హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలిపై మరో కేసు పెట్టిన హీరోయిన్ | Raj Tarun Issue: Malvi Malhotra Another Complaint On Lavanya | Sakshi
Sakshi News home page

Raj Tarun-Lavanya: బెదిరిస్తోంది... లావణ్యపై హీరోయిన్ మరో ఫిర్యాదు

Published Wed, Jul 10 2024 9:07 AM | Last Updated on Wed, Jul 10 2024 1:58 PM

Raj Tarun Issue: Malvi Malhotra Another Complaint On Lavanya

టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్-అతడి మాజీ ప్రియురాలు లావణ్య మధ్య వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇదివరకే ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. ఇప్పుడు ఈ కేసులో కీలకంగా నిలిచిన నటి మాల్వి మల్హోత్రా.. లావణ్యపై మరో ఫిర్యాదు చేసింది. తనని, తన తమ్ముడిని లావణ్య బెదిరిస్తోందని హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో జోరీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసుని ఫిలిం నగర్ స్టేషన్‌కి పోలీసులు బదిలీ చేశారు. లావణ‍్య బెదిరింపులపై చర్యలు తీసుకోవాలని మాల్వీ తన ఫిర్యాదులో పేర్కొంది.

(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయిందా? ఆ స్పెషల్ డే నుంచి స్ట్రీమింగ్!)

ఈ కేసు పూర్వాపరాలకు వస్తే.. రాజ్ తరుణ్ తను కొన్నేళ్లుగా రిలేషన్‌లో ఉన్నామని, కానీ హీరోయిన్ మాల్వి మల్హోత్రా మాయలో పడి తనని దూరం పెట్టాడని చెబుతూ లావణ్య అనే అమ్మాయి మీడియా ముందుకొచ్చింది. మాల్వి, ఆమె తమ్ముడు కలిసి తనని బెదిరిస్తున్నారని, రాజ్ తరుణ్‌ని వదిలేయకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారని చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది. దీనికి ప్రతిగా రాజ్ తరుణ్ లావణ్యపై కేసు పెట్టాడు. గతంలో ఈమెతో రిలేషన్‌లో ఉ‍న్న మాట నిజమేనని, కానీ ఇప్పుడు మస్తాన్ అనే వేరే వ్యక్తితో ఈమె రిలేషన్‌లో ఉందని అన్నాడు.

మరోవైపు తనపై లావణ్య అసత్య ఆరోపణలు చేస్తోందని చెప్పి నటి మాల్వి మల్హోత్రా పోలీస్ కంప్లైంట్ చేసింది. ఇప్పుడు మరోసారి ఫిర్యాదు చేసింది. తనని తన తమ్ముడిని లావణ్య బెదిరింపులకు గురి చేస్తుందని ఫిర్యాదులో పేర్కొంది. లావణ్య బెదిరింపులపై చర్యలు తీసుకోవాలని చెప్పుకొచ్చింది. మరి రోజుకో టర్న్ తీసుకుంటున్న ఈ కేసులో తర్వాత ఏం జరుగుతుందో చూడాలి?

(ఇదీ చదవండి: వంటలక్కకి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా? వీడియో వైరల్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement