వెంకీ ఆదర్శకుటుంబం.. రిలీజ్‌ డేట్‌ లీక్..! | Music Director SS Thaman Leaked Aadarsha Kutumbam Release date | Sakshi
Sakshi News home page

Aadarsha Kutumbam Release date: వెంకీ ఆదర్శకుటుంబం.. రిలీజ్‌ డేట్‌ లీక్..!

Oct 7 2026 3:44 PM | Updated on Oct 7 2026 4:18 PM

Music Director SS Thaman Leaked Aadarsha Kutumbam Release date

వెంకటేశ్- త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న లేటేస్ట్ మూవీ ఆదర్శకుటుంబం. ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ వాయిదా పడింది. మొదట అక్టోబర్ 2న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత 9న విడుదల చేస్తామని పోస్ట్‌పోన్ చేశారు. ఏమైందో తెలియదు కానీ మరోసారి ఏకే47 వాయిదా పడింది. దీంతో రిలీజ్ తేదీపై అభిమానుల్లో సస్పెన్స్ నెలకొంది.

తాజాగ ఈ మూవీ రిలీజ్‌ డేట్‌పై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. అక్టోబర్‌ 30న ఈ సినిమా విడుదల కానున్నట్లు క్యాప్షన్‌ పెట్టారు. తర్వాత వెంటనే ఆ పోస్టును ఎడిట్‌ చేసి.. రిలీజ్ డేట్ స్థానంలో ఓ ఎమోజీని అడ్డుగా పెట్టారు. అప్పటికే ఈ పోస్ట్ వైరలైంది. దీంతో ఆదర్శ కుటుంబం ఈ నెల 30న థియేటర్లలో విడుదల కానుందని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే మూవీని వాయిదా వేసినట్లు ప్రకటించిన నిర్మాత నాగవంశీ.. విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement