‘మనం’ రీరిలీజ్‌.. అనూప్‌ రూబెన్స్‌ మ్యూజికల్ వీడియో వైరల్ | Manam Movie Re-Release: Anup Rubens Music Video Goes Viral | Sakshi
Sakshi News home page

‘మనం’ రీరిలీజ్‌.. అనూప్‌ రూబెన్స్‌ మ్యూజికల్ వీడియో వైరల్

May 23 2024 6:00 PM | Updated on May 23 2024 6:10 PM

Manam Movie Re-Release: Anup Rubens Music Video Goes Viral

అక్కినేని హీరోల సీనీ కెరీర్‌లో ‘మనం’ చాలా ప్రత్యేకమైన మూవీ. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌ కలిసి నటించిన ఈ చిత్రం  2014 మే 23న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కావడంలో అనుప్‌ రూబెన్స్‌ సంగీతం ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమాలోని పాటలు అప్పట్లో సూపర్‌ హిట్‌గా నిలిచాయి. ఎక్కడ చూసిన ‘మనం’ పాటలే వినిపించేవి. ఆ మెలోడీ సాంగ్స్‌ ఇప్పటికీ మార్మోగిపోతూనే ఉంటాయి. 

‘మనం’ విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా మళ్లీ  ఈ సినిమాను రీరిలీజ్‌ చేస్తున్నారు. నేడు(మే 23)సాయంత్రం హైద్రాబాద్‌‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని దేవీ థియేటర్లో మనం  రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘మనం’ మ్యూజికల్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. మనం వచ్చి పదేళ్లు అయిన సందర్భంగా అనూప్ ఈ వీడియోను రిలీజ్‌ చేశాడు.  అనూప్‌ కీ బోర్డు మీద వాయించిన ట్యూన్స్ మళ్లీ ట్రాన్స్ లోకి తీసుకెళ్ళాయి.

అనూప్ ప్రస్తుతం యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా తీస్తోన్న పాన్ ఇండియా మూవీకి, గౌరీ రోనంకి తీస్తోన్న చిత్రానికి, ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోన్న ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నారు. అంతే కాక సుమంత్ హీరోగా సంతోష్ తెరకెక్కిస్తున్న సినిమాకు, సక్సెస్ ఫుల్ కాంబో అయిన ఆది సాయి కుమార్‌తో కృష్ణ ఫ్రమ్ బృందావనం సినిమాకు, విజయ్ కొండ, ఆకాష్ పూరి దర్శకత్వంలో వస్తున్న చిత్రానికు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement