తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ హీరోయిన్‌గా పరిచయం కానున్నారు. ప్రియదర్శి హీరోగా నటించనున్న ఈ సినిమాకి వంశీ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. బన్నీ వాసు వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బన్నీ వాసు, సుకుమార్ నిర్మించనున్న ఈ సినిమా ఈ నెల 25న ప్రారంభం కానుంది.
ఈ సినిమాతో నాగదుర్గ హీరోయిన్‌గా పరిచయం కానున్న విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ‘‘నాగదుర్గ చేసిన అనేక తెలంగాణ ఫోక్ సాంగ్స్ రికార్డ్ స్థాయి వ్యూస్ సాధించాయి. తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో ఈ సినిమాను వంశీ రెడ్డి రూపొందించనున్నారు. జూలైలో రెగ్యులర్ షూటింగ్ ఆరంభిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.


