
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి పాన్ ఇండియా మాత్రమే కాదు.. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా గుర్తు పడతారు. పుష్ప తర్వాత బన్నీ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. మనదేశంతో పాటు వరల్డ్ వైడ్గా ఫ్యాన్స్ ఉన్నారు. పుష్ప-2 బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మొదటి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది
ప్రస్తుతం సినిమాలకు కాస్తా గ్యాప్ దొరకడంతో ఫ్యామిలీతో బిజీ అయిపోయారు ఐకాన్ స్టార్. ఇటీవలే ముంబయి ట్రిప్కు వెళ్లారు. తన కుటుంబంతో కలిసి వెళ్లిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.
అయితే ముంబయి ఎయిర్పోర్ట్లో బన్నీకి చేదు అనుభవం ఎదురైంది. విమానాశ్రయం లోపలికి వెళ్తుండగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ముఖానికి మాస్క్, అద్దాలు తీసి ఫేస్ చూపించాలని అడిగారు. పక్కనే ఉన్న వ్యక్తిగత సిబ్బంది అల్లు అర్జున్ అని చెప్పినా కూడా వినలేదు. భద్రతా కారణాల దృష్ట్యా నిబంధనల ప్రకారం మొహం చూపించాల్సిందేనని ఎయిర్పోర్ట్ సిబ్బంది అడిగారు. దీంతో బన్నీ వెంటనే మాస్క్, కళ్లద్దాలు తొలగించి ఫేస్ చూపించి లోపలికి వెళ్లిపోయారు. ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. స్టార్ హీరోలను చూస్తే సెల్ఫీల కోసం జనాలు ఎగబడతారని గుర్తు పట్టకుండా మాస్క్ ధరించి వెళ్లడం సాధారణమే.. అయినప్పటికీ విమానాశ్రయాల్లో రూల్స్ ఎవరికైనా ఒక్కటే కదా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Good & Responsible Gesture From #AlluArjun👏
At the airport security check yesterday, Allu Arjun was requested by an officer for a standard face and ID verification. Without a hint of hesitation, he obliged — removing his face covering, presenting his ID, and cooperating fully… pic.twitter.com/8TvJqGt3Zs— cinee worldd (@Cinee_Worldd) August 10, 2025