విశ్వంభరకు దారేది?.. అదొక్కటే కనిపిస్తోంది..! | Megastar Chiranjeevi's Vishwambhara Movie New Release Date Options | Sakshi
Sakshi News home page

Vishwambhara Movie: విశ్వంభరకు దారేది?.. అదొక్కటే కనిపిస్తోంది..!

Jun 16 2026 11:01 AM | Updated on Jun 16 2026 1:09 PM

Megastar Chiranjeevi's Vishwambhara Movie New Release Date Options

మెగా అభిమానలు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తోన్న చిత్రం విశ్వంభర.  సోషియో-ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమా ఇప్పటి వరకు రిలీజ్‌కు నోచుకోలేదు. వరుస వాయిదాలతో టాలీవుడ్ ఫ్యాన్స్‌ నిరాశకు గురవుతున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ కోసం మెగా ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు రిలీజ్‌ తేదీపై ఎలాంటి అప్‌డేట్ రాలేదు. ఇప్పటికే ఈ సినిమా జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రచారంలో ఉన్నా.. అదేం జరిగేలా కనిపించడం లేదు.

ఆ తర్వాత ఆగస్ట్‌లో విశ్వంభర రిలీజ్ కావొచ్చని ప్రచారం జరిగింది. దీనిపై ఇప్పటి దాకా మేకర్స్ ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. దీంతో మెగా ఫ్యాన్స్‌ ఈ సినిమాను మరిచిపోయే పరిస్థితి వచ్చింది. అసలు ఈ ఏడాది విశ్వంభర వచ్చే అవకాశముందా అనే డైలామాలో అభిమానులు ఉన్నారు. జూలై, ఆగస్ట్ నెలల్లో రాకపోతే.. విశ్వంభరకు ఉన్న ఛాన్స్ దసరా. ఆ తర్వాత డిసెంబర్‌, సంక్రాంతి బరిలో ఎన్నో సినిమాలు రిలీజ్ కావాల్సింది. ఆ రెండు నెలల్లో బాక్సాఫీస్ వద్ద విపరీతమైన పోటీ ఉంటుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను ఎలాగైనా దసరా కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అందువల్లే విశ్వంభరకు దసరా మాత్రమే కలిసొచ్చేలా కనిపిస్తోంది. ఇక దసరా మిస్సయిందంటే డిసెంబర్‌లో ఏదో ఒక వారంలో రిలీజ్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇకనైనా మేకర్స్ పక్కా ప్లాన్‌తో ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది. అప్‌డేట్స్ ఇస్తూ మెగాస్టార్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాల్సిన అవసరముంది. కాగా.. ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహించారు. ఈ మూవీ షూటింగ్ గతేడాదే పూర్తయింది. భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మించారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా కనిపించనుంది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement