బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న తాజా సినిమా ‘ఎన్‌బీకే111’ (వర్కింగ్ టైటిల్). ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ముంబై నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాను వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.
శుక్రవారం (జూన్ 19) కాజల్ అగర్వాల్ బర్త్ డే సందర్భంగా ‘ఎన్‌బీకే 111’ నుంచి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘ప్రతి తుఫాను వెనుక ఓ కారణం ఉంటుంది’ అంటూ కాజల్ పాత్ర స్వభావాన్ని ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో తెలియజేసే ప్రయత్నం చేసింది యూనిట్. ఈ చిత్రానికి సంగీతం: తమన్.


