
రీసెంట్‌గా జాతీయ సినిమా అవార్డులు ప్రకటించారు. ఇందులో భాగంగా టాలీవుడ్‌కి పలు విభాగాల్లో పురస్కారాలు దక్కాయి. 'బేబి' సినిమాలో 'ప్రేమిస్తున్నా..' అనే పాట పాడిన పీవీఎస్ఎన్ రోహిత్ అనే తెలుగు కుర్రాడు.. ఉత్తమ సింగర్‌గా నిలిచాడు. ఇది జరిగి ఎన్నిరోజులు కాలేదు ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పాడు. తాను నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించి, ఆ వేడుకకు సంబంధించిన ఫొటోని పోస్ట్ చేశాడు.
(ఇదీ చదవండి: 'సు ఫ్రమ్ సో' రివ్యూ.. కన్నడలో బ్లాక్‌బస్టర్ మరి తెలుగులో?)
రోహిత్.. చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాడు. చాలా పాటలు పాడాడు. 'బేబి' సినిమాతో నేషనల్ అవార్డ్ సొంతం చేసుకున్నాడు. అంతకు ముందు జైలర్, హనుమాన్, ప్రేమలు, కొండపొలం, సరిపోదా శనివారం, నేల టికెట్ తదితర చిత్రాల్లోనూ తనదైన గొంతుతో పాటలు పాడి సంగీత ప్రియుల్ని అలరించాడు. ఇప్పుడు కొత్త జీవితం ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు.
చాన్నాళ్లుగా ప్రేమిస్తున్న డాక్టర్ శ్రేయ అనే అమ్మాయితో రోహిత్ నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ శుభకార్యం సింపుల్‌గా కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. ఈ క్రమంలోనే ఇన్ స్టాలో పోస్ట్ పెట్టగా.. తోటి సింగర్స్, నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. త్వరలో పెళ్లి విషయం గురించి కూడా రోహిత్ చెబుతాడేమో చూడాలి?
(ఇదీ చదవండి: విలన్‌గా ప్రముఖ హీరోయిన్.. 'జటాధర' టీజర్ రిలీజ్)
