వైవిధ్యభరిత సినిమాలు తీసిన తమిళ దర్శకుల్లో కార్తీక్ సుబ్బరాజ్ ఒకడు. 2012లో 'పిజ్జా' మూవీతో డైరెక్టర్ అయ్యాడు. వరుస చిత్రాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. చివరగా గతేడాది సూర్యతో 'రెట్రో' తీస్తే ఇది బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిలైంది. అంతకు ముందు 'జిగర్‌తండా డబులెక్స్' పర్లేదనిపించింది. కాగా చిన్న గ్యాప్ తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ మళ్లీ డైరెక్షన్ చేయడానికి రెడీ అయిపోయాడు.
(ఇదీ చదవండి: సగం రెమ్యునరేషన్‌కే సినిమా చేసిన స్టార్ కమెడియన్)
ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా తీయబోతున్నాడు. ఇందులో అధర్వ హీరో. కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర చేస్తున్నాడు. ప్రభుదేవా హీరోకి తండ్రిగా కనిపించనున్నాడు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది. అయితే గతంలో రజనీకాంత్‌తో 'పెట్టా', సూర్యతో 'రెట్రో', ధనుష్‌తో 'జగమే తంత్రం', విక్రమ్‌తో 'మహాన్' లాంటి మూవీస్ చేసి.. ఇప్పుడు మిడ్ రేంజ్ హీరోతో చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)


