మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మైథలాజికల్ అడ్వెంచరస్ అండ్ టైమ్ ట్రావెల్ మూవీ ‘వారణాసి’. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రకాష్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను వారణాసి అండ్ టీమ్ తెరకెక్కిస్తున్నట్లుగా తెలిసింది. గత ఏడాది నవంబరులో ‘వారణాసి టు ది వరల్డ్’ వీడియోను రిలీజ్ చేసింది యూనిట్.
ఈ వీడియోలో మహేశ్‌బాబు ఎంట్రీ సీన్ గుర్తుండే ఉంటుంది. ఈ సన్నివేశాలకు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్‌లను ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారట. ఈ ఫైట్ ఎపిసోడ్ ‘వారణాసి’కి ఎంతో కీలకమైనదని తెలిసింది. కాగా, ఈ చిత్రం కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వారణాసి సెట్‌ని రూపొందించిన విషయం తెలిసిందే. ఈ సెట్‌లోనే తాజా ఫైట్ షూట్ జరుగుతోందని టాక్. కేఎల్ నారాయణ, ఎస్‌ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది.


