NBK 112: బాలయ్య-కొరటాల సినిమా షురూ | NBK 112: Koratala Siva, Nandamuri Balakrishna Movie Pooja Ceremony Highlights | Sakshi
Sakshi News home page

NBK 112: బాలయ్య-కొరటాల సినిమా షురూ

Jun 25 2026 10:58 AM | Updated on Jun 25 2026 11:10 AM

NBK 112: Koratala Siva, Nandamuri Balakrishna Movie Pooja Ceremony Highlights

కొరటాల శివ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘NBK 112’ వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కబోతున్న ఈ చిత్రం పూజా కార్యక్రమం అమరావతిలో ఘనంగా జరిగింది. బాలకృష్ణ అల్లుడు, ఏపీ మంత్రి నారా లోకేష్‌ ముఖ్యఅతిథిగా హాజరరై క్లాప్‌ కొట్టగా.. బాలయ్య చిన్న కూతురు తేజస్వీని కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు. 

బాలయ్య ఓ డైలాగ్‌ చెప్పి అలరించాడు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేశ్‌, నిర్మాత సురేశ్‌ బాబుతోపాటు మరికొందరు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఆగస్ట్‌ నుంచి ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లు మేకర్స్‌ తెలిపారు. 2027లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement