ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్ | Upcoming OTT Release Movies Telugu May 3rd Week 2024 | Sakshi
Sakshi News home page

This Week OTT Movies: ఓటీటీల్లో 22 మూవీస్ రిలీజ్.. అవేంటంటే?

May 13 2024 10:57 AM | Updated on May 13 2024 12:19 PM

Upcoming OTT Release Movies Telugu May 3rd Week 2024

ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. అయితే ఓటింగ్ ఎఫెక్ట్ వల్లనో ఏమో గానీ గత కొన్ని వారాల నుంచి థియేటర్లలో చెప్పుకోదగ్గ మూవీస్ రిలీజ్ కాలేదు. ఈ వారం కూడా లెక్కప్రకారం విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' రిలీజ్ కావాలి. కానీ మే 31కి వాయిదా పడింది. దీంతో 'రాజు యాదవ్' అనే చిన్న మూవీ మాత్రమే రిలీజ్ అవుతోంది. 'అపరిచితుడు' సినిమా రీ రిలీజ్ అవుతోంది. ఇవి తప్పితే థియేటర్లు కళకళలాడే మూవీస్ అయితే ఏం లేవు. ఓటీటీలో మాత్రం 20కి పైగా సినిమాలు-వెబ్ సిరీసులు రాబోతున్నాయి.

(ఇదీ చదవండి: యాంకర్ శ్రీముఖికి త్వరలో పెళ్లి? రివీల్ చేసిన 'జబర్దస్త్' కమెడియన్)

ఓటీటీల్లోకి వస్తున్న వాటిలో 22కి పైగా సినిమాలు- వెబ్ సిరీసులు ఉన్నాయి. అయితే వీటిలో చోరుడు, గ్లాడ్జిల్లా X కాంగ్ అనే డబ్బింగ్ సినిమాలతో పాటు జర హట్కే జర బచ్కే, బస్తర్ అనే హిందీ సినిమాలు మాత్రమే ఉన్నంతలో కాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. మిగతా వాటి టాక్ రిలీజైతే గానీ తెలియదు. మరి ఓవరాల్‌గా ఏయే మూవీస్ ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్నాయనేది ఇప్పుడు చూద్దాం.

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ లిస్టు (మే 13 నుంచి 19 వరకు)

నెట్‌ఫ్లిక్స్

  • ఆష్లే మ్యాడిసన్: సెక్స్, లైస్ & స్కాండల్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 15
  • బ్లడ్ ఆఫ్ జ్యూష్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మే 15
  • బ్రిడ్జర్టన్ సీజన్ 3 పార్ట్ 1 (ఇంగ్లీష్ సిరీస్) - మే 16
  • మేడమ్ వెబ్ (ఇంగ్లీష్ సినిమా) - మే 16
  • పవర్ (ఇంగ్లీష్ మూవీ) - మే 17
  • ద 8 షో (కొరియన్ సిరీస్) - మే 17
  • థెల్మా ద యూనికార్న్ (ఇంగ్లీష్ సినిమా) - మే 17    

అమెజాన్ ప్రైమ్

  • ఔటర్ రేంజ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మే 16
  • 99 (ఇంగ్లీష్ సిరీస్) - మే 17

హాట్‌స్టార్

  • క్రాష్ (కొరియన్ సిరీస్) - మే 13
  • చోరుడు (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 14
  • అంకుల్ సంషిక్ (కొరియన్ సిరీస్) - మే 15
  • బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ (హిందీ యానిమేటెడ్ సిరీస్) - మే 17

 

జీ5

  • బస్తర్: ద నక్సల్ స్టోరీ (హిందీ మూవీ) - మే  17
  • తళమై సెయలగమ్ (తమిళ సిరీస్) - మే 17

జియో సినిమా

  • డిమోన్ స్లేయర్ (జపనీస్ సిరీస్) - మే 13
  • C.H.U.E.C.O సీజన్ 2 (స్పానిష్ సిరీస్) - మే 14
  • జర హట్కే జర బచ్కే (హిందీ సినిమా)  - మే 17

 

బుక్ మై షో

  • గాడ్జిల్లా X కాంగ్: ద న్యూ ఎంపైర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 13 (ఆల్రెడీ స్ట్రీమింగ్)

 

సోనీ లివ్

  • లంపన్ (మరాఠీ సిరీస్) - మే 16

ఆపిల్ ప్లస్ టీవీ

  • ద బిగ్ సిగార్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 17

ఎమ్ఎక్స్ ప్లేయర్

  • ఎల్లా (హిందీ సినిమా) - మే 17

(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ హిట్ సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement