
మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఇది అందరికీ తెలుసు. అయినా సరే తాగుతుంటారు. సామాన్యుల సంగతి పక్కనబెడితే సెలబ్రిటీలు కూడా మద్యం తాగుతుంటారు. కానీ ఇలాంటి విషయాలు బయటకు చెప్పుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ తెలుగు యువ నటుడు మాత్రం తన డ్రింకింగ్ అలవాటు గురించి బయటపెట్టాడు.
(ఇదీ చదవండి: ఐపీఎల్ క్రికెటర్ ని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్)
'మ్యాడ్'(MAD Movie) ఫ్రాంచైజీలో మనోజ్ పాత్రలో ఆకట్టుకున్న నటుడు రామ్ నితిన్(Ram Nithin). లవర్ బాయ్ గా మంచి యాక్టింగ్ చేశాడు. ప్రేక్షకుల్ని అలరించాడు. అయితే తొలి భాగం హిట్ అయిన తర్వాత వరసగా 10 రోజుల పాటు తాను, సంగీత్ కలిసి మందు తాగుతూనే ఉన్నామని రామ్ నితిన్ చెప్పుకొచ్చాడు.
2021లో తాను తొలిసారిగా మందు తాగానని చెప్పిన రామ్ నితిన్.. 'మ్యాడ్' హిట్ అయిన తర్వాత వరసగా 10 రోజుల పాటు తాగానని, మందు ఇంత బాగుంటుందని అప్పుడు అనిపించిందని చెప్పుకొచ్చాడు. అలానే హాఫ్ బాటిల్ వోడ్కా తాగి, సంగీత్ ఇంట్లోని బాత్రూమ్ వాంతు చేసుకున్న సందర్భాన్ని కూడా గుర్తుచేసుకున్నాడు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ఓల్డేజ్ ప్రేమకథ.. తెలుగులోనూ స్ట్రీమింగ్)
రీసెంట్ గా 'మ్యాడ్ స్క్వేర్'(MAD Square Movie) హిట్ అయిన తర్వాత కూడా పార్టీ చేసుకున్నామని రామ్ నితిన్ చెప్పుకొచ్చాడు. ఇకపై సినిమా హిట్ అయితేనే మందు తాగాలని ఫిక్స్ అయినట్లు చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సంగీత్ శోభన్, నార్నె నితిన్, విష్ణు, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ సినిమా 'మ్యాడ్ స్క్వేర్'. మార్చి 28న థియేటర్లలో రిలీజై హిట్ అయింది. దాదాపు నెల తర్వాత అంటే ఏప్రిల్ 25 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
(ఇదీ చదవండి: ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?)
"We drank alcohol for 10 days after the success of MAD," says Ram Nithin. pic.twitter.com/yPBkpkrvfY
— Movies4u Official (@Movies4u_Officl) April 23, 2025