'భారతీయుడు 2' టీమ్‌కి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు.. ఎందుకంటే? | CM Revanth Reddy Special Thanks To Bharateeyudu 2 Movie Team | Sakshi
Sakshi News home page

Bharateeyudu 2: సీఎం సూచన.. అమలు చేసిన భారతీయుడు

Published Tue, Jul 9 2024 3:08 PM | Last Updated on Tue, Jul 9 2024 3:50 PM

CM Revanth Reddy Special Thanks To Bharateeyudu 2 Movie Team

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కమల్ హాసన్ 'భారతీయుడు 2' చిత్రబృందానికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ట్వీట్ కూడా వేశారు. అయితే ఓ సినిమా కోసం సీఎం రేవంత్ ఇలా ట్వీట్ ఎందుకు చేశారు? అసలేంటి విషయం?

(ఇదీ చదవండి: నా కామెంట్స్‌ తప్పుగా అర్థం చేసుకున్నారు: హీరో సిద్ధార్థ్)

కొన్నిరోజుల క్రితం సినిమా టికెట్ రేట్ల గురించి ఓ సందర్భంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఇకపై ఎవరికైనా సరే రేటు పెంపు కావాలంటే డ్రగ్స్, సైబర్ క్రైమ్‌పై అవగాహన కల్పిస్తూ ఓ వీడియో చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలోనే 'భారతీయుడు 2' టీమ్ నుంచి కమల్ హాసన్, సిద్ధార్థ్, సముద్రఖని, డైరెక్టర్ శంకర్.. ఓ వీడియో రిలీజ్ చేశారు.

దీనికి రిప్లై ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. 'భారతీయుడు 2 బృందానికి నా ప్రత్యేక అభినందనలు. డ్రగ్స్ రహిత సమాజం కోసం.. ప్రజా ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నానికి మద్ధతుగా.. శ్రీ కమల్ హాసన్, శ్రీ శంకర్, శ్రీ సిద్దార్, శ్రీ సముద్రఖని కలిసి ఈ అవగాహనా వీడియో రూపొందించడం హర్షించదగ్గ విషయం' అని రాసుకొచ్చారు.

భారతీయుడు 2 టీంకు అభినందనలు

(ఇదీ చదవండి: 'ఈ జనరేషన్‌లోనే వరస్ట్‌ హీరో'.. అందుకే 4 జాతీయ అవార్డులు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement