దారుణ స్థితిలో దాసరి సమాధి.. రంగంలోకి మంచు మనోజ్..! | Tollywood Hero Manchu Manoj Reacts On Dasari Narayana Rao tomb | Sakshi
Sakshi News home page

Manchu Manoj: దర్శక దిగ్గజ వర్ధంతి.. దారుణ స్థితిలో సమాధి.. మంచు మనోజ్ ఎంట్రీ.!

May 30 2026 2:39 PM | Updated on May 30 2026 3:15 PM

Tollywood Hero Manchu Manoj Reacts On Dasari Narayana Rao tomb

టాలీవుడ్ దర్శక దిగ్గజం దాసరి నారాయణ రావు కోసం హీరో మంచు మనోజ్ ముందుకొచ్చారు. ఆయన సమాధి చుట్టు అడవిలా మారిపోవడంతో రంగంలోకి దిగారు. తన టీమ్‌తో కలిసి దాసరి సమాధి వద్ద క్లీనింగ్‌ పనులు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న గీతా ఆర్ట్స్ సంస్థ కూడా తమ టీమ్‌ను పంపింది. దాస‌రి వ‌ర్ధంతి సంద‌ర్భంగా ముళ్ల పొద‌ల‌ను, చెట్ల‌ను తొల‌గించారు. తెలుగు సినిమాకు విశేష సేవలందించిన దిగ్గజ దర్శక, నటుడి సమాధి ఈ స్థితిలో ఉండడంపై సినీ ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవలే ఆయన సమాధి చుట్టూ చెట్లు మొలిచి ఉన్నాయని ఓ నటి వీడియోను షేర్ చేసింది.  ఎన్నో సినిమాలను డైరెక్ట్ చేసి, ఎందరికో లైఫ్ ఇచ్చిన దాసరి నారాయణరావు సమాధి ఈ స్థితిలో ఉండటం బాధించిందని నటి ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో వెంటనే రియాక్ట్ అయిన మంచు మనోజ్ తన టీమ్‌తో కలిసి సమాధి వద్ద క్లీనింగ్ పనులు చేపట్టారు. ఈ సమాధి పునరుద్ధరణ పనుల్లో గీతా ఆర్ట్స్‌ సైతం పాల్గొంది. ఇవాళ దాసరి వర్ధంతి కావడంతో ఆయనకు నివాళులర్పించారు మంచు మనోజ్. 

 

Advertisement
 
Advertisement
Advertisement