
దివంగత నటుడు కృష్ణంరాజు కూతుర్లలో ప్రసీద ఉప్పలపాటి (Sai Praseedha Uppalapati) ఒక్కరే సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటారు. పండగలు, హాలీడే ట్రిప్, ఫ్రెండ్స్‌తో చిట్‌చాట్, ఫ్యామిలీతో కాలక్షేపం, అన్న ప్రభాస్‌తో ఫన్నీ టైమ్.. ఇలా ఏవైనా సరే అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తూ ఉంటుంది. దీంతో ఆమె రక్షా బంధన్ రోజు ప్రభాస్ (Prabhas)కు రాఖీ కట్టిన ఫోటో ఎప్పుడెప్పుడు షేర్ చేస్తుందా? అని అభిమానులు ఆతృతగా ఎదురుచూశారు.
రాఖీ పోస్ట్
తీరా ప్రసీద ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టనే పెట్టింది. తను ఎవరెవరికైతే రాఖీ కట్టిందో వాళ్లందరి ఫోటోలు షేర్ చేసింది. కానీ ప్రభాస్ పిక్ మాత్రం షేర్ చేయలేదు. దీంతో అభిమానులు ప్రభాస్ అన్న ఎక్కడ? తన ఫోటో ఎందుకు వదిలేశావ్? అని నిరాశతో కామెంట్లు పెడుతున్నారు. నిజానికి ప్రసీద.. ప్రభాస్‌కు రాఖీ కట్టింది. అందుకు ఫస్ట్ ఫోటోనే నిదర్శనం.

నిరాశలో ప్రభాస్ అభిమానులు
ప్రభాస్ రాఖీ కట్టించుకున్న చేతి ఫోటోను మాత్రమే అప్‌లోడ్ చేసింది. దానికి ప్రభాస్‌ను కూడా ట్యాగ్ చేసింది. గతంలో ప్రభాస్‌కు రాఖీ కడుతూ దిగిన ఫోటోలు షేర్ చేసే ప్రసీద.. ఈసారి ఇలా డిసప్పాయింట్ చేసిందేంటని అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అతడు ది రాజాసాబ్, ఫౌజీ (వర్కింగ్ టైటిల్), స్పిరిట్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇవే కాకుండా సలార్ 2, కల్కి 2 చిత్రాలు చేయనున్నాడు.