సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'దసరా' నటుడి హిట్ సినిమా | Sakshi
Sakshi News home page

Blink OTT: టైమ్ ట్రావెల్ థ్రిల్లర్ మూవీ.. ఆ ఓటీటీలో స్ట్రీమింగ్

Published Wed, May 15 2024 9:05 AM

Deekshit Shetty Blink Movie Ott Streaming Now

మరో క్రేజీ హిట్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. 'దసరా' ఫేమ్ దీక్షిత్ శెట్టి నటించిన ఈ కన్నడ మూవీని సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్‌తో తీశారు. ఎలాంటి అంచనాల్లేకుండా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. హీరోగా చేసిన దీక్షిత్ తెలుగులోనూ పలు సినిమాలు చేయడంతో తెలుగు ప్రేక్షకుల దృష్టి దీనిపై పడింది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనేది ఇప్పుడు చూద్దాం.

(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్‌కి అరుదైన వ్యాధి.. ఆస్పత్రిలో బెడ్‌పై అలా)

'దసరా'లో నాని ఫ్రెండ్‌గా చేసిన కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి.. 'దియా' మూవీతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు తెలుగు ఇటు కన్నడ సినిమాల్లో చేస్తున్నాడు. ఇతడు హీరోగా చేసిన 'బ్లింక్' అనే మ్యూజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ.. ఈ ఏడాది మార్చి 8న థియేటర్లలోకి వచ్చింది. తొలుత 50 కంటే తక్కువ థియేటర్లలో రిలీజ్ చేశారు. టాక్ బాగుండటంతో ఆ నంబర్ పెరిగింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో కన్నడలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో తెలుగు, తమిళ భాషల్లోనూ అందుబాటులోకి రావొచ్చని తెలుస్తోంది.

ఇక 'బ్లింక్' కథ విషయానికొస్తే.. పీజీలో ఫెయిల్ అయిన కుర్రాడు అపూర్వ(దీక్షిత్ శెట్టి). తల్లి దగ్గర ఈ విషయం దాచి, పార్ట్ టైమ్ జాబ్ చేస్తుంటాడు. స్వప్న(మందాత)తో ప్రేమలో ఉంటాడు. మంచి జాబ్ చేసి సెటిల్ కావాలనుకుంటాడు. అలాంటిది తండ్రి గురించి తెలిసిన ఓ సీక్రెట్ ఇతడి జీవితాన్ని తలకిందులు చేస్తుంది. కనురెప్పల్ని మూస్తే టైమ్ ట్రావెల్‌లో ముందుకు వెనక్కి వెళ్తుంటాడు? అసలు ఇలా జరగడానికి కారణమేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్)

Advertisement
 
Advertisement