ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం | Jr NTR And Family Donated 12 Lakhs To Andhra Pradesh Jaggannapeta Temple, Tweet Goes Viral | Sakshi
Sakshi News home page

Jr NTR Donation: ఎన్టీఆర్ మంచి మనసు.. ఆ ఊరి గుడి కోసం ఏకంగా

Published Wed, May 15 2024 1:09 PM

Ntr Donated 12 Lakhs To Andhra Pradesh Jaggannapeta Temple

జూ.ఎన్టీఆర్ మరోసారి వార్తల్లో నిలిచాడు. మొన్నీమధ్యే ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్‌లో తారక్ ఓటు వేశాడు. అయితే అతడు వేసుకున్న చొక్కా రంగు గురించి సోషల్ మీడియాలో ఓ రేంజ్ డిస్కషన్ నడిచింది. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు మాత్రం ఎన్టీఆర్ తన గొప్ప మనసు చాటుకుని వార్తల్లోకెక్కాడు. ఇప్పుడు ఈ విషయం వైరల్ అవుతోంది. ఇంతకీ తారక్ చేసిందేంటి?

(ఇదీ చదవండి: నో రెమ్యునరేషన్.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ప్రభాస్?)

చిన్న సాయం చేసినా సరే గొప్పగా చెప్పుకునే రోజులివి. అలాంటిది ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని జగ్నన్నపేట ఊరిలో వీరభద్ర స్వామి ఆలయానికి ఎన్టీఆర్ కుటుంబం రూ.12.5 లక్షలు విరాళం ఇచ్చింది. కానీ ఈ విషయం పెద్దగా బయటకు రాలేదు. తాజాగా కొందరు నెటిజన్లు శిలా ఫలకానికి సంబంధించిన ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తారక్ ఉదారత నలుగురికి తెలిసింది.

ఇక సినిమాల విషయానికొస్తే.. 'ఆర్ఆర్ఆర్' తర్వాత 'దేవర' చేస్తున్నాడు. అక్టోబరులో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. ఈ నెల 20న తారక్ బర్త్ డే సందర్భంగా తొలి లిరికల్ సాంగ్ రాబోతుందని సమాచారం. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్.

(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'దసరా' నటుడి హిట్ సినిమా)

Advertisement
 
Advertisement