ప్రేమలో పడిన తెలుగు బిగ్‌బాస్ బ్యూటీ.. ప్రియుడితో కలిసి ఏకంగా | Bigg Boss 6 Inaya Sultana Boyfriend Name And Videos | Sakshi
Sakshi News home page

Inaya Sulthana: రొమాంటిక్ ఫొటోలతో ప్రియుడ్ని పరిచయం చేసిన బ్యూటీ

Jul 9 2024 5:02 PM | Updated on Jul 9 2024 5:19 PM

Bigg Boss 6 Inaya Sultana Boyfriend Name And Videos

బిగ్‌బాస్ షోతో చాలామంది గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికే తెలుగులో ఏడు సీజన్లు పూర్తి కాగా త్వరలో 8వ సీజన్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగానే పలువురు పేర్లు ఇప్పటికే వినిపిస్తున్నాయి. సరే ఇదంతా పక్కనబెడితే తాజాగా బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా ప్రేమలో ఉన్న విషయాన్ని బయటపెట్టింది. ప్రియుడిని కూడా పరిచయం చేసేసింది. ఇంతకీ ఎవరతడు?

రామ్ గోపాల్ వర్మతో ఓ వీడియోలో కనిపించిన ఇనయా అప్పట్లో వైరల్ అయింది. అలా బిగ్ బాస్ 6వ సీజన్‌లో అడుగు పెట్టింది. ఉన్నంతలో పర్వాలేదనిపించే ఫెర్ఫార్మెన్స్ చేసింది. షో అయిపోయిన తర్వాత ఈమెకు పెద్దగా సినిమా ఛాన్సులు రాలేదు. దీంతో హాట్ హాట్ ఫొటో షూట్స్ చేస్తూ ఫాలోవర్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తూ బిజీగా ఉంది.

(ఇదీ చదవండి: 'భారతీయుడు 2' టీమ్‌కి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు.. ఎందుకంటే?)

ప్రస్తుతం గోవాలో ఎంజాయ్ చేస్తున్న ఇనయా.. ఓ వ్యక్తితో కలిసి క్లోజ్‌గా కనిపించింది. తాజాగా అతడితోనే బాత్రూంలో టవల్ కట్టుకుని మరీ సెల్ఫీలకు పోజులిచ్చింది. దీని కింద బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొన్న యాంకర్ శివ కామెంట్ చేయగా.. ఇనయా తన ప్రేమ నిజమేనని క్లారిటీ ఇచ్చేసింది.

ఇనయా బాయ్ ఫ్రెండ్ విషయానికొస్తే ఇతడి పేరు గౌతమ్ కొప్పిశెట్టి. యోగా ట్రైనర్, జిమ్ కోచ్ అని ఇన్ స్టాలోని బయో బట్టి తెలుస్తోంది. గతంలో జిమ్‌లో వీళ్ల ప్రేమ వ్యవహారం మొదలై, రిలేషన్‌షిప్ వరకు వచ్చిందని తెలుస్తోంది. రొమాంటిక్ పోజులు చూస్తుంటే త్వరలో పెళ్లి చేసేసుకుంటారేమో అనిపిస్తోంది.

(ఇదీ చదవండి: ఓటీటీలో హిట్ సినిమా.. ఇకపై తెలుగులోనూ స్ట్రీమింగ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement