Imanvi: ఆమెని 'ఫౌజీ' నుంచి తీసేయాలని డిమాండ్స్ | Pahalgam Issue Effects Prabhas Fauji Actress Imanvi | Sakshi
Sakshi News home page

పహల్గామ్ ఉగ్రదాడి.. ప్రభాస్ సినిమాపై ఎఫెక్ట్!

Apr 23 2025 8:36 PM | Updated on Apr 23 2025 9:15 PM

Pahalgam Issue Effects Prabhas Fauji Actress Imanvi

పహల్గామ్ ఉగ్రదాడిలో మన దేశ అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. దీని ఎఫెక్ట్ ఇప్పుడు ప్రభాస్ సినిమాపై కూడా పడినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే హీరోయిన్ ఇమాన్వీని ఫౌజీ మూవీ నుంచి తీసేయాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ అసలేం జరుగుతోంది?

ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. 'ఫౌజీ' వర్కింగ్ టైటిల్ తో దీన్ని తెరకెక్కిస్తున్నారు. వచ్చే వేసవిలో రిలీజ్ ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో ఇమాన్వీ అనే కొత్తమ్మాయి హీరోయిన్. పహల్గామ్ దాడి వల్ల ఈమెని మూవీ నుంచి తొలగించాలనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

(ఇదీ చదవండి: ఐపీఎల్ క్రికెటర్ ని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్ 

ఇమాన్వీ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నప్పటికీ.. ఈమె తండ్రి గతంలో పాక్ మిలటరీలో పనిచేశారని, వీళ్లది కరాచీ అని, ఇమాన్వీ పూర్తి పేరు ఇమాన్ ఇక్బాల్ ఇస్మాయిల్ అని అంటున్నారు. ఇమాన్వీలో పాకిస్థాన్ మూలాలు ఉన్నాయని అంటున్నప్పటికీ.. ఈమె ఢిల్లీలోనే పెరిగింది. మరి సోషల్ మీడియాలో వినిపిస్తున్నట్లు ఇమాన్వీది నిజంగా దాయది దేశమా లేదా అనేది క్లారిటీ రావాలి. 

మరోవైపు బాలీవుడ్ లోనూ వాణీ కపూర్ నటించిన 'అబిర్ గులాల్' సినిమాని కూడా నిషేధించాలనే డిమాండ్స్ వినిపించాయి. ఇందులో పాక్ నటుడు ఫవాద్ ఖాన్ హీరోగా నటించడమే కారణం. దీంతో పాక్ నటుల్ని మన దగ్గర ప్రోత్సాహించడం సరికాదని కొందరు అంటున్నారు.

(ఇదీ చదవండి: ‍సినిమా హిట్.. 10 రోజులు తాగుతూనే ఉన్నాం!)  

Advertisement
 
Advertisement
Advertisement