మంచు మనోజ్‌కి మరో కీలక పాత్ర.. ఆ సీనియర్‌ హీరోతో ఢీ | Another Key Role for Manchu Manoj | Sakshi
Sakshi News home page

మంచు మనోజ్‌కి మరో కీలక పాత్ర.. ఆ సీనియర్‌ హీరోతో ఢీ

May 20 2026 11:46 PM | Updated on May 21 2026 1:00 PM

Another Key Role for Manchu Manoj

రాకింగ్‌ స్టార్‌ మంచు మనోజ్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్ పాత్రలతో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాడు.  తాజాగా మరో భారీ చిత్రంలో నటించబోతున్నాడు. నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న కొత్త సినిమాలో ఆయనను ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేశారు.  

ఇప్పటికే భైరవం, మిరాయి వంటి చిత్రాల్లో విలన్‌గా కనిపించి మెప్పించిన మనోజ్, ఈసారి బాలయ్యతో కలిసి తెరపై మెరిసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి ఊ కొడతారా ఉలిక్కిపడతారా సినిమాలో నటించారు.ఈ చిత్రంలో విలన్ పాత్రలో మనోజ్ కనిపించనున్నాడని సమాచారం. దర్శకుడు గోపీచంద్ మలినేని సోషల్ మీడియాలో అధికారికంగా మనోజ్ ఎంట్రీని ప్రకటిస్తూ..'మీ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది'అని పేర్కొన్నారు. ఇది ఆయనకు మనోజ్‌తో మొదటి కాంబినేషన్. గోపీచంద్ గతంలో బాలకృష్ణతో వీరసింహారెడ్డి సినిమాను తెరకెక్కించారు. ఇక ఎప్పట్లానే ఈ సినిమాలో కూడా బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నారని సమాచారం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement