అతనితో డేటింగ్‌.. తొలిసారి నోరువిప్పిన ముద్దుగుమ్మ! | Janhvi Kapoor Open About Her Boy Friend In Movie Promotions | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: బాయ్‌ఫ్రెండ్‌తో డేటింగ్‌... తొలిసారి నోరువిప్పిన దేవర భామ!

May 17 2024 9:50 PM | Updated on May 18 2024 9:23 AM

Janhvi Kapoor Open About Her Boy Friend In Movie Promotions

శ్రీదేవి ముద్దుల కూతురు, బాలీవుడ్ భామ జాన్వీకపూర్‌ దేవరలో జూనియర్ సరసన నటిస్తోంది. ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది ముద్దుగుమ్మ. ప్రస్తుతం మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహీ చిత్రంతో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్న జాన్వీ కపూర్‌ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతోంది. ఇటీవలే తన కాబోయే వరుడి గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. తాజాగా బాయ్‌ఫ్రెండ్‌ శిఖర్ ‍పహారియా గురించి  మొదటిసారి  నోరు విప్పింది దేవర భామ.

జాన్వీ మాట్లాడుతూ..'నాకు 15 ఏళ్లు ఉన్నప్పుడే శిఖర్ నా లైఫ్‌లోకి వచ్చాడు. మేమిద్దరం కలసి పెరిగాం. అతను నా కలలను తనవిగా ఫీలవుతాడు. అలాగే నేను కూడా అతని కలలు నా సొంతం అనుకుంటా. మేమిద్దరం చాలా సన్నిహితంగా ఉంటాం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మాకు మేము మద్దతుగా ఉంటాం' అని తెలిపింది. 

కాగా.. ఇటీవల ఇంటర్వ్యూలో తనకు కాబోయే భర్త ఇలాంటి లక్షణాలు ఉండాలంటూ చెప్పుకొచ్చింది. గతంలోనూ బోనీ కపూర్‌ సైతం శిఖర్‌పై ప్రశంసలు కురిపించారు. మంచివాడని.. అందరితో త్వరగా కలిసిపోతారని తెలిపారు. జాన్వీతో పరిచయం కాకముందు ముందునుంచే శిఖర్‌ తనకు తెలుసని బోనీ అన్నారు. కాగా.. జాన్వీ  నటించిన మిస్టర్‌ అండ్‌ మిసెస్ మహీ ఈనెల 31న థియేటర్లలో సందడి చేయనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement