మతిస్థిమితం లేని వ్యక్తికి హెయిర్‌ కటింగ్‌ చేసిన హీరో.. వీడియో వైరల్‌ | Manchu Manoj Visits Matrudevobhava Orphanage | Sakshi
Sakshi News home page

మతిస్థిమితం లేని వ్యక్తికి హెయిర్‌ కటింగ్‌ చేసిన హీరో.. వీడియో వైరల్‌

May 26 2026 3:34 PM | Updated on May 26 2026 3:57 PM

Manchu Manoj Visits Matrudevobhava Orphanage

మంచు మనోజ్‌ మరోసారి పెద్ద మనసును చాటుకున్నాడు. నిర్వాహకుల అభ్యర్థన మేరకు  రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్‌లో ‘మాతృదేవోభవ’ అనాథాశ్రమాన్ని సందర్శించి, ఆశ్రమానికి కావాల్సిన టేబుళ్లు, కుర్చీలను విరాళంగా అందజేశారు. అంతేకాదు అ‍క్కడున్నవారందరికీ కొత్త దుస్తులను కూడా పంపిణీ చేశాడు. 

అలాగే ఓ మతిస్థిమితం లేని వ్యక్తికి హెయిర్‌ కటింగ్‌ చేసి తన ప్రత్యేకతను చాటుకున్నాడు మనోజ్‌. సెలెబ్రెటీని అనే ఫీలింగ్‌ లేకుండా సామాన్య వ్యక్తిగా వెళ్లి.. అతనికి కటింగ్‌ చేశాడు. ఈ సందర్భంగా అతని పేరు కూడా అడిగి తెలుసుకున్నాడు. అతనికి పేరు తప్ప ఇంకేమి గుర్తు లేదని నిర్వాహకులు చెప్పడంతో.. ‘పేరు చాలా బాగుంది’ అంటూ కటింగ్‌ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. 

కాగా, మనోజ్‌ ఇప్పటికే ఈ మధ్యే తన సతీమణితో కలసి ఐక్య అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రస్ట్‌ ద్వారా చిన్నారుల దత్తత, రక్తదానంతో పాటు పలు సేవాకార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. సొంత డబ్బుతోనే ఈ కార్యక్రమాలన్నీ చేయబోతున్నట్లు ప్రకటించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement