi
Sakshi News home page

కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌

Aug 26 2024 10:29 AM | Updated on Aug 26 2024 11:03 AM

YS Jagan Congratulated Krishnashtami For AP People

సాక్షి, తాడేపల్లి: నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. మ‌నంద‌రిపైన, రాష్ట్రంపైన శ్రీకృష్ణ భ‌గ‌వానుడి ఆశీస్సులు ఉండాల‌ని వైఎస్‌ జగన్‌ కోరుకున్నారు.

కాగా, వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా..‘రాష్ట్ర ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఆథ్యాత్మికంగా శక్తినిచ్చే ఈ పండుగ ప్రజలందరినీ ఏకం చేస్తుంది. చెడును నిర్మూలించి ధర్మాన్ని కాపాడడంలో  శ్రీకృష్ణుడి బోధనలు మానవాళికి ఆచరణీయం. మ‌నంద‌రిపైన, రాష్ట్రంపైన శ్రీకృష్ణ భ‌గ‌వానుడి ఆశీస్సులు ఉండాల‌ని కోరుకుంటున్నాను’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement