ప్రభాస్ కోట్లాది రూపాయల సాయం.. బయటపెట్టిన కాస్ట్యూమ్ మాస్టర్ | Prabhas Gifts 10 Thousand Rupees Each Kalki 2898 Movie Team | Sakshi
Sakshi News home page

Prabhas: వేలమంది వర్కర్స్‌కి కోట్లాది రూపాయలు గిఫ్ట్ ఇచ్చిన డార్లింగ్

Jul 10 2024 11:12 AM | Updated on Jul 10 2024 2:00 PM

Prabhas Gifts 10 Thousand Rupees Each Kalki 2898 Movie Team

ప్రభాస్ మంచితనం మరోసారి బయటపడింది. గతంలో చాలా సాయాలు చేశాడు కదా ఇందులో అంత గొప్ప ఏముంది అనుకుంటున్నారా? చాలానే ఉంది. ఎందుకంటే చాలామంది హీరోలు.. సినిమా చేశామా డబ్బులు తీసుకున్నామా అన్నట్లు ఉంటారు. ప్రభాస్ అలా కాదు. ఇప్పుడు అలాంటిదే ఓ సీక్రెట్ బయటపడింది. డార్లింగ్ హీరో చేసిన సాయాన్ని 'కల్కి' చిత్రానికి కాస్ట్యూమ్ మాస్టర్‌గా పనిచేసిన వ్యక్తి బయటపెట్టాడు.

(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయిందా? ఆ స్పెషల్ డే నుంచి స్ట్రీమింగ్!)

గత నెల 27న థియేటర్లలోకి వచ్చిన 'కల్కి' మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. రూ.1000 కోట్ల వసూళ్లకు చేరువలో ఉంది. సినిమా వచ్చి దాదాపు రెండు వారాలు అయిపోయింది. ఇప్పటికీ ఈ చిత్రం గురించి అందరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. అలా ఇప్పుడు మరోసారి మాట్లాడుకోవడానికి ఓ కారణం ప్రభాస్. ఎందుకంటే సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ అంటే మొత్తంగా వేలాది మందికి తలో రూ.10 వేలు బహుమతిగా ఇచ్చాడట.

'కల్కి 2898' సినిమా కాస్ట్యూమ్ టీమ్‌లో మురళి అనే వ్యక్తి తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌లో ఇంటర్వ్యూ ఇ‍చ్చాడు. ఈ సందర్భంగా ప్రభాస్ సాయాన్ని బయటపెట్టాడు. అన్ని డిపార్ట్‌మెంట్స్‌లో పనిచేసిన ప్రతి ఒక్కరి పేరు తెలుసుకుని, అలా అందరికీ తలో రూ.10 వేలు.. వాళ్లవాళ్ల బ్యాంక్ అకౌంట్స్‌లో వేశారని కాస్ట్యూమ్ మాస్టర్ మురళి చెప్పారు. ఇంతవరకు ఇలాంటి హీరోని తను ఎప్పుడూ చూడలేదని అన్నాడు. షూటింగ్ జరుగుతున్నన్నీ రోజులు అద్భుతమైన భోజనం కూడా పెట్టారని చెబుతూ ప్రభాస్‌ని తెగ పొగిడేశాడు. ఎంతైనా డార్లింగ్ అంటే ప్రభాస్..ప్రభాస్ అంటే డార్లింగ్!

(ఇదీ చదవండి: హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలిపై మరో కేసు పెట్టిన హీరోయిన్)

Advertisement
 
Advertisement
Advertisement