
ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) అందానికి మంత్రముగ్ధులు కానివారు ఉండరు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఆమెను ఆరాధించారు. కొందరు ఆమెతో ప్రేమలో పడ్డారు, ఒకరిద్దరు ఆమె ప్రేమను తిరిగి పొందారు. వారిలో ఒకరే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan). ఒకప్పుడు సల్మాన్ - ఐశ్వర్య ప్రేమించుకున్నారు. కానీ కొంతకాలానికే బ్రేకప్ చెప్పుకున్నారు. 2002లో వీరి బ్రేకప్ స్టోరీ బీటౌన్‌లో సంచనలంగా మారింది.
సల్మాన్‌తో బ్రేకప్
తాజాగా దర్శకుడు ప్రహ్లాద్ కక్కర్.. ఐష్- సల్మాన్‌ల బ్రేకప్ గురించి మాట్లాడారు. ఈయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సల్మాన్‌తో బ్రేకప్ అయ్యాక బాలీవుడ్ ఇండస్ట్రీ ఆమెను దూరం పెట్టింది. అప్పుడు తను చాలా బాధపడింది. వీటి గురించి పట్టించుకోవద్దని ఆమెకు ధైర్యం చెప్పేవాడిని. సల్మాన్ కోసం ఇండస్ట్రీ తనను వెలేయడం తట్టుకోలేకపోయింది. అయితే బ్రేకప్ తర్వాతే తను కాస్త ప్రశాంత జీవితం గడిపింది. ఎందుకంటే తను అతి ప్రేమ, కోపంతో పిచ్చిపట్టినట్లు ప్రవర్తించేవాడు.
తల గోడకేసి బాదుకునేవాడు
నేనూ అదే అపార్ట్‌మెంట్‌లో ఉండేవాడిని కాబట్టి తను వచ్చివెళ్లేది కనిపిస్తూ ఉండేది. అతడి ప్రవర్తన చూశాక.. ఇలాంటి వ్యక్తితో ఎలా ఉంటున్నావ్? అని అడిగాను. అతడు ఐశ్వర్య కోసం ఆమె ఇంటికి వచ్చి పెద్ద సీన్ క్రియేట్ చేసేవాడు. తల గోడకేసి బాదుకునేవాడు. అధికారికంగా ప్రకటించే సమయానికంటే ముందే వీళ్లిద్దరూ విడిపోయారు అని చెప్పుకొచ్చారు. కాగా 2007వ సంవత్సరంలో ఐశ్వర్య.. బిగ్‌బీ కుమారుడు, నటుడు అభిషేక్ బచ్చన్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి కూతురు ఆరాధ్య సంతానం.
చదవండి: ఒక్క డైలాగ్‌తో ఫేమస్.. నా గొంతు మార్చేశారు, ఇది చాలా తప్పు!