
సాధారణంగా హీరోయిన్లు పలానా హీరో సరసన నటించాలని కోరుకుంటుంటారు. అయితే తాజాగా ఓ స్టార్ హీరోనే తనకు జంటగా పలానా హీరోయిన్ అయితే బాగుంటుందని చెప్పడం విశేషం. ఆ హీరో ఎవరో కాదు శివకార్తికేయన్ (Sivakarthikeyan). వరుస విజయాలతో స్టార్ హీరోగా రాణిస్తున్న ఈయన ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో యాక్ట్ చేస్తున్న మదరాశి చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది.
సినిమాలు
సుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న పరాశక్తి షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటోంది. రవి మోహన్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఇందులో అధర్వ మురళి ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా తర్వాత శివకార్తికేయన్ వెంకట్‌ప్రభు దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. ఈ మూవీ షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభమవుతుందని తెలుస్తోంది.

గతంలో మిస్..
ఇది టైమ్ ట్రావెలింగ్‌తో కూడిన సైన్స్ ఫిక్షన్ జానర్‌లో సాగే కథా చిత్రమని భోగట్టా! ఈ చిత్రంలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) నటిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని శివకార్తికేయన్ వ్యక్తం చేశాడట! దీంతో ఆమెను ఒప్పించే దిశగా చర్చలు జరుగుతున్నాయంటూ ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈమె ఇంతకుముందే మదరాశి చిత్రంలో శివకార్తికేయన్‌తో జత కట్టాల్సి ఉంది. పలు కారణాల రీత్యా ఆ అవకాశాన్ని మృణాల్ జార విడుచుకుందని ప్రచారం జరిగింది. మరి ఈ సారైనా శివ కార్తికేయన్ సరసన నటిస్తుందో? లేదో? వేచి చూడాలి.
చదవండి: ప్రముఖుల ‘బయోపిక్స్’