టాలీవుడ్ హీరోయిన్‌కి అరుదైన వ్యాధి.. ఆస్పత్రిలో బెడ్‌పై అలా | Sakshi
Sakshi News home page

Shamita Shetty: హీరోయిన్‌కి తీవ్రమైన నొప్పి.. బాధ భరించలేకపోతున్నానని వీడియో

Published Wed, May 15 2024 8:03 AM

Shamita Shetty Hospital Video And Disease Details

తెలుగు సినిమాలో హీరోయిన్‌గా‌ చేసిన ఓ బ్యూటీ.. అరుదైన వ్యాధి బారిన పడింది. హాస్పిటల్ బెడ్‌పై ఉన్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. బాధ భరించలేకపోతున్నానని అని చెబుతూ అసలు తనకు ఏమైంది? ఈ వ్యాధి సంగతేంటి? అనే విషయాల్ని చెప్పుకొచ్చింది. అలానే మహిళలకు ఇలాంటివి సాధారణంగా వస్తుంటాయని కూడా చెప్పింది. ఇంతకీ ఎవరా హీరోయిన్? అసలేమైంది?

(ఇదీ చదవండి: హీరోతో వివాదం.. ఫేస్ బుక్ లో సినిమా పెట్టేసిన డైరెక్టర్‌!)

హీరోయిన్ శిల్పా శెట్టి చెల్లి షమితా శెట్టి తెలుగులోనూ 'పిలిస్తే పలుకుతా' అనే సినిమాలో హీరోయిన్‌గా చేసింది. ఆ తర్వాత పూర్తిగా హిందీకే పరిమితమైంది. కాకపోతే అక్కలా పెద్దగా పేరు అయితే తెచ్చుకోలేకపోయింది. అలాంటిది ఇ‍ప్పుడు ఎండోమెట్రియోసిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డట్లు బయటపెట్టింది. దీని గురించి హాస్పిటల్ బెడ్‌పై ఉంటూనే వివరంగా చెప్పుకొచ్చింది.

'మహిళలకు వచ్చే సమస్యలో ఇది సర్వ సాధారణమైనది. గర్భాశయంలో చాలా నొప్పిగా అనిపిస్తుంది. అలాంటిదే నాకు ఇప్పుడు వచ్చింది. దాదాపు 40 శాతం మంది మహిళలు ఎండోమెట్రియోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. కాకపోతే మనలో చాలామందికి దీని గురించి తెలియదు. గత కొన్నాళ్ల నుంచి నేను దీని వల్ల నొప్పితో ఇబ్బంది పడ్డాను. కానీ డాక్టర్లు ఈ సమస్యకు మూలం ఏంటో గుర్తించారు. గర్భాశయంలో వచ్చిన ఈ సమస్యకు సర్జరీ ద్వారా పరిష్కారం దొరికింది' అని షమితా శెట్టి చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: నేనెవర్నీ విడగొట్టలేదు.. ఆ హీరోయిన్‌కు, నా భర్తకు ఆల్‌రెడీ బ్రేకప్‌!)

Advertisement
 
Advertisement