కలిసి మాట్లాడుకుందాం.. నేను ఒంటరిగానే వస్తా: మనోజ్‌ | Manchu Manoj Again Compromise Comments On Vishnu Manchu | Sakshi
Sakshi News home page

కలిసి మాట్లాడుకుందాం.. నేను ఒంటరిగానే వస్తా: మనోజ్‌

Jan 18 2025 12:30 PM | Updated on Jan 18 2025 1:29 PM

Manchu Manoj Again Compromise Comments On Vishnu Manchu

మంచు మనోజ్ (Manchu Manoj) తాజాగా మరోసారి తన ఎక్స్‌ పేజీలో ఒక పోస్ట్‌ చేశారు. కూర్చొని మాట్లాడుకుంటే సమస్య క్లియర్‌ అవుతుందని ఆయన తెలిపారు. ఈ క్రమంలో ఒక సినిమా ఫోటోతో ఈ క్యాప్షన్‌ ఇచ్చారు. అయితే, చర్చలు ఎవరితో అనే విషయం ఆయన క్లారిటీగా చెప్పలేదు. కానీ, మంచు విష్ణు(Vishnu Manchu) కోసమే మనోజ్‌ ఇలా రియాక్ట్‌ అయ్యాడు అంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు.

సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మనోజ్‌ తాజాగా  ఇలా పోస్ట్‌ చేశారు.' మనం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. కానీ, అందులో నాన్న, ఇంట్లోని మహిళలు, ఉద్యోగులు, పనివాళ్లు ఎవరూ వద్దు. వాళ్లందరినీ పక్కనపెట్టి మనిద్దరం మాత్రమే చర్చించుకుందాం. ఏం అంటావు..? చర్చల కోసం అంగీకరిస్తే.. నేను ఒంటరిగానే వస్తాను. నాతో పాటు ఎవరూ రారు. అయితే, నీకు నచ్చిన వాళ్లను ఎవరినైనా నువ్వు తీసుకురావచ్చు. అందుకు నేను అంగీకరిస్తున్నాను.  మనం హుందాగా ఒక డిబేట్‌ పెట్టుకుందాం.' అంటూ నీ #కరెంట్‌తీగ అని ఒక క్యాప్షన్‌ ఇచ్చారు. తాజాగా మనోజ్‌ చేసిన ఈ ట్వీట్‌  ప్రస్తుతం ఇది సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. తన అన్న విష్ణు కోసమే మనోజ్‌  ఈ పోస్ట్‌ పెట్టారని నెట్టింట వైరల్‌ అవుతుంది.

కొద్ది రోజులుగా  మంచు మోహన్‌బాబు కుటుంబంలో జరుగుతు­న్న గొడవలు తార స్థాయికి చేరుకున్నాయి. మోహన్‌ బాబు కుమారుడు మంచు మనోజ్‌ శ్రీవిద్యానికేతన్‌లోకి వెళ్తుండగా అక్కడి సిబ్బంది, పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ క్రమంలో  మనోజ్‌, తన భార్య భూమా మౌనిక రెడ్డిపై కేసు నమోదు అయింది. ఆపై మనోజ్‌ ఫిర్యాదుతో ఎంబీయూ సిబ్బంది, బౌన్సర్లపై కేసు నమోదైంది.

ఈ వివాదం తర్వాత మంచు విష్ణు, మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా వార్ మొదలైంది. మొదట మంచు విష్ణు ట్వీట్‌ తన రౌడీ సినిమాలో డైలాగ్‌ను షేర్ చేస్తూ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. 'సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది. కానీ వీధిలో మొరగటానికి.. అడవిలో గర్జించటానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావన్న ఆశ' అనే డైలాగ్‌ను పోస్ట్ చేశారు.

అయితే దీనికి అదే స్టైల్లో మంచు మనోజ్ కౌంటరిచ్చారు. కన్నప్ప సినిమాలో కృష్ణం రాజులా అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది.. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావ్' అంటూ కృష్ణం రాజు సినిమాల పోస్టర్లను పంచుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో అన్నదమ్ముల వార్‌ మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది.  అయితే ఇన్‌డైరెక్ట్‌గా మంచు విష్ణు తెరకెక్కిస్తోన్న కన్నప్ప మూవీని మంచు మనోజ్ టార్గెట్‌ చేసినట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement