వంటలక్కకి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా? వీడియో వైరల్ | Karthika Deepam Premi Viswanath Son Interesting Details And Latest Look Video Goes Viral | Sakshi
Sakshi News home page

Vantalakka Son: 'కార్తీకదీపం' వంటలక్క కొడుకు ఇతడే.. పేరేంటో తెలుసా?

Jul 9 2024 9:07 PM | Updated on Jul 10 2024 12:49 PM

Karthika Deepam Premi Viswanath Son Details

గత కొన్నేళ్లలో తెలుగు సీరియల్ చరిత్రలో అత్యంత ప్రజాదరణ దక్కించుకున్నది ఏదైనా ఉందంటే అది 'కార్తీకదీపం'. కాస్త నలుపు ఛాయలో ఉన్న ఓ గృహిణి పడే ఇబ్బందులు అనే కథతో తీసిన ఈ సీరియల్ బ్లాక్ బస్టర్ హిట్. ఇందులో వంటలక్క పాత్ర చేసిన ప్రేమి విశ్వనాథ్ అనే నటికి అయితే తెలుగు రాష్ట్రాల్లో స్టార్ హీరోయిన్‌కి ఉన్నంత ఫాలోయింగ్ ఉంది. ఇది తప్పితే ఆమె గురించి పెద్దగా విషయాలేం తెలియవు.

(ఇదీ చదవండి: ప్రేమలో పడిన తెలుగు బిగ్‌బాస్ బ్యూటీ.. ప్రియుడితో కలిసి ఏకంగా)

ప్రస్తుతం సరికొత్త 'కార్తీకదీపం' సీరియల్ చేస్తున్న ప్రేమి విశ్వనాథ్.. రీసెంట్‌గా ఓ కుర్రాడితో కలిసి ఇన్ స్టాలో రీల్ చేసింది. ఈ వీడియోని సదరు కుర్రాడే సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 'మామ్ అండ్ సన్' (తల్లి-కొడుకు) అనే క్యాప్షన్ పెట్టాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాకవుతున్నారు. ఎందుకంటే వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్‌కి పెళ్లయి పిల్లలున్నారని తెలుసు గానీ మరీ ఇంత పెద్ద కొడుకు ఉన్నాడని మాత్రం ఊహించలేకపోయారు.

కేరళకు చెందిన ప్రేమి విశ్వనాథ్.. వినీత్ భట్ అనే ఆస్ట్రాలజర్‌ని చాలా ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకుంది. వీళ్లకు పుట్టిన అబ్బాయి పేరు మనుజిత్. తాజాగా తల్లితో కలిసి చేసిన ఓ రీల్ షేర్ చేయగా.. అందరూ అవాక్కవుతున్నారు. ఎందుకంటే ఆరడుగుల పొడుగు సిక్స్ ప్యాక్ బ్యాడీతో చూడటానికి హీరోలా ఉన్నాడు. దీంతో బ్రదర్ అండ్ సిస్టర్ లా ఉన్నారు. సంతూర్ మమ్మీ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)

Advertisement
 
Advertisement
Advertisement