పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఓజీ-2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ చిత్రాన్ని ప్రకటించడంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. దర్శకుడు సుజీత్, సంగీత దర్శకుడు తమన్‌తో చర్చలు, మ్యూజిక్ సిట్టింగ్స్ వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా కథలో ఈసారి ఊహించని మలుపులు ఉండనున్నాయని ఇండస్ట్రీలో ఓ టాక్ వినిపిస్తోంది. జపాన్ నుంచి వచ్చిన విలన్, ఓజీ గురించి వెదుకుతాడట. అనంతరం అతడికి, ఓజాస్ గంభీరాకు మధ్య జరిగే యుద్ధమే పార్ట్-2 కథ అని చాలామంది భావిస్తున్నారు. కానీ అంతకుమించి మరో ఆసక్తికరమైన ట్విస్ట్ కూడా ఉందని సమాచారం.
ఓజీ కథ 1940లలో మొదలై, 1973 ప్రాంతంలో సాగి 1993లో ముగిసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సీక్వెల్‌లో మరోసారి 1940ల కాలాన్ని టచ్ చేస్తూ, ఆ కాలంలో సుభాష్ చంద్రబోస్ ఎలిమెంట్‌ను జోడించినట్టు తెలుస్తోంది. అయితే గంభీరాకు, బోస్‌కు కథలో ప్రత్యక్ష లింక్ లేకపోయినా, దర్శకుడు సుజీత్ మాత్రం ఈ కథలో ఓ చిన్న మేజిక్ చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరచనున్నారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ చిత్రాన్ని పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై ఆయనే నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పవన్ చేస్తున్న దీక్ష ముగిసిన వెంటనే ఈ సినిమా లాంచింగ్ జరగనుందని సమాచారం.


