ప్రేమ... వినోదం | Pradeep Machiraju Akkada Ammayi Ikkada Abbayi Releases On April 11 | Sakshi
Sakshi News home page

ప్రేమ... వినోదం

Mar 17 2025 2:50 AM | Updated on Mar 17 2025 2:50 AM

Pradeep Machiraju Akkada Ammayi Ikkada Abbayi Releases On April 11

‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాతో హీరోగా పరిచయమైన ప్రదీప్‌ మాచిరాజు నటించిన తాజా చిత్రం ‘అక్కడ అమ్మాయి... ఇక్కడ అబ్బాయి’. ఇందులో దీపికా పిల్లి హీరోయిన్‌గా నటించారు. లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందింది. 

నితిన్‌ – భరత్‌ల దర్శకత్వంలో మాంక్స్‌ అండ్‌ మంకీస్‌ బ్యానర్‌ ఈ సినిమాను నిర్మించింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 11న రిలీజ్‌ చేయనున్నట్లు ఆదివారం చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. ‘వెన్నెల’ కిశోర్, సత్య, గెటప్‌ శ్రీను, మురళీధర్‌ గౌడ్‌ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సంగీతం: రధన్‌.

Advertisement
 
Advertisement
Advertisement