స్టార్ హీరో కుమారుడితో డేటింగ్ రూమర్స్.. వీడియో వైరల్! | Palak Tiwari leaves rumoured boy friend Ibrahim Ali Khan's House | Sakshi
Sakshi News home page

Palak Tiwari: హీరో కుమారుడితో డేటింగ్ రూమర్స్.. బాలీవుడ్ భామ వీడియో వైరల్!

Published Tue, Jun 11 2024 4:42 PM

Palak Tiwari leaves rumoured boy friend Ibrahim Ali Khan's House

బాలీవుడ్ భామ పాలక్ తివారీ గతేడాది కిసీ కా భాయ్.. కిసీ కా జాన్‌ చిత్రంతో అలరించింది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఈ మూవీలో పూజా హెగ్డే లీడ్‌రోల్‌లో కనిపించింది. నటి శ్వేత తివారీ వారసులరాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.  అయితే గత కొద్ది రోజులుగా ఈ ముద్దుగుమ్మపై డేటింగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి.

బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్‌తో ‍ప్రేమాయణం కొనసాగిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. గత ఏప్రిల్‌లో ఇబ్రహీం, పాలక్ తివారీ గోవా నుంచి తిరిగివస్తూ విమాశ్రయంలో కనిపించారు. అప్పటి డేటింగ్ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో పాలక్ తివారీ తాజాగా ప్రియుడు ఇబ్రహీం అలీ ఖాన్‌ ఇంటివద్ద కనిపించింది. అతని ఇంటి నుంచి కారులో వెళ్తుండగా కెమెరాలకు చిక్కింది.

ఇది చూసిన ఫ్యాన్స్‌ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. పాలక్, ఇబ్రహీం డేటింగ్‌లో ఉన్నారంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు కరణ్ జోహార్ రాబోయే చిత్రం 'సర్జమీన్'చిత్రం ద్వారా ఇబ్రహీం బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ చిత్రంలో కాజోల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రల్లో నటించనున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement