స్టార్ కమెడియన్ కూతురు బర్త్‌ డే.. హాజరైన అగ్ర హీరోలు! | Top Heroes And Other Kollywood Stars Comedy Actor Yogi Babu Daughter Bharani Karthika First Birthday Celebration - Sakshi
Sakshi News home page

Yogi Babu: కమెడియన్ యోగిబాబు కూతురు బర్త్‌డే వేడుకలు.. ఫోటోలు వైరల్!

Oct 25 2023 8:56 AM | Updated on Oct 25 2023 9:37 AM

Kollywood Star Comedian Yogi Babu Daughter Birthday Celebrations - Sakshi

కోలీవుడ్ ప్రముఖ కమెడియన్ యోగిబాబు గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన పనిలేదు. కోలీవుడ్‌తో పాటు తెలుగు ప్రేక్షకులను తన కామెడీతో అలరిస్తూనే ఉన్నారు. తాజాగా తన ముద్దుల కూతురు మొదటి బర్త్‌డేను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో కోలీవుడ్ స్టార్ హీరోలు, సినీ ప్రముఖులు పెద్దఎత్తున పాల్గొన్నారు. సూర్య, కార్తీ, విజయ్ సేతుపతి బర్త్‌ డే వేడుకలకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. 

(ఇది చదవండి: 'పదేళ్ల పనిని వారంలో చేశారు'.. ఆ డైలాగ్‌పై నటుడి ప్రశంసలు!)

కోలీవుడ్‌ సినిమాల్లో యోగిబాబు తనదైన కామెడీతో అభిమానులను సంపాదించుకున్నారు. కమెడియన్‌గా ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. ఇటీవలే రిలీజైన రజినీకాంత్‌ చిత్రం జైలర్‌లోనూ మెప్పించారు.  షారుక్‌ ఖాన్, నయనతార జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ జవాన్‌లో కనిపించారు. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోన్న సైన్స్ ఫిక్షన్ చిత్రం అయాలన్‌లో నటిస్తున్నారు.

(ఇది చదవండి: మెగా ఫోన్‌ పట్టనున్న రామ్ చరణ్ విలన్!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement