తిరుపతిలో కాలేజీ కడతా.. 25 శాతం డిస్కౌంట్ ఇస్తా! | Manchu Manoj VaddiKaasulaVaada Movie Glimpse | Sakshi
Sakshi News home page

Manchu Manoj: అచ్చొచ్చిన జానర్‌లోకి మంచు మనోజ్.. మూవీ ప్రకటన

May 20 2026 4:26 PM | Updated on May 20 2026 4:34 PM

Manchu Manoj VaddiKaasulaVaada Movie Glimpse

ఈరోజు ఎన్టీఆర్‌తో పాటు మంచు మనోజ్ పుట్టినరోజు కూడా. ఈ క్రమంలోనే మనోజ్ చేయబోయే కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటన వచ్చేసింది. బాలకృష్ణ-గోపీచంద్ మలినేని మూవీలో కీలక పాత్ర చేయబోతున్నట్లు వెల్లడించారు. అలానే 'వడ్డీకాసులవాడ' పేరితో మనోజ్ హీరోగా మరో చిత్రాన్ని ప్రకటించారు. రెండు నిమిషాలున్న వీడియోతో మూవీ ఎలా ఉండబోతుందో చెప్పే ప్రయత్నం చేశారు.

(ఇదీ చదవండి: గ్రేట్ డైరెక్టర్ ఓటీటీ ఎంట్రీ.. ఏటీఎం దొంగతనం స్టోరీతో)

నటుడిగా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత 'భైరవం', 'మిరాయ్' సినిమాల్లో విలన్ పాత్రలతో ఆకట్టుకున్న మంచు మనోజ్.. కామెడీ జానర్‌లో గతంలో మూవీస్ చేశాడు. హిట్స్ కూడా అందుకున్నాడు. ప్రస్తుతం డేవిడ్ రెడ్డి, బాలయ్య మూవీలోనూ నెగిటివ్ టచ్ ఉన్న రోల్స్ చేయబోతున్నాడు. కానీ 'వడ్డీకాసులవాడ' సినిమాలో మాత్రం ఈఎంఐలు, వడ్డీలు కట్టలేక ఇబ్బందిపడే మధ్యతరగతి వ్యక్తిగా కనిపించబోతున్నాడని అనౌన్స్‌మెంట్ వీడియోలో చూపించారు. పూర్తిగా ఫన్ జానర్‌లోనే ఈ సినిమా ఉండబోతుంది.

ఏఐ ఉపయోగించి ఈ వీడియోని రూపొందించారు. అయితే ఇందులో మనోజ్ పాత్ర చెప్పే.. అప్పులన్నీ తీర్చేసి కోటీశ్వరుడిని చేస్తే తిరుపతిలో కాలేజీ కట్టిస్తా, అందరికీ 25 పర్సంటేజీ డిస్కౌంట్ ఇస్తా లాంటి డైలాగ్స్ మంచు ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యేలా అనిపించాయి. తేజ్ ఉప్పాలపాటి దర్శకుడు కాగా మనోజ్, అనిల్ సుంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

(ఇదీ చదవండి: రాజకీయాల్లోకి నా భార్య.. మంచు మనోజ్ స్టేట్‌మెంట్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement