నేనెవర్నీ విడగొట్టలేదు.. ఆ హీరోయిన్‌కు, నా భర్తకు ఆల్‌రెడీ బ్రేకప్‌! | Suchitra Pillai Says She Did Not Steal Preity Zinta Boyfriend | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌ ప్రీతిజింటాతో నా భర్త డేటింగ్‌ చేశాడు.. నేనేమో..!

Published Tue, May 14 2024 6:17 PM | Last Updated on Tue, May 14 2024 8:18 PM

Suchitra Pillai Says She Did Not Steal Preity Zinta Boyfriend

ఎంత త్వరగా పెళ్లి చేసుకున్నామో అంతే త్వరగా విడిపోయాం. ఏడాది తిరిగేసరికి మా మధ్య గ్యాప్‌ వచ్చింది. పైకి మాత్రం బాగున్నట్లు కనిపించాం. పెళ్లయిన ఏడేళ్లకు విడాకులు తీసుకున్నాం.

దిల్‌ చాహ్త హై సినిమాలో హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ గర్ల్‌ఫ్రెండ్‌గా నటించి క్లిక్కయింది నటి సుచిత్ర పిళ్లై. హిందీలో పలు సినిమాలు చేసిన ఈమె మొదట హాలీవుడ్‌ చిత్రాల్లో మెరిసింది. ఈమె గతంలో పవన్‌ మాలిక్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది. తర్వాత లార్స్‌ జెల్డ్‌సెన్‌ను రెండో పెళ్లి చేసుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లిళ్ల గురించి ప్రస్తావించింది.

ప్రేమించిన మూడు రోజులకే
'ఓ పెళ్లిలో పవన్‌ మాలిక్‌ను కలిశాను. అక్కడే ఇద్దరం ప్రేమించుకున్నాం.. మూడు రోజుల్లోనే ఇంటికి వచ్చి అందరికీ తన గురించి చెప్పి ఒప్పించాడు. అలా ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. 20 ఏళ్ల వయసులోనే వైవాహిక బంధంలో అడుగుపెట్టాను. తనతో కలిసి లండన్‌లోనే ఉండేదాన్ని. ఎంత త్వరగా పెళ్లి చేసుకున్నామో అంతే త్వరగా విడిపోయాం. ఏడాది తిరిగేసరికి మా మధ్య గ్యాప్‌ వచ్చింది. పైకి మాత్రం బాగున్నట్లు కనిపించాం. పెళ్లయిన ఏడేళ్లకు విడాకులు తీసుకున్నాం.

వేరేవాళ్ల ప్రియుడిని ఎత్తుకుపోతానా?
నేను ఇంగ్లాండ్‌ నుంచి వచ్చాక ఆండ్రూ కోయిన్‌ను ప్రేమించాను. అతడికి అప్పటికే మోడల్‌ అచ్ల సచ్‌దేవ్‌తో బ్రేకప్‌ జరిగింది. దానికి నన్ను బాధ్యురాలిని చేశారు. వారి బ్రేకప్‌కు, నాకు సంబంధమే లేదు. అలాగే 2005లో లార్స్‌ జెల్డ్‌సెన్‌తో నా రెండో పెళ్లి జరిగింది. అప్పుడు నాపై బాయ్‌ఫ్రెండ్‌ స్నాచర్‌ అని ట్యాగ్‌ వేశారు. 

ఎవరినీ విడగొట్టలేదు
లార్స్‌ నాకు పరిచయమయ్యే సమయానికే అతడు, హీరోయిన్‌ ప్రీతిజింటా ప్రేమించుకున్నారు, బ్రేకప్‌ కూడా చెప్పుకున్నారు. నేను వారిద్దరి మధ్యలోకి వెళ్లలేదు. అప్పటికే వాళ్లు ఏదో కారణంతో విడిపోయారు. ఆ తర్వాతే నాకు అతడు పరిచయమయ్యాడు, ప్రేమించుకున్నాం. అంతేకానీ నేనెవరినీ విడగొట్టలేదు' అని చెప్పుకొచ్చింది.

చదవండి: ఒక్కరోజు కాంప్రమైజ్‌ అయితే స్టార్‌ హీరో మూవీలో ఛాన్స్‌.. ఫస్ట్‌లో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement