వెయింటిగ్ ఈజ్ ఓవర్.. సర్దార్-2 వచ్చేస్తున్నాడు..! | Kollywood Star Karthi Sardar 2 Movie Release Date announced | Sakshi
Sakshi News home page

Sardar 2 Movie: వెయింటిగ్ ఈజ్ ఓవర్.. సర్దార్-2 వచ్చేస్తున్నాడు..!

Jun 24 2026 3:08 PM | Updated on Jun 24 2026 3:23 PM

Kollywood Star Karthi Sardar 2 Movie Release Date announced

కోలీవుడ్ హీరో కార్తీ నటించిన సీక్వెల్ మూవీ సర్దార్-2. గతంలో వచ్చిన సర్దార్‌కు కొనసాగింపుంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ షూటింగ్ గతేడాది జూన్‌లోనే పూర్తయి ఏడాది కావోస్తోన్న ఇప్పటికీ రిలీజ్‌కు నోచుకోలేదు. ఈ సినిమా రిలీజ్ డేట్‌ కోసం కార్తీ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు వారి నిరీక్షణకు తెరపడింది. ఈ మూవీ విడుదల తేదని మేకర్స్ ఖరారు చేశారు.

ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 10న దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు. దీంతో కార్తీ ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికైనా రిలీజ్‌ డేట్ ఫిక్స్ కావడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పార్ట్-1 సూపర్ హిట్ కావడంతో సర్దార్ 2పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కార్తీకి జంటగా మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్‌ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈ సినిమాలో ఎస్‌జే సూర్య విలన్ పాత్రలో మెప్పించనున్నారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement