
బాలీవుడ్ సినిమాల పరిస్థితి ఒకప్పటితో పోలిస్తే ఘోరంగానే ఉంది. స్టార్ హీరోలు వరసగా మూవీస్ చేస్తున్నారు కానీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కావట్లేదు. అలాంటిది ఈ ఏడాది 'ఛావా' అనే చిత్రం అనుహ్యమైన విజయం సాధించింది. రూ.800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అందరినీ అబ్బురపరిచింది. దేశవ్యాప్తంగా ఈ మూవీ చూసి చాలామంది మెచ్చుకున్నారు. అయితే ఇలాంటి సినిమాలు తన లైఫ్‌లో అస్సలు చేయనని, ఇలాంటి తీయడం సరికాదు అని బాలీవుడ్‌కి చెందిన హీరో జాన్ అబ్రహం చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సూపర్ మ్యాన్' లేటెస్ట్ సినిమా)
జాన్ అబ్రహం లేటెస్ట్ సినిమా 'టెహ్రాన్'.. ఆగస్టు 14న నేరుగా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దీని ప్రమోషన్స్‌లో పాల్గొన్న జాన్.. ఓ ఇంగ్లీష్ వెబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ఛావా', 'ద కశ్మీర్ ఫైల్స్', 'ద కేరళ స్టోరీ' తదితర చిత్రాలపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. జీవితంలో అలాంటి చిత్రాలు చేయనని తెగేసి చెప్పాడు. తన అభిప్రాయాన్ని కూడా వెల్లడించాడు.
'ప్రేక్షకులు మనతో మంచిగా ఉంటారు. కాబట్టి అందుకు తగ్గ సినిమాలు తీయాల్సిన బాధ్యత ఫిల్మ్ మేకర్స్‌పై ఉంది. నేను రైట్ వింగ్ లేదా లెఫ్ట్ వింగ్‌కి చెందినవాడిని కాదు. నాకు రాజకీయాలతో సంబంధం లేదు. అయితే రైట్ వింగ్‌కి చెందిన కొన్ని సినిమాలు.. ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం చూస్తుంటే ఆందోళనగా ఉంది. ప్రేక్షకులకు నచ్చాయని తెలుసు కానీ నేను ఇప్పటివరకు 'ఛావా', 'కశ్మీర్ ఫైల్స్' సినిమాలు నేను చూడలేదు. ఇలాంటి మూవీస్ ఎప్పటికీ చేయను. ఓ వర్గం ప్రజల్ని ఇవి ప్రభావితం చేయడం చూస్తుంటే నాకు భయమేస్తోంది' అని జాన్ అబ్రహం తన అభిప్రాయాన్ని చెప్పాడు.
(ఇదీ చదవండి: 'కూలీ' రెమ్యునరేషన్.. ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ?)