తెలుగులో స్ట్రీమింగ్‌ అవుతున్న బ్లాక్ బస్టర్ సినిమా | Kill Movie OTT Streaming In Telugu | Sakshi
Sakshi News home page

తెలుగులో స్ట్రీమింగ్‌ అవుతున్న బ్లాక్ బస్టర్ సినిమా

Sep 24 2024 11:43 AM | Updated on Sep 24 2024 4:30 PM

Kill Movie OTT Streaming In Telugu

బాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌ అందుకున్న 'కిల్‌' సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్న విషయం తెలిసిందే. అయితే, తెలుగు ప్రేక్షకులకు మేకర్స్‌ శుభవార్త చెప్పారు.  లక్ష్‌ లాల్వానీ , తాన్య మనక్తిలా జంటగా నటించిన ఈ సినిమా జులై 5న విడుదలైంది. దేశవ్యాప్తంగా ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించారు. మోస్ట్ వయోలెంట్ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం ఓటీటీలో కూడా ట్రెండ్‌ అవుతుంది. అయితే, హిందీ వర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. తాజాగా తెలుగు, తమిళ్‌ వర్షన్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.

'కిల్‌' చిత్రంలో ఎక్కువగా హింస ఉందంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వచ్చాయి. అయినప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్స్‌ అందుకుంది. సెప్టెంబర్ 6 నుంచి హిందీలో మాత్రమే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో  స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం నేటి నుంచి (సెప్టెంబర్‌ 24) తెలుగు, తమిళ్‌ వర్షన్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది. దీంతో 'కిల్‌' సినిమా అభిమానులు సంతోషిస్తున్నారు.

కథేంటి..?
అమిత్ రాథోడ్ (లక్ష్య లల్వానీ) ఆర్మీలో ఎన్ఎస్‌జీ కమాండర్. తులికా (తన్య మనిక్తలా) అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్‌లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్‌ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్‌ ఎక్కుతాడు. ఓ స్టేషన్‌లో ఇదే ట్రైన్‌లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ల వల్ల తులికా కుటుంబానికి ఊహించని చిక్కులు! తర్వాత ఏమైంది? తులికా ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్లని అమిత్ కాపాడాడా లేదా అనేది స్టోరీ.

Advertisement
 
Advertisement
Advertisement